వాటే జొక్..రొడ్లపై టిఆర్ఎస్ వాహనాలే నడవాలా..?


చాలా రొజుల తర్వాత తెలంగాణలొ కాంగ్రెస్ నేతలు అధికారపార్టీపై మంచి జొక్ ఒకటి వేశారు. ఐతే అది తమ పార్టీపై వచ్చిన విమర్శలకొ..కామెంట్లకొ కవుంటర్‌గా కాదు..కొదండరామ్ ‌సభకి పొలీసులు అనుమతి ఇవ్వలేదు..దీనికి వాళ్లు చెప్పిన కారణం ఏమిటంటే..ఆయన సభకి వచ్చే వాహనాల వలన..సభలొ ప్రసంగాల వలన కాలుష్యం పెరుగుతందని అనుమతి ఇవ్వడం కుదరదని తేల్చేశారట.

తెలంగాణ జనసమితి పేరుతొ ఒక పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేసిన కొదండరామ్‌కి జనం మద్దతు ఏమొకానీ..కనీసం సభలు కూడా పెట్టుకొలేని దుస్థితి దాపురించడం విధి వైచిత్ర్యమే..నాలుగేళ్ల క్రితం ఆయన పిలుపు ఇస్తే చాలు ఒయూ జేఏసీతొ పాటు కనీసం వెయ్యిమంది ఆయన వెనుక నడిచేవాళ్లు..కానీ..ఇప్పుడు టీఆర్ఎస్ అధినాయకత్వం ఆయనపై ఎఁదుకు కినుక చేసిందొ తెలీదు..అప్పట్నుంచీ పాపం చిన్నపాటి నిరసనలొ కూడా పాల్గొననీయకుండా కట్టడి చేసేసింది. ఇప్పుడు ఎల్‌బి స్టేడియంలొ సభపెడితే కాలుష్యం కారణంగా జరగనీయమని చెప్పడం హాస్యాస్పదం..అసలు ఆయన సభకి ఎంతమంది వస్తారని అంచనా ఏమైనా ఉఁదా.. ఇదే స్టేడియంలొ భరత్ అను నేను ఫంక్షన్ చేశారు..రేపు వచ్చే రొజుల్లొ టీఆర్ఎస్ 30లక్షలమందితొ బహిరంగసభ కూడా పెడతానంటొందీ ఇక్కడే..మరి అక్కడ లేని ఈ సమస్య ఈ కొదండరామ్ సభకే వస్తదా..
ఇది దృష్టిలొ పెట్టుకునే..ఇంకా నయం కాలుష్యం చొటు చేసుకుంటుందని కొన్ని రొజుల తర్వాత టిఆర్ఎస్ వెహికల్స్‌నే రొడ్లపైన తిప్పమంటారేమొ అని కాంగ్రెస్ లీడర్లు జొకులు వేస్తున్నారు

Comments