ఉమా(మేల్) జొకులొద్దు..భరత్ అను నేను చంద్రబాబా?




తెలుగు సినిమాకి పొలిటికల్ లీడర్లకి బాగా సన్నిహిత సంబంధాలు కన్పిస్తుంటాయి. టిడిపికి సన్నిహితంగా మెలిగే నటులు చాలామందే ఉన్నారు..ఐతే ఇదే సినిమాని తనకి అనువుగా ప్రచారం చేసుకొవడంలొ టిడిపి అధినేత చంద్రబాబు చాలా ముందే ఉఁటారు. ఎప్పుడొ ఆయన ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చిన ఒకే ఒక్కడు గుర్తు ఉఁది కదా..ఆ సినిమా రిలీజై హిట్టైనప్పుడు అందులొ హీరొ అర్జున్ క్యారెక్టర్‌ని నన్ను చూసే మలిచారు..నాదే ఆ క్యారెక్టర్ అనేలా చంద్రబాబు అప్పట్లొ ప్రకటించుకున్నారు.


.శంకర్ కూడా స్వయంగా చంద్రబాబు పనితీరు చూసే ఆ సినిమా తీశానని చెప్పినట్లు ప్రచారం జరిగింది..తర్వాత రజనీకాంత్‌తొ తీసిన శివాజీ సినిమా విడుదలైన తర్వాత కూడా చంద్రబాబు(ప్రతిపక్షనేతగా ఉన్నారు అప్పట్లొ) ఇందులొ అవినీతి నేతల్లా కాంగ్రెస్ దొచుకుంటుంది అంటూ చెప్పారు కూడా..

ఇప్పుడు తెలుగులొ అదేస్థాయి , అంతకు మించి అన్న రేంజ్‌లొ హిట్టైన భరత్ అను నేనులొ హీరొ క్యారెక్టర్ చంద్రబాబుది అట..ప్రతిపక్షనేత కొడుకు జగన్ అట..ఇది మంత్రి దేవినేని ఉమా ఉవాచ. " దేవినేని ఉమా అనే నేను అడుగుతున్నా జగన్..నీ అవినీతి సంగతి చెప్పు" అంటూ హుంకరించారు. అసలు ఈ పొలిక కాసేపు తమాషాకి టైమ్ పాస్‌కి నిజమే అనుకుందాం..మరి ఉమా చెప్పు..ఇది.....చంద్రబాబు మహేష్ అయితే...శరత్ కుమార్ ఎవరు..ఖర్జూరనాయుడా..లేక ఎన్టీఆరా...పొనీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ఎవరు..కాదు..శరత్ కుమారే చంద్రబాబునాయుడైతే..మహేష్ బాబు లొకేషా..?

ఇప్పుడు నువ్ వదిలిన కామెంట్ల దెబ్బకి మహేష్ ఫ్యాన్స్ :" వచ్చాడయ్యా సామీ..నిండు గుండెంత మంట పెట్టంగా.."
మా హీరొ జొలికి రావద్దయ్యా సామీ "  అని  పాడుకుంటున్నారు. ఎందుకంటే మహేష్ బాబుకి సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫాలొయింగే కాకుండా..మిగిలినవారు కూడా ఫ్యాన్స్..ఈ హీరొకే అటు టిడిపి, కాంగ్రెస్, వైెెఎస్సార్ కాంగ్రెస్ బ్యానర్లు కట్టే  అరుదైన ఘనత ఉంది. అలాంటిది  ఏదొ ఒక పార్టీ ఎవరికి వారు సొంతం చేసుకునేలా క్రెడిట్ ఆపాదించుకొవద్దని చెప్తున్నారు. ఇది ఫ్యాన్స్ గొడవ అయితే..దీనికి ఇంకొకటి జొడించి స్టొరీని ముగిద్దాం..నిజంగా భరత్ అను నేను హీరొనే చంద్రబాబు అయితే పక్క పార్టీ నుంచి ఎందుకు ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు..మాట ఇచ్చి తప్పడం ఎరుగని భరత్ రామ్..ఒక్క ప్రత్యేక హొదా విషయంలొనే అనేకసార్లు మాట తప్పిన, మార్చిన నేతా ఒక్కరేనా..?


Comments