వర్మ..వీడింతే..మారడంతే


కాసేపు ఒట్టేశాను ఇక మాట్లాడను అంటాడు..ఆ మాట అని 10 గంటలు కూడా గడవకముందే మళ్లీ ట్వీట్లతో పవన్ కల్యాణ్‌పై విమర్శలు గుప్పించాడు వర్మ. అది కూడా  ఎగతాళి ధోరణితో..మీరు మీటింగులు పెట్టుకోవడమే తప్ప నన్నేం చేయలేరు అనే ధోరణితో..నన్ను ఇతరులతో కలిపి విమర్శలు చేస్తున్నారు కాబట్టి..మా అమ్మ పై వేసిన
ఒట్టు తీసి గట్టుమీద పెడుతున్నా అఁటూ చిన్నపిల్లాడిలా ట్వీట్ చేశాడు..జీవితంలో మొదటిసారి ఓ క్లయింట్ లాయర్లతో మాట్లాడటం ప్రత్యక్షంగా చూశానంటూ ఒక ట్వీట్ వేసిన వర్మ. వెంటనే మళ్లీ బాల్ థాకర్ యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో..పవన్ కల్యాణ్ ఇప్పుడలా ఉన్నాడంటూ మరో ట్వీట్ చేశాడు రాంగోపాల్ వర్మ.
ఆ తర్వాత పాపం పవన్ కల్యాణ్ మంచి లాయర్లని పెట్టుకోవాల్సింది వాళ్లని చూస్తుంటే పాత కోట్లు అద్దెకి తెచ్చుకుని వేసుకున్నట్లుంది అంటూ ఎద్దేవా చేశాడు.

అంటే నా లాయర్లకంటే నేనే తెలివైన వాడిని అని చెప్పుకోవడానికి డబ్బా కొట్టుకోవడానికే ఇదంతా చేస్తున్నాడా అంటూ వర్మ వేసిన ట్వీట్స్ కొంతమందికి నవ్వు పుట్టించాయ్. పవన్ ఫ్యాన్స్ మాత్రం వీరావేశంతో రగిలిపోతున్నారు. వర్మ ఒంటరిగా కన్పిస్తే తాట తీస్తామంటూ హెచ్చరిస్తున్నారు కూడా..మొత్తం మీద వర్మ తీరు చూస్తుంటే..తాను పట్టిందే పట్టు తప్ప..ఎవరేమనుకున్నా..తనకి అనవసరం అనుకునే టైప్ అని మరోసారి ప్రూవ్ చేశాడు. అసలు క్షమాపణ 20సార్లు చెప్పానన్న నోటితోనే ఇలాంటి కామెంట్లు పెడుతున్నాడంటే వర్మ నైజం  అంటే ఏంటో తెలుస్తోంది.    అసలు ఇవన్నీ చూసినప్పుడు అసలు వర్మకీ చిరంజీవి ఫ్యామిలీకి ఎక్కడ చెడింది అనే అనుమానం రాక తప్పదు. దానికి బీజం పడింది మాత్రం 1998లో అని తెలుస్తుంది..చూడాలని ఉంది సినిమా సమయం అది దానికి ముందే అదే బ్యానర్‌లో భూలోకవీరుడు అని చిరంజీవి, ఊర్మిళ హీరోహీరోయిన్లుగా ఓ సినిమా ప్రారంభం అయింది.
ఆ సమయంలో రామ్ గోపాల్ వర్మ హిందీలో నాయక్ అనే సినిమా తీస్తున్నాడు. అందులో హీరో సంజయ్ దత్..అతగాడిపై ఏకే 47 గన్ ఉన్నందుకు కేస్ రిజిస్టర్ అవడం జైల్లో పడటం జరిగింది. ఈ గ్యాప్‌లో వర్మ అశ్వనీదత్‌ని అప్రోచ్ అవగా..పైన చెప్పిన భూలోకవీరుడు ప్రారంభం అయింది.కర్నాటకలోని చిక్ మగళూరులో షూటింగ్..రెండు పాటలు తీశారు..అప్పుడే రామ్ గోపాల్ వర్మ సడన్‌గా జంప్ అయ్యాడు . కారణం ఏంటని చూస్తే..సంజయ్ దత్ కి బెయిల్ దొరకడంతో బైటికి వచ్చాడు..వెంటనే ఈ సదరు వర్మ బాంబే వెళ్లిపోయి అక్కడ తన పని చూసుకోవడం ప్రారంభించాడు..ఇది అశ్వనీదత్, చిరంజీవికి బాగా కోపం తెప్పించింది. కనీసం నోటి మాట కూడా చెప్పకుండా ఇలా
లొకేషన్‌ నుంచి వర్మ వెళ్లిపోవడంతో ఆర్ధికంగా నష్టపోవాల్సి వచ్చింది. ఇక్కడ వర్మ తీసిని రెండు పాటలనే..చూడాలని ఉందిలో రిలీజైన 100రోజుల తర్వాత యాడ్ చేశారు. కానీ అప్పట్నుంచే వర్మ అంటే చిరంజీవికి చెడు అభిప్రాయం ఏర్పడింది..దీన్ని తొలగించుకోవడానికి వర్మ కూడా ట్రై చేయలేదు..చిరంజీవిలాంటి పెద్ద హీరోతో సిని్మా తీయాలంటే నేను తీయలేను..ఎందుకంటే ఆయన ఇమేజ్ చాలా పెద్దది అంటూ బిస్కెట్ డైలాగ్స్ వేసేవాడే తప్ప ఎక్కడా అప్రోచ్ అయిన దాఖలాలు కూడా లేవ్..ఐతే అప్పట్లో మెయిల్సే తప్ప..ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లేవు.

.ఎప్పుడైతే ఇవి మనుగడలోకి వచ్చాయో వెంటనే వర్మ వీటిలో యాక్టివ్ అయ్యాడు. తనకి ఏ టాపిక్ దొరికితే దానిపై స్పందించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో వర్మ చిరంజీవి ఫ్యామిలీపై కూడా ఇలానే కామెంట్లు పెట్టాడు. తనకి అన్పించిన కామెంట్లు అవతలివారిని ఎలా రియాక్టయ్యేలా చేస్తాయో తెలిసి కూడా అలానే పోస్టులు పెడతాడు..పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ గొర్రెలని కామెంట్ చేయడం..చిరంజీవి 150వ సినిమా ఓ  తమిళ రీమేక్ ఎందుకు చేయాలి అనడం వంటివి చిరంజీవి కాంపౌండ్‌లో కలకలం రేపాయ్. ఇదే పవన్ కల్యాణ్ గతంలో కూడా వర్మ తీరుపై పెద్దగా స్పందించలేదు.పొద్దున లేస్తే పోర్న్ చూస్తానని చెప్పే వర్మ కామెంట్లపై నేనెందుకు స్పందించాలి ఆయన ప్రస్ట్రేషన్‌లో ఉన్నాడని లైట్ తీసుకునేవారు..కానీ ఈ మధ్యలో అమితాబ్ బచ్చన్ తో పూరీజగ్నాధ్ తీసిన బుడ్డాహోగా తేరా బాప్ ప్రమోషన్ సమయంలో మాత్రం మెగాస్టార్‌తో వేదికపై బాగా కలివిడిగా వ్యవహరించాడు..ఐతే ఆ తర్వాతా తన వరస మార్చుకుండా పవన్ కల్యాణ్ రామ్ చరణ్, చిరంజీవిపై కామెంట్లు కొనసాగించాడు. ఖైదీనంబర్ 150 రిలీజైన తర్వాతా అదే తీరు. అలా అలా రేగుతోన్న ఈ రగడ..ఇప్పుడు శ్రీలేఖ వెనుక ఉన్నది నేనే అని చెప్పడంతో పీక్ స్టేజ్‌కి వెళ్లిపోయింది. సహనం చచ్చిపోయే మెగా ఫ్యామిలీ ఇప్పుడు వర్మపై దండెత్తితే..అతను మాత్రం వాళ్లని రెచ్చగొట్టి సరదా చూస్తున్నాడు. అందుకే వర్మని చూస్తే..ఇతగాడింతే..మారడంతే అన్పిస్తుంది

Comments