రాజువయ్యా...మహరాజువయ్యా...అశోక్ గజపతిరాజువయ్యా


విజయనగర సామ్రాజ్య వంశానికి చెందిన రాజు.. పూసపాటి అశోకగజపతి రాజు...మొన్నటిదాకా కేంద్రమంత్రి కూడా..అయినా ఆయనలో ఆ గర్వం కానీ ఆ దర్పం కానీ కొద్దిగా అయినా కన్పించదు..తన పనేదో తాను చేసుకుంటూ పోతారు. అలాంటి అశోక్ గజపతిరాజుకు ఇప్పుడు చాలా కష్టం వచ్చింది. ఐతే అంత
కష్టంలోనూ ఆయన తన పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ..మనిషంటే ఈయనరా అన్పించేలా చేశాడు..ఇంతకీ ఏంటా కష్టం..అంటారా....పోయిన గురువారం అశోక్ గజపతి రాజు తల్లి కుసుమదేవి చనిపోయారు. వాటికి హాజరైన ఆయన తర్వాత ఎక్కడకూ కదలకూడదు..కనీసం పదోరోజు వరకైనా ఎక్కడకూ వెళ్లకూడదు..కానీ ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ సాగుతున్న పోరాటంలో పాల్గొన్నారు. దీనికి కారణం పార్టీ అదినేత చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు. హోదాపై ఏదోటి తేలేదాకా ఢిల్లీ వదలొద్దని చంద్రబాబు చెప్పడంతో అసోక్ గజపతి రాజు తన బాస్ ఇచ్చిన సూచనలను తూచ తప్పకుండా పాటించడం కోసం ఢిల్లీకి చేరుకోవడమే కాకుండా..హోదా పోరులో పాల్గొన్నారు..ఇదే మిగిలిన ఎంపీలకు ఆదర్శంగా మారింది. మా ఎంపి దీక్ష చూసి మాకూ స్ఫూర్తి రగులుతోంది అంటున్నారు..చివరికి ఫలితం ఎలాగున్నా పోరాటం మాత్రం తప్పదనే సూత్రాన్ని చక్కగా పాటిస్తోన్న అశోక్ గజపతిరాజుకి నిజంగా హ్యాట్సాఫ్ అనకతప్పదు. అందుకే చంద్రబాబు కూడా అశోక్ గజపతిరాజుని మెచ్చుకున్నారట. నిజానికి పార్టీలో చంద్రబాబు కంటే అశోక్ గజపతిరాజే సీనియర్ అయినా కూడా ఇన్నాళ్లలో ఎప్పుడూ పార్టీ లైన్ తప్పి  ప్రవర్తించలేదని సుదీర్ఘమైన ఆయన రాజకీయజీవితాన్ని గమనిస్తే తెలుస్తుంది


తనకి ప్రత్యర్ధి వర్గాన్ని తీసుకొచ్చి పార్టీలో చేర్చుకున్నా కూడా ఆయన ఎప్పుడూ అధినేతపై విమర్శలు చేయలేదు. రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకుంటూ కొనసాగుతున్న నేతల్లో ఆయనా ఒకరని మాజీ ముఖ్యమంత్రి రోశయ్య గతంలో వ్యాఖ్యానించారు కూడా..మచ్చలేని లీడర్లలో అశోక్ గజపతిరాజునూ చెప్తారు కొంతమంది. ఐతే ఇంత చరిత్ర ఉన్నా కూడా ఆయనకి సరైన గుర్తింపు లేదనే వారూ ఉన్నారు..అందుకే నాలుగేళ్ల క్రితం కేంద్రమంత్రి పదవి దక్కినప్పుడు సరైన వ్యక్తికి సరైన పదవి అని చాలామంది భావించారు..ఐతే అది హోదా పోరు పేరుతో వదులుకోవాల్సి రావడం చూస్తే పాపం అశోక్ గజపతిరాజు అన్పించకమానదు

Comments