భలే కథలు..ఇప్పుడు ఏటిఎంలలోనే ఎక్కడున్నాయో తెలుసా

 

అనగనగా..అంటూ మనకి ఎన్నో కథలు మొదలవుతుంటాయ్. ఇలాంటి కథలను విన్నవాళ్లు ఇప్పుడు  ఆరోజులు లేవు అనుకోవడం సహజం. అయితే ఇప్పుడు ఆస్థాయిలో చెప్పుకోవడానికి పుస్తకాలు రావడం లేదని కొంతమంది..పుస్తకాలు వస్తున్నాయ్ కానీ చదివే ఓపిక చచ్చిపోయిందని కొందరు వాదిస్తుంటారు. 

ఐతే ఇప్పుడు వాటికి చెక్ పెట్టేందుకా అన్నట్లు కొన్ని ఏటిఎంలు సిధ్దమవుతున్నాయ్. ఏటిఎంలకు..కథలకు ఏంటా లింకు అనుకుంటున్నారా...అచ్చం ఏటిఎంలా ఉండే ఈ మెషీన్లపై కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు..సాహిత్యాభిలాషను పెంచేందుకు అమెరికాలో మొదలైన ఈ ప్రయత్నం ఇప్పుడు లోకాన్నంతటినీ చుట్టేస్తోంది. ఈ మెషీన్లలో మూడు బటన్లు అమర్చి ఉంటాయ్. ఈ మూడు బటన్లు..టైమ్‌ని బట్టి ఎంచుకోడానికి వీలుగా  అమర్చారు. 

అంటే నిమిషం టైమ్ చూపించే బటన్ క్లిక్ చేస్తే..నిమిషంలోపు చదువుకునే కథలు..మూడు నిమిషాలు చూపెట్టే బటన్ మూడు నిమిషాల స్టోరీ, ఐదు నిమిషాలను చూపించే బటన్ ఐదునిమిషాల్లో పూర్తయ్యే కథలను బైటికి పంపిస్తాయ్. మీరు క్లిక్ చేయగానే ప్రింటవుట్ వస్తుంది. మీరు ఎంచుకున్న సమయాన్నిబట్టి ఈ కథల కాగితాలు
బైటికి వస్తాయ్..వీటికి ఎంత ఖర్చవుతుందనుకుంటున్నారా..ఒక్క పైసా కూడా లేదు. 


అంతా ప్రీనే..షార్ట్ ఎడిషన్ పబ్లిషర్ అనే ఒక సంస్థ అమెరికాలో ఈ ప్రయత్నాన్ని 2016లో ప్రారంభించింది. ఇలాంటి మెషీన్లు ప్రస్తుతం 150 పని చేస్తున్నాయ్. అమెరికాలో నాలుగు ఇలాంటి లైబ్రరీలు ఉండగా..ఒక్కో మెషీన్‌ తయారు చేయడానికి 6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందట. ఇక నెలనెలా కథలు తయారు చేయడానికి మాత్రం 12500 రూపాయలు ఖర్చు అవుతుంది.తొందర్లోనే మన ఇండియాకి కూడా రాబోతున్నాయట











Comments