మహేష్..ఫుల్ లోడెడ్ గన్..కానీ సక్సెస్ మీట్‌లో బరస్ట్ అయ్యాడు


మహేష్ బాబు ఎప్పుడూ సెటిల్డ్ గా ఉంటాడు. ఆడియో, సక్సెస్ మీట్లో ఎక్కడా తొణకడు..ఐతే ఆయన చెప్పే మాటలు కూడా పెద్దగా మార్పులు కూడా ఉండవ్.." ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం..ఈ పాట నా కెరీర్‌లోనే బెస్ట్..ఆ పైట్ ఇంతవరకూ చేయలేదు..స్టోరీ ఐడియా టెరిఫిక్..సినిమా కథ వినగానే ఎక్సైట్ అయ్యాను..మీలాంటి నిర్మాతలు చాలా చాలా అవసరం.." ఇవే వింటుంటాం..కానీ 
భరత్ అను నేను మాత్రం నిజంగానే అతని కెరీర్లో చాలా స్పెషల్..అందుకే ఈ సినిమా ముందు తాను ఎంత టెన్షన్ పడిందీ సక్సెస్ మీట్లో చెప్పేశాడు..నిజంగా అతను అనుభవించిన టెన్షన్ అంతా..ఆ ఏడు నిమిషాల స్పీచ్‌లొ కొట్టొచ్చినట్లు కన్పించింది. కళ్లలో కన్పించీ కన్పించని నీటిపొరతోనే మాట్లాడాడు. సిినిమాని ఈ రచయిత నిన్ననే చూడటం జరిగింది..సినిమా కథని మార్పులు చేసుకుని ఇంకొకరు చేయవచ్చేమో కానీఅతను తప్ప ఆ క్యారెక్టర్‌లో ఇంకెవరూ సూట్ కారు..అందుకే సినిమా కనకవర్షం కురిపించింది..ఈ సినిమాని జూన్ వరకూ మనం థియేటర్లలో చూడొచ్చు..అంత నమ్మకం కలిగింది..మహేష్ ప్రసంగం చూడండి
https://www.youtube.com/watch?v=zkLFjc1WYs0
మహేష్ బాబు ఫ్యాన్సే కాదు..తెలుగు సినిమా అబిమానులందరూ కాలర్ ఎగరేసే సినిమా  ఇది

Comments