ఎంపిగా సచిన్ వేస్ట్ అన్నవాళ్లకి చెప్పుతో కొట్టినట్లు ఆన్సర్ ఇచ్చిన సచిన్


సచిన్ టెండూల్కర్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌లో తెలీనివాళ్లుండరు. పాతికేళ్ల తన సుదీర్ఘ క్రీడాజీవితంలో సచిన్ ఎప్పుడూ వివాదాల్లొ ఇరుక్కుంది లేదు..తనని లాగాలని చూసినా..ఆటతీరుతో సమాధానం చెప్పేవాడే తప్ప ఎలాంటి కామెంట్లూ చేశేవాడు కాదూ..గ్రౌండ్‌లో కూడా తనపై వచ్చే బౌన్సర్లకి బ్యాటుతోనే సమాధానం చెప్పేవాడు తప్ప మాటలదాడికి దిగడు. ఇప్పుడు రాజ్యసభ మెంబర్‌గా కూడా అలాంటి సిక్సర్ లాంటి షాట్ ఒకటి కొట్టడంతో అందరి నోళ్లూ మూతబడ్డాయని చెప్పాలి. మార్చిలో తన ఆరేళ్ల పదవికాలం ముగిసింది. ఐతే ఈ మద్యలో ఆయన ప్రసంగించింది కానీ..ప్రశ్నలు అడిగింది కానీ చాలా తక్కువ. దీన్ని అడ్డంగా పెట్టుకునే చాలామంది సచిన్ టెండూల్కర్ వంటి వాళ్లని రాజ్యసభకి నామినేట్ చేయడం శుద్ద దండగ అని..హాయిగా జీతం తీసుకుంటున్నాడే తప్ప ఏ పనీ చేయడం లేదని విమర్శించారు. ఇప్పుడు సచిన్ తన ఆరేళ్ల రాజ్యసభ మెంబర్‌గా సంపాదించిన సొమ్మంతా కూడా ప్రధానమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చేశాడు..దీంతో ఇదిరా దెబ్బంటే అంటూ ఆయన ఫ్యాన్స్ ఆనందపడిపోయారు. విమర్శలకు తన ఆటతీరే సమాధానం అన్నట్లుగా..అటు రాజకీయవిమర్శలకు కూడా తన పనితీరుతోనే సమాధానం చెప్పేశాడు మాస్టర్ బ్లాస్టర్.. దాదాపు కోటిరూపాయల జీతం ఇలా విరాళంగా ఇవ్వడం సామాన్యమైన విషయం ఏం కాదు. ఎందుకంటే సచిన్‌ని ప్రత్యక్షంగా  కలిసి విమర్శలు చేసింది లేదు..ఐనా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఇలా ముందుకు రావడం మెచ్చుకోదగ్గ విషయమే..సభలో మాట్లాడినా మాట్లాడకపోయినా..ఆరేళ్లకాలంలో తనకి కేటాయించిన ఎఁపి లాడ్స్ నుంచి రూ.30కోట్ల వరకూ దేశం మొత్తం అనేక కార్యక్రమాలకు వెచ్చించాడు సచిన్.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుజిల్లాలో పుట్టంరాజు కండ్రిగను దత్తత తీసుకున్నాడు.
మహారాష్ట్రలో డోంజా అనే గ్రామాన్ని కూడా అభివృద్ది చేసేందుకు దత్తు తీసుకున్న లిటిల్ మాస్టర్ కెరీర్లో
200   టెస్టులు ఆడి 51 సెంచరీలు సాధించాడు..ఆఫ్ సెంచరీలు 68 ఉన్నాయ్. ఇక వన్డేల సంగతికొస్తే 463
మ్యాచులు ఆడి 49 సెంచరీలు..96 ఆఫ్ సెంచరీలు కొట్టాడు. బౌలర్ గా టెస్టుల్లో 46 వికెట్లు..వన్డేల్లో 154 వికెట్లు
తీసుకున్నాడు. 2012లో రిటైరైన సచిన్ రైట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్..కానీ అతను రాసేది మాత్రం ఎడమచేతితో కావడం
విశేషం. తన కంటే ఏడేళ్లు పెద్దదైన అంజలిని ప్రేమించి పెళ్లాడిన సచిన్‌కి ఇద్దరు పిల్లలు. ముంబై, బెంగళూరులో సచిన్ కి టెండూల్కర్ పేరుతో రెండు రెస్టారెంట్లు ఉన్నాయ్. సచిన్ గొప్పదనానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం అర్జున అవార్డు మొదలుకుని..పద్మశ్రీ, పద్మవిభూషణ్ తో పాటు దేశంలోనే అత్యంత ఉన్నతమైన భారత రత్న పురస్కారంతో సత్కరించింది. ఇక తన వ్యక్తిగత ఖర్చుతో ప్రతి ఏటా అప్నాలయా పేరిట 200మంది అనాధలు, పేదపిల్లలకు విద్య అందే సదుపాయం కల్పిస్తున్నారు. అలానే దేశవ్యాప్తంగా ఉన్న స్కూళ్లలో బాత్ రూమ్ సౌకర్యాలు కల్పించేందుకు నిధులు ఖర్చు పెడుతున్నాడు సచిన్. ఇవన్నీ తెలిసిన తర్వాతైనా సచిన్ ఎంపిగా పనికిరాడనే విమర్శలు ఎవరైనా చేయగలరా..?

Comments

  1. కేవలం డమ్మీ బొమ్మలాగా పార్లమెంటులో కూర్చొని - అదైనా ఎప్పుడన్నా వస్తే గిస్తే - ఆనక తనకిచ్చిన జీతభత్యాలు తిరిగి ప్రభుత్వానికి పళ్ళెంలో పెట్టి ఇచ్చినంతమాత్రాన సభ్యత్వానికి న్యాయం చేసినట్లేనా? సభ్యత్వానికి న్యాయం చెయ్యవయ్యా బాబూ అని ఆయన్నూ అయన లాంటి వారినీ అడిగే వారందరికీ ఈపాటి చర్యతో చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పేసినట్లే అవుతుందా? మహా బాగుంది! సచిన్ గారు సంపన్నుడు - ఆయనకు ఈ కొద్దోగొప్పో లక్షలు గొప్ప మొత్తం కాదు. ఆమాత్రం తిరిగి ఇవ్వటం చెప్పుకోదగ్గ త్యాగబుధ్ధీ కాదు. కాని పేరున్నవాళ్ళు పదిపైసలు విదిల్చినా వారి దాతృత్వానికి మురిసిముక్కలయ్యే మనజనం, నిజంగా నిస్వార్థంగా ఆస్తులు కరిగించుకొని మరీ సంఘానికి పాటుపడుతున్న అనేకులు అనామకంగానే ఉంటున్న సంగతిని గ్రహించనే గ్రహించరు కదా. పైగా ఈ సెలబ్రెటీలకు వీలుదొరికినప్పుడల్లా వందిమాగధుల్లా జైజైలు కొట్టటం ఒకటి.

    ReplyDelete

Post a Comment