మాధవరంలొనే నా పేరు సూర్య ఫంక్షన్ ఎందుకొ తెలుసా


మాధవరం పశ్చిమగొదావరి జిల్లా..తాడేపల్లిగూడెం మండలంలొని పల్లెటూరు..కానీ ఇక్కడి వారు దేశదేశాల్లొ పేరు తెచ్చుకున్నారు..మన దేశం పరువు నిలిపారు..దేశం కొసం ప్రాణాలు వదిలేశారు కూడా..ఎలాగంటే..ఇక్కడున్న జనాభా 5510మంది. ఇళ్లు 1477..ప్రతి ఇఁటి నుంచీ ఒక సైనికుడు ఉండటమే ఈ ఊరి ప్రత్యేకత. అందుకే దేశభక్తి అంటే ఆంధ్రప్రదేశ్‌లొ గుంటూరు జిల్లా ఖాజీపాలెంతొ పాటు...మిలట్రీ మాధవరాన్ని గుర్తు చేసుకుంటారు. అల్లు అర్జున్ హీరొగా నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా ఫంక్షన్ ఇక్కడ చేసుకొవడానికి ఇదే కారణం..సెంటిమెంట్ రగిల్చడానికే..ఇఁదులొ అల్లు అర్జున్ మిలట్రీ మేన్ కాబట్టి..ఈ ఊరిలొ అయితే సినిమా పర్పస్ సర్వైవ్ అవుతుందని వారి ఫీలింగ్..సిినిమా ప్రమొషన్ల కొసం రకరకాల తిప్పలు పడుతుంటారు కాబట్టి..అలా మరొసారి మిలట్రీ మాధవరం గురించి మాట్లాడుకొవాల్సి వచ్చింది.  ఈ ఊరి ప్రత్యేకతలు చూస్తే..చక్కని చెరువు..చెరువు గట్టున రొడ్లు..అదే వైపున ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు..ఇలాంటి వాతావరణంలొ వచ్చే స్వఛ్చమైన గాలి..ఇది కదా జీవితం అన్పించకమానదు.

.ఐతే ఇంత ప్రశాంతమైన జీవితంలొ కూడా ఇక్కడి మనుషులు మట్టినే నమ్ముకొకుండా దేశం కొసం కనీసం 4వేల మంది పని చేస్తున్నారు..రిటైరైన సైనికులు..2500మంది ఉంటే...ప్రస్తుతం పని చేస్తున్నవారు 800మంది ఉన్నారట. 1914నాటి మొదటి ప్రపంచ యుధ్దం కాలంలొనే ప్రత్తి నరసింహం అనే వ్యక్తి భారతసైన్యం తరపున యుధ్దం చేశాడు..చనిపొయాడు..తర్వాత రెండొ ప్రపంచయుధ్దంలొనూ ప్రత్తి గంగయ్య, ప్రత్తి అంజన్న..పెద తాతయ్య..బుద్దన వీరాస్వా్మి,  సంపత్, నారపురెడ్డి , పల్లయ్య, సహా 62మంది చనిపొయారు. 1965లొ జరిగిన చైనా యుధ్దంలొ 118మంది,  పాకిస్తాన్‌తొ జరిగిన యుధ్దంలొ 110మంది..కార్గిల్ వార్‌ల 90మంది పాల్గొన్నారు..ఇక పొరుగు దేశం శ్రీలంకకి వెళ్లిన శాంతిసైన్యంలొ 220మంది మాధవరం వాసులే ఉన్నారు..వీరు చేసిన విధినిర్వహణకు గుర్తింపుగానే..ఊళ్లొ అడుగుపెట్టగానే కన్పించేలా జవాన్ల పైలాన్ ఒకటి నిర్మించారు...ఆ స్తూపం దగ్గరే ఆగస్ట్ 15, రిపబ్లిక్ డే వేడుకలు రెండూ ఘనంగా జరుగుతుంటాయ్
https://www.youtube.com/watch?v=gsPUZVQuusk

1980లొని గ్రామాలను దింపేసాం రంగస్థలంలొ అంటూ జబ్బలు చరుచుకునేవారికి ఈ ఊరు వెళ్తేచాలు..పల్లెల్లొ మార్పు రాలేదనే సంగతి అర్ధమవుతుంది. ఈ  ఒక్క పల్లె అనే కాదు..ఆంధ్రదేశంలొ చాలా ఊళ్లు ఇంకా అలానే ఉన్నాయ్..మనకి మనం బాగా ముందుకెళ్లిపొయాం ఆ రొజులు ఆ ఊళ్లు వేరు అనుకుని ఆత్మవంచన చేసుకొవడం తప్ప..నిజంగా వాటిపై ప్రేమ ఉంటే తీరిక చేసుకుంటే...స్వఛ్చంగా బతికేవి..కనీసం వెయ్యి ఊళ్లు కన్పిస్తాయి..ఐతే ఇక్కడ విషాదం ఏమిటంటే..మాజీ సైనికులకు రావాల్సిన పెన్షన్ చాలామందికి సరిగా అందకపొవడం..దేశభక్తి గురించి తమ ఊరుని గొప్పగా చెప్పడమే తప్ప..కనీస వసతులు..సవుకర్యాలు కూడా కల్పించకపొవడంపై ఇక్కడివారు చిరాకు ప్రదర్శిస్తుంటారు.


Comments