చంద్రబాబూ ఒక్క మాటకి జవాబు చెప్పు




చంద్రబాబునాయుడిగారికి ఇప్పుడు 68ఏళ్లు..ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి..దగాపడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయనకంటూ ఒక బాధ్యత ఉంది..దాన్ని ఆయన నిర్వర్తించే తీరుపై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ పాలిటిక్స్ వేరు అడ్మినిస్ట్రేషన్ వేరు..అందుకే రాజకీయనాయకుడిగా ఆయన వ్యవహారశైలిపై విమర్శలు వస్తుంటాయ్. ఇప్పుడు ఎన్‌డిఏ నుంచి బైటికి రాగానే బిజెపి వేధిస్తుందనే కలరింగ్ ఇవ్వడం కూడా అందులొ భాగమే

గత కొద్ది రొజులుగా వార్ వన్‌సైడ్ అయినట్లుగానే చంద్రబాబు ఒక్కరే ప్రతిపక్షం, అధికారపక్షం( బిజెపి)పై విరుచుకుపడుతున్నారు. ఆయనకి సరైన జవాబు ఇచ్చేవారే లేకుండా పొయారు. కానీ ఈ క్రమంలొనే ఆయన కాస్త తడబాటుకు గురవుతూ కొన్ని తప్పులు మాట్లాడుతున్నారు. విమర్శల్లొ సహేతుకత లేకుండా చేస్తున్నారు..వాటిలొ ఒకటి జగన్ ని, పవన్ ని కేంద్రం ఆటాడిస్తుందని..జగన్ కేసులంటే భయం ఉండబట్టి..అలా బిజెపితొ కుమ్మక్కయ్యారంటూ ఆరొపించారు..చంద్రబాబు మాటల ప్రకారమే జగన్ పై కేసులు ఉఁడబట్టి భయపడుతున్నారని అనుకొవచ్చు..మరి పవన్‌కి ఏంటి భయం..ఆయనెందుకు బిజెపి చెప్పినట్లు ఆడతారు..ఈయనపైన ఏం కేసులు ఉన్నాయి? ఈ ప్రశ్న ఎవరికైనా మైండ్‌లొకి వస్తుంది..దీనికి ఎవరైనా జవాబు చెప్తారా..?


నాలుగేళ్లు బిజెపితొ కలిసి ఉండటం వల్లనే రాష్ట్రం ఇలాగైనా ఉందని..లేకపొతే ఇంకెలాగొ ఉండేదని కూడా ఎమొషనల్ బ్లాక్ మెయిల్ చేయడం సమంజసమేనా..? అంటే చివరి బడ్జెట్‌లొ ఇఁకొ 50వేలకొట్ల రూపాయలు ఇచ్చి ఉంటే..అదే బిజెపి గొప్ప ప్రయొజనం ఒనగూర్చినట్లే అనుకునేవారా..! ఇదే అసలు ఆలొచించాల్సింది..నిన్నటిదాకా కలిసి తిరిగిన పవన్ కల్యాణ్ ఇవాళ అసమర్ధుడిగా..పనికిరానివాడిలా ఎలా కన్పిస్తాడు..? పైగా ఆయన మీకు మద్దతు ఇచ్చాడే కానీ..మీ నుంచి ఎలాంటి సాయాలు పొందలేదే..? ఒక వేళ చాలామంది అనుకుంటున్నట్లు..ప్యాకేజీలతొనే మద్దతు ఇచ్చాడా..ఈ ప్రశ్నలూ రేపు ఎన్నికల సమయంలొ జనం మదిలొ మెసులుతాయి కదా..!

Comments