భరత్ అను నేనులో ఆ పాట కానీ పెట్టి ఉంటే, కట్ చేసిన సీన్లు ఇవేనా


ఫుల్ స్వింగ్‌లో ఉన్న భరత్ అను నేను ముందు అనుకున్నట్లు సినిమా పూర్తయి ఉంటే లెంగ్త్ కనీసం మూడున్నర గంటలకు ఎక్కువే ఉండేదట. ఈ విషయం స్వయంగా డైరక్టర్ , హీరోలే ఒప్పుకున్నారు. ఐతే ఇక్కడే ఓ విషయం మహేష్ బాబు జడ్జిమెంట్‌ని, కమిట్‌మెంట్‌నీ సూచిస్తోంది. ప్రతి సినిమాలో ఓ రిలీఫ్ సాంగ్‌లాగా..ఐటెమ్ సాంగ్‌ అలవాటు చేసుకున్న కొరటాల శివ భరత్ అను నేనులో కూడా ఓ స్పెషల్ సాంగ్ పెట్టాలని అనుకున్నారట. దానికి అంతా రెడీ కూడా అయిపోయిందట. ఎవరిని తీసుకోవాలి..సినిమాలో ఎక్కడ అమర్చాలో కూడా సెట్ చేసిన తర్వాత మహేష్ ‌కి ఈ విషయం చెప్పారట..ఐతే మహేష్ మాత్రం ఇలాంటి కథలో ఐటెమ్ సాంగ్ పెడితే..కథ, హీరో పాత్ర ఔచిత్యం దెబ్బతింటుంది..వద్దండీ అన్నాడట..హీరోనే స్వయంగా అనేసరికి డైరక్టర్ శివ కూడా ఓకే అని చెప్పేసి అలాంటి ప్రత్యేక గీతం లేకుండానే సినిమాని పూర్తి చేశారు..


ఇంతకీ ఆ ఐటెమ్ సాంగ్ పెడితే..దానికి సందర్భం ఎక్కడ అంటే..మహేష్ బాబుని ప్రకాష్ రాజ్ మందుకొట్టడానికి చిన్న టీ పార్టీ అంటూ పిలుస్తాడు కదా..అక్కడ ఇరికిద్దామని ప్లాన్ చేశారట. నిజంగా అలా సందర్భోచితంగా పెడితే ఇప్పుడొచ్చిన కలెక్షన్ల కంటే ఎక్కువే రావచ్చు కూడా..కానీ కథని బలహీన పరచకూడదని తీసుకున్న నిర్ణయం ముదావహమే..ఐతే భరత్ అను నేనులో ఇదొక్కటే కాదు..ఇంకా షూట్ చేసి కూడా వాడని సీన్లు చాలానే ఉన్నాయట. అందులో ఒకటి హోలీ ఫైట్..ఇది సక్సెస్ మీట్ సందర్భంలో లీకైంది కూడా..మహేష్ బాబు ఆ ప్రశ్న అడిగినవారిపై కోప్పడ్డాడు కూడా..ఇది ఖచ్చితంగా సినిమా విడుదలైన తర్వాత యాభైరోజుల్లోపు కలుపుతారని ప్రచారం ఉంది. ఇంకా మహేష్ బాబు బ్రదర్‌తో కలిసి మాట్లాడే సన్నివేశాలు, కియారా అద్వానీతో సరదా సన్నివేశాలు కూడా కట్ చేసారు..ఇవి కూడా తొందర్లోనే కలిపి ప్రదర్శించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉందట.


Comments