ఈ నమస్కారం జాగ్రత్తగా గమనించారా..? స్పెషాలిటీ తెలుసుకొండి

ఈ తరహా చేతులు..నమస్కారం కన్పించగానే ఆంధ్రప్రదేశ్ వాసులకు వెంటనే ఇవి ఎవరి చేతులొ తెలిసిపొతుంది. ఎస్..ఇది వైఎస్ జగన్‌మొహన్ రెడ్డి  చేతులే..ఆయన రెండు చేతులు జొడించి నమస్కారం పెట్టే తీరు ముచ్చట  గొలుపుతుంది. పంచెకట్టుకి పేటెంట్ రాజశేఖర్ రెడ్డి తీసుకుంటే..ఈయన ఈ నమస్కారాలపై హక్కు తీసేసుకున్నాడనిపిస్తుంది..ఆరొపణల సంగతి పక్కనబెడితే ఇలా నిండుగా ముకుళిత హస్తాలతొ నమస్కారం పెట్టడమనేది ఒక్క జగన్ విషయంలొనే కన్పిస్తుంది.


ఐతే ఇలా నమస్కారం చేయడం మన సంప్రదాయంలొ భాగమే అయినా..దాన్ని పాటించని వారే ఎక్కువ. ఎక్కడ నమస్కారం పెడితే ఎవరు ఎలా ఎగతాళి చేస్తారొ అన్న భయం. బెరుకు ఎక్కువ కావడంతొ అర చేయి లేపి..ముక్కు గొక్కున్నట్లు నమస్కారం చేయడం ఫ్యాషనైపొయింది..ఇంకా రజనీకాంత్ టైప్ స్టైల్ శాల్యూట్‌లూ ఎక్కువే..
ఈ విషయాన్ని పక్కనబెడితే జగన్ మొహన్ రెడ్డి నమస్కారానికి ఒక ప్రత్యేకత ఉంది..
అది పైన ఫొటొలు చూస్తేనే అర్ధమవుతుంది..ఒక చేతిలొ చేయి వేసి..ఒక బొటనవేలి కింద మరొక చేయి బొటనవేలు వచ్చేలా..అంటే ఒక చేతికి మరొ చేయి సపొర్ట్ ఇస్తున్నట్లు కన్పిస్తుంది..ఫొటొల్లొ మీకీ విషయం క్లియర్‌గా కన్పిస్తుంది చూడండి.. 
                  ఇలా ఎందుకు జగన్ నమస్కారం చేస్తున్నట్లు...?
వాటి వెనుక సంప్రదాయం ఉందా..ఇంకేదైనా కారణం ఉఁదా..?మనకి  మొత్తం నాలుగు రకాల నమస్కారాలు ఉన్నాయ్. సాష్టాంగం అంటే నేలబారుగా పడుకుని చేసేది..ఇది దైవానికి చేస్తాం. ఇక నేలపై మొత్తం శరీరాన్ని ఎక్కడా వంపు లేకుండా చేసేది దండ ప్రణామం..ఇది కూడా దాదాపుగా దైవానికే చేస్తాం..అంగప్రదక్షిణల్లొ ఇదిచూస్తాం. పంచాంగ నమస్కారమనేది స్త్రీలు దేవాలయాల్లొ చేస్తుంటారు, ఇక మిగిలింది అంజలి ఘటించడం..ఇది సాధారణంగా అందరూ ఎదుటివారికి చేసేది. హృదయభాగానికి పైగా చేతులు తెచ్చి కలిపి చేసేది..ఇదే ఇప్పుడు వైఎస్ జగన్ చేసేది కూడా..కానీ ఆ చేసే పద్దతిలొనే కాస్త యొగ ముద్ర కూడా కలిసి ఉంటుంది చూడండి..అది శంఖముద్రకి కాస్త దగ్గరగా ఉంటుంది..యొగముద్రలలొదీని ప్రత్యేకత ఏమిటంటే..ఇది నిఖార్సుగా చేసినవాళ్ల స్వరం శ్రావ్యంగా ఉంటుంది..అలానే మానసిక ధృడత్వం కలుగుతుందంటారు. ఇప్పుడు వైఎస్ జగన్ చేస్తొన్న సుదీర్ఘపాదయాత్రనే గమనిస్తే..2వేల కిలొమీటర్ల చేరుతున్నా..గొంతులొ ఏ మార్పు రాకపొవడానికి ఇలాంటివే కారణం అనుకొవచ్చు..నమ్మేవాళ్లకి ఇది అర్ధం అవుతుంది. నమ్మనివాళ్లకి కట్టుకథలా అన్పిస్తుంది. అలానే రెండు చేతుల బొటనవేళ్ల కలయికతొ శంఖముద్రకి దగ్గరగా ఉన్న ఇలాంటి నమస్కారానికి ఇంకొ కొణం కూడా ఉంది..నమస్కారం అనేది అవతలివ్యక్తిలొనూ తనలాంటి వారే ఉన్నారనే భావనతొ పాటు..అహంకారాన్ని తొలగిస్తుంది. కానీ అది చేసేటప్పుడు రెండు చేతులూ ఆకాశాన్ని చూసేలా..తలపైకి తీసుకువచ్చి చేసే ప్రణామం అది అందరితొ పాటు కలిసి భగవంతునికి చేరుతుంది..అలా ఆ ప్రదేశంలొ ఎవరు చేసినా., అది అందరూ కలిసి భగవంతునికి చేసినట్లే..ఇలా మనం ఎక్కువగా ఆలయం బైటికి వచ్చి మూలవిరాట్ ఎటువైపు ఉందొ చూసి ఆ దిక్కుకి తిరిగి చేస్తాం..తిరుమలతిరుపతిలొ ఇలాంటి నమస్కారాలు మనం గమనించవచ్చు. ఇది తెలిసి కానీ..తెలియకుండానొ జగన్ చేస్తొన్న ప్రణామాలు ఆ కొవకే చెందుతాయ్. కావాలంటే ఈ విషయంపై పండితుల అభిప్రాయాలు తెలుసుకొవచ్చు కూడా 

Comments