రాధికా రెడ్డి మరణం ఏం చెప్తోంది


సినిమారంగం, టివి రంగం ఈ రెండూ పైకి అందంగా కన్పిస్తాయి కానీ..తెలియనంత ఒత్తిడి కూడా ఉంటుంది. ప్రముఖ ఛానెల్‌లో పని చేసిన రాధికారెడ్డి అనే యాంకర్ మరణం ఇదే విషయాన్ని నిర్ధారిస్తోంది. చిన్న స్థాయి నుంచి కష్టపడి పని చేసుకుంటూ..కెరీర్‌లో ఒక స్థిరపడే స్థాయికి వచ్చిన రాధికారెడ్డి గతంలో అనేక ఛానళ్లలో పని చేశారు. ఆదివారం మద్యాహ్నం షిప్ట్‌లో పని చేసి ఇంటికి వచ్చిన ఆమె సడన్‌గా ఇలా ఆత్మహత్య చేసుకుంది అనడం ఎవరూ
జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐతే ఇక్కడ సూసైడ్ నోట్ కూడా దొరికిందని పోలీసులు చెప్తున్నారు..నా చావుకి నేనే కారణం..భరించలేనంత డిప్రెషన్‌లో ఉన్నా అని రాశారని..నా మైండే నా సమస్యలకు కారణం అని కూడా తన చివరి లేఖలో రాసిందని చెప్తున్నారు. ఇదే అనేక అనుమానాలకు తావివ్వక మానదు. పైగా సూసైడ్ లేఖ కూడా ఒక పాత రెజ్యూమ్ వెనుక నాలుగంటే నాలుగే లైన్లలో రాసి పెట్టడం చూడొచ్చు..

రాధికారెడ్డికి వివాహం అయి...ఆర్నెల్ల క్రితమే విడాకులు తీసుకున్నారని చెప్తున్నారు. అంటే ఒకరకంగా ఇదే ఆమెపై మానసిక ఒత్తిడి పెంచిందని అన్పిస్తోంది. మరోవైపు పని చేసే చోట వేధింపులు ఏమైనా చోటు చేసుకున్నాయా అనే కోణంలో కూడా ప్రశ్నలు లెత్తుతున్నాయ్. హైదరాబాద్ మూసాపేటలో సువీలా అపార్ట్‌మెంట్‌లో ఆమె నివాసం ఉండేవారు. ఇంకా విషాదం ఏమిటంటే..తనకి ఒక మెంటల్లీ ఛాలెంజ్డ్ బాబు ఒకరు ఉన్నారట..భర్తని వదిలి ఉండాల్సి రావడంతో పాటు, కొడుకు మానసిక పరిస్థితి కూడా రాధికని కుంగదీశాయని చెప్పొచ్చు. అనేక చర్చా క్రమాల్లో డిప్రెషన్‌ని ఎలా ఎదుర్కోవచ్చో మాట్లాడుకున్న యాంకర్లే ఇలా బలవన్మరణాలకు పాల్పడటం బాధాకరం. కూకట్ పల్లిపోలీసులు కేసు దర్యాప్తు చేస్తుండగా..చివరిగా ఆమె ఫోన్ కాల్స్, మాటలను విశ్లేషిస్తే..ఆమె సూసైడ్‌కి నిజమైన కారణాలను తెలుసుకోవచ్చని అంటున్నారు. 36 ఏళ్ల వయస్సులోనే ఇలా తనువు చాలించాల్సి రావడంతో రాధికారెడ్డి తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.  సూసైడ్ లేఖలో ఎవరూ కారణం కాదని రాసినా...అందుకు ప్రేరేపించింది మాత్రం భర్తే అనే అనుమానాలు వ్యక్తం కావడం సహజం..ఐతే పోలీసులు దర్యాప్తు తేలేవరకూ ఎవరినీ దోషులుగా చెప్పే పరిస్థితి లేదు

Comments