ఊబిలాంటి ఆ ఊళ్లో గోడలన్నీ వజ్రాలతోనే


భూప్రపంచంలోని కొన్ని ప్రదేశాలు వాటి  భౌగోళిక పరిస్థితులను  ప్రత్యేకతను సంతరించుకుంటాయ్. ఇప్పుడు మనం చూడబోయే ఊరు కూడా అలాంటి వాటిలో ఒకటి భూమికి కొన్ని అడుగుల ఎత్తునుంచి చూస్తే ఊరంతా గుండ్రటి బంతి ఆకారంలో వ్యాపించి ఉంటుంది. పై నుంచి తీసిన పోటోలాగా కాకుండా..నిజంగానే అది గుండ్రంగా ఉండటానికి ఓ కారణం ఉంది. ఎప్పుడో కోట్లాది సంవత్సరాల క్రితం సంభవించిన సంఘటనతో ఇలా జరిగిందట..ఇంతకీ అసలు విషయం ఏమిటంటే..కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం విశ్వంలో గ్రహాలు ఢీ కొనడం దానితో అవి ముక్కలు ముక్కలుగా భూమిపై పడటం జరుగుతుండేదని సైంటిస్టులు చెప్తుంటారు. దానికే ఉల్కాపాతమని పేరు. అలాంటి ఉల్కాపాతమే జర్మనీలోని బవేరియాలో చోటు చేసుకుందంటారు..అలా  ఒకానొక ప్రదేశంలో పెద్ద గొయ్యి ఏర్పడింది. అలాంటి లోతైన బిలం నుంచే ఒక ఊరు వెలసింది. అదే నార్డ్ లింగెన్. గుండ్రంగా ఉన్న గ్రామంగానే కాకుండా..ఇతర ప్రత్యేకతలు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతారు. ఇక్కడి భవంతులు అన్నీ రాతితో నిర్మించనవే కన్పిస్తాయి. ఐతే ఇందులోనే అసలు విశేషం దాగి ఉంది..ఆ రాతి గోడలలో లక్షలాది వజ్రాలు పొదిగి ఉండటమే ఆశ్చర్యం. మిల్లీ మీటర్ కంటే తక్కువ సైజులో ఉన్న వజ్రాలు ఈ గోడలలో కన్పిస్తాయి. అలానే ఇక్కడి నేలను తవ్వితే విలువైన 72వేల టన్నులు ముడి బంగారం లభ్యమవుతుందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.  ముందుగా చరిత్రలో ఈ ఊరి గురించిన ప్రస్తావన 898లో ఉంది..తర్వాత 1998లో నార్త్ లింగెన్ దీనికి సంబంధించి 1100సంవత్సర వేడుకలు కూడా జరుపుకుంది. అంటే సహస్రాబ్దికిపైన మరో వందేళ్ల ఉత్సవాలన్నమాట. క్రీస్తు శకం 1463లోనే ఇక్కడ గుర్రప్పందేలు జరిగాయట. ప్రపంచంలోనే తొలి హార్స్ టోర్నమెంట్‌గా ఇది చరిత్రపుటలకెక్కింది. క్రీస్తు శకం 85 సంవత్సరం నాటి రోమన్ కేజిల్ అంటే..రోమన్ల కోట ఈ ఊరి కింద తవ్వకాల్లో బైటపడింది.అప్పట్నుంచే ఇక్కడి ప్రత్యేకతలు బైటి ప్రపంచానికి తెలియడం ప్రారంభమైంది. ముందుగా ఈ ఊరు భౌగోళిక స్వరూపానికి కారణం గతంలో ఇక్కడ ఓ  అగ్ని పర్వతం ఉండటం వలన అనుకున్నారు..ఐతే స్థానక చర్చి గోడలను పరిశీలించిన సైంటిస్టులు ఉల్కల శిధిలాలు వాటిలో ఉండటం గమనించారు. తర్వాత అనేక పరీక్షల తర్వాత అది ఉల్కాపాతంతో ఏర్పడిన శిలాజంగా నిర్ధారించారు. ఆ తర్వాత జరిగిన పరిశోధనలతో  జర్మనీ దేశపు అతి పురాతన ప్రదేశాల్లో నార్త్ లింగెన్‌ని కూడా చేర్చారు .వ్యభిచారాన్నివృత్తిగా స్వీకరించడం కూడా ఇక్కడే మొదలైనట్లు 1471నాటి డాక్యుమెంట్లు చెప్తాయ్. ఈ దేశంలో ప్రాస్టిట్యూషన్ చట్టబద్దం చేయబడింది కూడా..1604లో విలియం షేక్స్ స్పియర్ రాసిన రోమియో జూలియట్ నాటకం ఇక్కడ తొలిసారిగా ప్రదర్శించబడిన దాఖలా ఉంది. అప్పట్లో ఇలా నాటకాలు ప్రదర్శించడానికి అనుమతులు ఇచ్చేవాళ్లు కాదు. ఐనా నాటకం ప్రదర్శించడంతో...తర్వాత అందులోని పాత్రధారులకు జరిమానా విధించారట. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఊరి జనాభా కేవలం 20వేల మంది మాత్రమే..ఈ జనాభా కూడా గత యాభైఏళ్లలో వృధ్ది చెందిన సంతతి కావడం గమనార్హం.





Comments