స్కూలు ఫీజుల కోసం స్మగ్లర్లుగా మారుతున్న తల్లిదండ్రులు


హర్యానా-ఢిల్లీ హైవే..!
ఓ ఎస్టీమ్ కారు వేగంగా..ఢిల్లీ నుంచి హర్యానా వైపుగా దూసుకెళ్తోంది..

మధ్యలో సడన్‌గా పోలీసులు ప్రత్యక్షం అయ్యారు. కారుని ఆపమన్నారు..అందులో ఉన్న యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు..ఎందుకిలా చెక్ చేస్తున్నారంటూ మండిపడ్డాడు. చూస్తున్నవాళ్లు కూడా పోలీసుల జులుం ప్రదర్శిస్తున్నారనుకుంటూ గుసగుసలాడుకున్నారు..ఐతే ఆ తర్వాత జరిగింది చూస్తే ఆశ్చర్యపోయారు. డిక్కీ వెనుక భాగంలో బోలెడన్ని లిక్కర్ బాటిళ్లు కన్పించాయ్. ఇందులో ఏముంది వింత సదరు యువకుడు ఏదైనా బార్ ఓనరో..లేక పార్టీ కోసమో తీసుకెళ్తున్నాడనుకున్నారా..లేదు అక్కడే ఉంది అసలు కధ..మనోడి పేరు మోహిత్ గోస్వామి. అమృతసర్‌లో ఉంటాడు ఎంబిఏ గ్రాడ్యుయేట్ కూడా..ఢిల్లీ నుంచి హర్యానాకి లిక్కర్ స్మగ్లింగ్ చేస్తుంటాడు..ఇదంతా పోలీసుల ఇంటరాగేషన్‌లో తెలిసింది. ఇక్కడే ఇంకో ఆవేదనా భరితమైన మలుపు
ఉంది. బిటెక్ చేసిన మోహిత్ గోస్వామి ఎంబిఏ చేసిన తర్వాత సింగపూర్ లో ఉద్యోగం చేసేవాడు. 2011 నుంచి ఓ 9నెలల క్రితం వరకూ అక్కడే పనిచేశాడు. అతను పని చేసే జపనీస్ కంపెనీ మోహిత్ ని ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇండియాకి వచ్చేశాడు. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకలేదట.. ఈ లోపే అతని కూతురి స్కూల్ ఫీజు కట్టాల్సి వచ్చింది. అది కూడా ఏ రెండు వేలో మూడు వేలో కాదు..ఏకంగా 80వేల రూపాయలట. స్కూల్లో టీచర్లు, స్టాఫ్ ఫీజు కట్టకపోతే రానీయమని హెచ్చరిస్తున్నారట..ఇలా కొన్ని రోజులు సాగేసరికి..మనోడికి సంజీవ్ అనే వ్యక్తి కలిశాడు. తాను చెప్పిన పని చేస్తే..ఒక్కో కార్ట‌న్ కి రూ.500 ఇస్తా అన్నాడట..అలా స్మగ్లింగ్‌ వృత్తిలోకి దిగిన మోహిత్ గోస్వామి వేరే వ్యాపకం లేకుండా అందులోనే కొనసాగుతున్నాడు. ఇప్పుడు అతనితో పాటు కారులో 23 కార్టన్లు సరఫరా చేస్తూ కన్పించాయి. అంటే ఒక్క
ట్రిప్పుకి 11వేలకి పైనే సంపాదించబోయాడు..కానీ ఇలా స్మగ్లింగ్ సాగుతోన్న విషయం పోలీసులకు ఎవరో ఉప్పందించడంతో మోహిత్ గోస్వామి బుక్కైపోయాడు. ఇందులో బాధ కలిగించే కోణం ఏమిటంటే..చిన్నపిల్లల స్కూలు ఫీజులు ఇంతలా ఉండటం..వాటి కోసం తల్లిదండ్రులు అడ్డదారులు తొక్కాల్సి రావడమే..

Comments

  1. స్మగ్లింగా? ప్రైవేట్ స్కూళ్ళ విచ్చలవిడి ఫీజ్ దోపిడీ, నిర్లిప్తంగా చూస్తున్న ప్రభుత్వాలు - వీటిని తట్టుకోవాలంటే కుటుంబపు
    నెలసరి ఆదాయాలు సరిపోక ఒకప్పటి థగ్గులూ పిండారీలలాగా దారిదోపిడీలకు కూడా పాల్పడినా ఆశ్చర్యపోనక్కరలేదేమో? మరి విద్యని ప్రైవేట్ వ్యాపారస్తులకు ధారాదత్తం చేసేస్తే ఎప్పటికైనా సమాజం మీద దుష్ప్రభావం పడక తప్పదు కదా.

    ReplyDelete

Post a Comment