మావాడు మీ అందరి దూల తీర్చేస్తాండంటోన్న నాగబాబు..ఆ ఛానల్ మహా గొప్ప పని చేసిందన్న హేమ


నిజానికి ఆ ఛానల్ కి అంత సీన్ లేదు..ఎవడూ పట్టించుకోడు..అందులో జీతాలనే మాట వినపడటం మొదలై ఆర్నెల్లై ఉంటే గొప్ప..అలాంటి ఛానల్ గురించి ఇవాళ నాగేంద్రబాబు మాట్లాడాడు..హేమ మాట్లాడింది..తమపై విమర్శలు చేయించి టీఆర్పీలు పెంచుకుంటున్న ఆ ఛానల్ తీరు మంచిది కాదని నాగేంద్రబాబు చాలా ఆవేదనగా గద్గదస్వరంతో మాట్లాడాడు..అలానే శ్రీరెడ్డి వెనుక ఎవరో ఉన్నారనే అనుమానం కాదు కాదు..నిర్ధారణతోనే అన్నాడు..
ఎవరు శ్రీరెడ్డి వెనుక ఉంది..చంద్రబాబా..జగనా..ఎందుకంటే..పవన్ కల్యాణ్‌తో తంటా వీరిద్దరికే కదా..ఐనా..వాళ్లలాంటి చీప్ ట్రిక్స్ కి పాల్పడతారని ఎవరూ అనుకోరు నాగేంద్రబాబుకి నిజంగా ఏదైనా సమాచారం ఉంటే..అది కూడా బద్దలు కొడితే బావుండేది..స్పష్టత వచ్చేది.

అసలు కొన్ని రోజులుగా సిచ్యుయేషన్ ఎలా తయారైందంటే , ఒకడొచ్చి ఒకరిపై విమర్శలు చేస్తాడు..దానికి ఇంకెవరో స్పందిస్తారు..మొదట ఆరోపణలు చేసినవారిపై ఇంకొకరు ఆరోపణలకు దిగుతారు. మధ్యలో ఇంకెవరో ఎంటరైపోయి..ఆధారాలు కావాలి అంటారు..ఈ లోపు ఇంకొకళ్లు వచ్చి మొదటి వ్యక్తి చాలామంచిదంటాడు..హే కాదు దాని మంచితనం ఏంటి..అని ఇంకొకళ్లు వస్తారు ఇలా జనానికి కనీసం నెల రోజుల నుంచి టివీల్లో టార్చర్ చూపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు..ఇప్పుడది చాలదన్నట్లు దీనికి రాజకీయరంగు పులమడం ఒకటి

ఇప్పుడు ఈ విషయాలపై తిరిగి పొలిటికల్ లీడర్లు కూడా స్పందించడం మొదలైతే..తెలుగువాళ్లంటే ఇంతేనా అని పొరుగురాష్ట్రాల వాళ్లు..ఆర్నాబ్ గోస్వామి లాంటి గొంతు చించుకునే రకాలూ ఇంకాస్త చీప్‌గా చూస్తారు. పవన్ కల్యాణ్ స్పందనపై శ్రీలేఖకి అభ్యంతరం ఉంటే..అసలు పట్టించుకోకుండా ఉండాలి కానీ..బూతులు తిట్టడం ఏంటంట..లేదంటే ఆమె స్థాయి అదే అని సరిపెట్టుకోవాలేమో..కానీ ఆమె మాటలు చిరంజీవి కుటుంబాన్నితీవ్రంగా కలిచివేశాయని మాత్రం నాగేంద్రబాబు స్పందన చూస్తుంటే అర్ధమవుతోంది. ఐతే ఆయన పవన్ కల్యాణ్ అందరి దూల తీర్చేస్తాడు అనడమే కాస్త అతి..కాకపోతే ఆయన ఉన్న ఆవేశంలో ఆ మాటని పట్టించుకోనక్కర్లేదు. ఒక మాట పడి ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడు అని సరిపెట్టుకోవాల్సిందే..

ఐతే  ఈ సందర్భంగా హేమ మాత్రం మీడియాకి బాగా గడ్డి పెట్టింది. మమ్మల్ని ....ముండలు అని ఒక ఛానల్ అంటే..ఇంకొకడేమో..బట్టలిప్పి చూపిచ్చినంత చూపిచ్చినతర్వాత దుప్పటి కప్పామని చెప్పుకుంటూ టీఆర్పీలు పెంచుకుంటున్నారని మహా ఛానల్‌ని పేరు పెట్టి మరీ కడిగేసింది. చూడబోతుంటే ఇది ఎంత రగిలితే అంత మాకు లాభం అన్నట్లు ఛానళ్లు కూడా అనుకుంటున్నట్లే ఉంది.ఎందుకంటే దానిపైనే టివి ఛానల్స్ చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి మరి..! ఇన్ని రోజులూ ప్రత్యేక హోదా, గోదాలో హోదా హోరు, హోదాగ్ని..హోదాహోరీ అంటూ టైటిళ్లు పెట్టుకున్న ఛానళ్లన్నీ పాపం ఇప్పుడు క్యాస్టింగ్ కౌచ్‌లో కాస్త సొమ్ము చేసుకునే పనిలో పడ్డాయి..ఇదెన్నాళ్లు సాగుతుందో చూద్దాం మరి

Comments