స్టార్‌కీ సూపర్‌స్టార్‌కీ తేడా ఇదే.!


మహేష్ బాబు, అల్లు అర్జున్‌ ఈ ఇద్దరూ యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉన్న హీరోలు. ఐతే సూపర్ స్టార్ మహేష్ బాబు నంబర్ వన్ స్థానంలో ఉన్నాడనేది అందరికీ తెలిసిందే..ఎవరు ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం..ఓ సినిమా ఫ్లాప్ అయినా ఆ సినిమా కనీసం 60-70కోట్లు వసూలు చేసే సత్తా ఇతని సినిమాలకు ఏర్పడింది. అల్లు అర్జున్ విషయం వేరు తన ఫాస్ట్ స్టెప్పులతో యువతని ఉర్రూతలూగించడంలో మొనగాడు..ఐతే ఏ సినిమా చూసినా..మాస్ ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని చేసినట్లు ఉంటాయ్ ఈయన సినిమాలు.ఐతే మహేష్ బాబు ఎందుకు  సూపర్ స్టార్ అయ్యాడో..మిగిలినవాళ్లు కేవలం స్టార్లు మాత్రమే ఎందుకు అవుతారో తెలిపే ఉదాహరణ ఒకటి ఇప్పుడు చూద్దాం

..లేటెస్ట్ బ్లాక్ బస్టర్ భరత్ అను నేను సినిమా విడుదలకి ముందు నుంచి మహేష్ బాబు కెమెరాల ముందు బాగా కన్పిస్తున్నాడు..ఎన్ని చోట్లకి వెళ్లినా ఈయనలోని ఎనర్జీ తగ్గదు..ఐతే ఎక్కడ మాట్లాడినా కూడా నిజాయితీ కన్పిస్తుంటుంది. అదే విధంగా తన టీమ్ మెంబర్లు మాట్లాడుతున్నంతసేపూ ఎంతో ఆసక్తిగా వింటుంటారు. వారి పట్ల గౌరవం ఇవ్వడంలో మహేష్ ఓ రోల్ మోడల్‌లా ప్రవర్తిస్తుంటాడు..ఇక్కడే అల్లు అర్జున్ నాపేరు సూర్య సినిమా ఫంక్షన్‌లోని ప్రవర్తన మహేష్ ఎంత ప్రత్యేకమో తెలియజేసేలా చేసింది.


అటు అర్జున్ ఇటు దర్శకుడు వక్కంతం వంశీ ఉండగా..కాలుపై కాలు వేసుకుని తన ధోరణిలో తాను మాట్లాడుకుంటూ పోయాడే తప్ప..వేదికపై ప్రసంగిస్తున్న నిర్మాత మాటలను పట్టించుకున్నట్లు కన్పించదు. ఒకింత నిర్లక్ష్యధోరణే అన్పించింది. తానొక సినిమా చేస్తే..అది సొంతంగా భావించిన మహేష్ తీరుకి..నా సినిమాలు వాటికవే ఆడేస్తాయ్..అవే మాట్లాడతాయ్ నేను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదు..అన్నట్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఈ ఒక్క ఫంక్షన్‌తో అలా ఎలా నిర్ధారిస్తారు అని అనుకోవచ్చు..కానీ సెలబ్రెటీలు జనంలో ఉన్నప్పుడు ప్రతి కదలికా ముఖ్యమే..కెమెరాలు మనపై ఉంటాయ్..కనీసం లక్షమంది గమనిస్తుంటారు. ఈ గ్రహింపు లేనప్పుడు మన ఇమేజ్‌ని మనమే డ్యామేజ్ చేసుకున్నట్లు అవుతుంది. ఇంకా భరత్ అను నేను సినిమా యూనిట్ నా పేరు సూర్య రాబోతుంది అది కూడా హిట్టవ్వాలని కోరుకుంటున్నాం అని చెప్పిన తర్వాతే అర్జున్ కూడా ఈ ఫంక్షన్లో ఆ సినిమా గురించి ప్రస్తావించాడు..ఆ అవసరం లేకపోవచ్చు కానీ ఇండస్ట్రీలోని చాలామంది భరత్ అను నేనుని అప్రిషియేట్ చేస్తే..ఒక్క అల్లు అర్జున్ మాత్రమే పెద్ద హీరోల్లో  పట్టించుకోకుండా ఉన్నాడు...ఇలాంటి ప్రవర్తనే ఎవరేంటనే విషయాన్ని చెప్పకనే చెప్తుంది. మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలకు కూడా ఓ గౌరవం ఉంటుంది.

దానికి ఆయా నిర్మాతలు మహేష్ బాబుతో వ్యవహరించే తీరు కూడా నిదర్శనంగా చూడొచ్చు. ఉదాహరణకు స్పైడర్ నిర్మాత ఎన్.వి. ప్రసాద్‌నే చూడండి..ఆయన మహేష్ బాబు తిరుపతి వెళ్లినప్పుడు ఎలా వెంట వెళ్లారో..అంటే ఒక నిర్మాతకి హీరోకి ఉండే అనుబంధానికి ఇది పర్ఫెక్ట్ రిలేషన్. గతంలో కూడా చాలామంది నిర్మాతలు మహేష్ బాబుపై తమ నమ్మకాన్ని చెప్పారు..సినిమా రిలీజైన తర్వాత కూడా ఇలాంటి అనుబంధం ఆటోమేటిగ్గా మెయిన్ టైన్ చేసేవాళ్లే సూపర్ స్టార్లు అవుతారనడానికి మహేష్‌బాబే ప్రత్యక్ష నిదర్శనం



Comments