భరత్ అను నేనులో స్పీకర్ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలుసా


మహేష్ కొత్త సినిమా భరత్ అను నేను విడుదలకి ముందే అనేక రికార్డులు సృష్టిస్తోంది. నిర్మాత కూడా వారానికో పాట వదులుతూ ప్రేక్షకుల్లో అంచనాలను, ఉత్సుకతను కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మహేష్ బాబు నటిస్తుండగా..ఇతర ముఖ్యపాత్రలని శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, ఆమని, సితార పోషిస్తున్నారు. విదేశాలలో చదువు కొని ఇక్కడ తన తల్లిదండ్రుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించే పాత్ర మహేష్‌ది. ఈ క్రమంలో తన సొంత పార్టీలోని ప్రత్యర్ధులు..ఇతర పార్టీ నేతలకి గిట్టని నిర్ణయాలు తీసుకుంటాడు మహేష్..ట్రైలర్లు..టీజర్లు చూసిన తర్వాత వచ్చే ఇంప్రెషన్ ఇది. ఇలాంటి కథతోనే శేఖర్ లీడర్ అనే సినిమా తీశాడు. అది హిట్టో ఫ్లాపో తెలీని పరిస్థితి..ఐతే ఈసారి చేస్తోంది మహేష్, కొరటాల శివ కావడంతో దీనిపై ఎక్స్ పెక్టేషన్స్ బాగానే ఉన్నాయ్. మంచి పాటలు ఉండటం..డైరక్టర్ సినిమాలు వరసగా హిట్ కావడంతో సినిమా సక్సెస్‌ అవుతుందనే వారు ఎక్కువగానే ఉన్నారు. ఐతే రాజకీయ నేపధ్యం ఉన్న సిినిమా కావడంతో ఇందులో కొన్ని పదవులు కూడా కీలకంగా మారే అవకాశం కన్పిస్తోంది. 

ఇందుకోసం ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న టీజర్ ని జాగ్రత్తగా వింటే   " హౌస్ లో ఉన్న వాళ్ల డౌట్స్ అన్నీ క్లియర్ అయితే విత్ యువర్ పర్మిషన్ ఐ విల్ టేక్ ఏ లీవ్  మేడమ్ స్పీకర్ " అనే వ్యాక్యం పట్టుకోవచ్చు...అంటే ఇక్కడ స్పీకర్ పాత్రలో ఓ మహిళ నటిస్తుందనేది తెలుసుకోవచ్చు..మరి ఈ క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారు..డైలాగ్ విన్పిస్తున్నప్పుడు విజువల్ కనుక చూసినట్లైతే..అక్కడో లేడీ కూడా సీట్లో కూర్చుని కన్పిస్తుంది..ఆమే ఆమని అనేవాళ్లున్నారు..కానీ ఆమని ఇందులో పోలీస్ ఆఫీస‌ర్‌గా చేస్తుందని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది..కాబట్టి స్పీకర్ క్యారెక్టర్ చేస్తున్నదెవరో ఊహిస్తే సినిమా జీవితంలో యాభైఏళ్ల కెరీర్ పూర్తి చేస్కున్న రమాప్రభ. హాస్యపాత్రలు, సహాయపాత్రలు చేయడంలో దిట్ట అయిన రమాప్రభకి ఇదో కీలక పాత్ర అని చెప్పాలి. ప్రస్తుత రాజకీయాల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై వేటు వేయకుండా చోద్యం చూసే ఈ పాత్రలో ఆమె  తీసుకునే నిర్ణయాలు సిినిమాని మలుపు తిప్పుతాయంటున్నారు. ఇలా ప్రతి పాత్రకీ సినేమాలో ప్రాధాన్యత కల్పించే కొరటాల శివ..భరత్ అను నేనుని ఓ మంచి చిత్రంగా రూపొందించారని టాక్ విన్పిస్తోంది. ఇక ఫుల్ డీటైల్స్ కోసం మాత్రం ఏప్రిల్ 20 వరకూ ఆగాల్సిందే 

Comments