భరత్ అను నేను చూసి కేటీఆర్ ఏమన్నారో తెలుసా


సూపర్ స్టార్ మహేష్ హిట్ మూవీ భరత్ అను నేను రికార్డులు బద్దలు కొడుతుంటే.ఈ మూవీ చూడాలని పొలిటికల్ లీడర్లు కూడా తహతహలాడుతున్నారు. తెలంగాణ మినిస్టర్ కే తారకరామారావ్ సినిమావాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవుతుండటం తెలిసిన విషయమే. అందుకే ముందుగా ఆయనే ఈ  సినిమా చూసి..మహేష్ సూపర్..సిఎం క్యారెక్టర్ సూపర్..మంచి సినిమా చూశానంటూ కితాబిచ్చాడు. దీంతో మహేష్ ప్రమోషన్‌లో చెప్తున్నట్లుగానే
పొలిటికల్ లీడర్లు కూడా ఈ సినిమాని మెచ్చుకోవడంతో అటు హీరో..ఇటు డైరక్టర్ ఇద్దరి టార్గెట్ అచ్చీవ్ అయినట్లే అనుకోవాలి.
ఐతే ఇందులోని హీరో క్యారెక్టర్‌ని ఎవరికి వారు ఓన్ చేసుకుని విమర్శలు గుప్పించుకోవడమే విచిత్రంగా అన్పిస్తుంది. తొందర్లోనే ఇఁకొంతమంది లీడర్లు ఈ  సినిమా చూస్తామని ప్రొడ్యూసర్లకి ఫోన్ చేస్తున్నారట..ఆలిిండియా సూపర్ స్టార్ రజనీ కూడా తొందర్లోనే ఈ సినిమా చూస్తారని టాక్. గతంలో రజనీకాంత్ మహేష్ ఒక్కడు పోకిరి కూడా చూసి విపరీతంగా ఎంజాయ్ చేయడమే కాకుండా..మహేష్ బాబు ఎనర్జీని మెచ్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాని చూస్తే..అదే స్థాయిలో పొగుడుతారనడంలో సందేహం లేదు. మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి, మంచు మనోజ్ లాంటి సెలబ్రెటీలు కూడా సినిమాకి పాజిటివ్‌గా పెట్టిన కామెంట్లు మంచి బూస్ట్ ఇస్తున్నాయ్. ఇప్పటికే 200కోట్లని వారం రోజుల్లో కలెక్ట్ చేసిన ఘనత దక్కించుకున్న భరత్ అను నేను..తెలుగుసినిమాకి పట్టిన హిట్ల కొరతని తీర్చినట్లే..

Comments