మహేష్ బాబుపై తీవ్రమైన ఆరోపణలు చేసిన మాధవీలత


సినిమాల్లో పాత్రల కోసం పడక పంచుకోమంటున్నారంటూ తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులపై ఇప్పుడు ఆరోపణల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలో కొంతమంది చాలాపెద్ద వాళ్లపై కూడా ఆరోపణలు చేస్తున్నారు..ఐతే ఇవి ఎక్స్ ప్లాయిటేషన్‌కి సంబంధించినవే కాకుండా..అమర్యాదగా ప్రవర్తించారని..అసలు లెక్క చేయడం లేదని..ఇలా ఇతరత్రా విషయాలపై కూడా రగడ చేస్తున్నారు. అందులో భాగంగానే నటి మాధవీలత మహేష్ బాబుపై ఆరోపణలు గుప్పించింది. ఇందులో డైరక్ట్‌గా మహేష్‌కి సంబంధం లేకపోయినా ఆయన్ని లాగడం గమనించాలి.
మాధవీలత కెరీర్ తొలినాళ్లలో జరిగిన సంఘటనని టివి9 ఛానల్‌లో గుర్తు చేసుకుంది. అతిధి అనే సినిమా షూటింగ్ సందర్భంలో డైరక్టర్ తన పట్ల అమర్యాదగా ప్రవర్తించినా మహేష్ బాబు పట్టించుకోలేదనేది ఆమె ఆరోపణ


మాధవీలత చెప్తేగానీ ఆ సినిమాలో పాపం ఆమె నటించిందనే సంగతి గుర్తుకురాదు. ఎందుకంటే నచ్చావులే సన్నగా సీతాకోకచిలుకగా కన్పించిన మాధవీలత ఇందులో చాలా బొద్దుగా కన్పిస్తుంది..హీరోయిన్ అమృతారావ్ పక్కన డైలాగులు తక్కువే అయినా.. దాదాపు ఓ ఇరవై నిమిషాలపాటు కన్పిస్తుంది. ఐతే హీరోయిన్ అమృతారావ్‌నే జనం గమనించారు తప్ప ఈమెని పట్టించుకోలేదు. షూటింగ్ సమయంలో షాట్ తీయడానికి మాధవీలత లేట్ గా రావడం..ఎందుకు లేట్ అయిందంటే హెయిర్ డ్రస్సింగ్ చేసుకోవడానికి లేట్ అయిందని చెప్పడంతో సదరు దర్శకుడు సురేందర్ రెడ్డి బూతుపదం వాడాడట. ఇదే ఆమె చెప్పిన వెర్షన్..అయితే చాలా దగ్గర్లోనే ఉన్న మహేష్ బాబు ఈ విషయాన్ని పట్టించుకోకుండా కామ్‌గా  ఉన్నాడనేది మాధవీలత ఆరోపణ. అంతేకానీ అమ్మాయి కదా..ఎందుకలా బూతులు మాట్లాడతావ్ అని ఒక్క మాట కూడా అనలేదు అని వాపోయింది. నిజమే..ఒక్క మాట అని ఉంటే ఏం అయ్యేది అనిపిస్తుంది..మాధవీలత పరిస్థితి తలుచుకుంటే జాలి వేస్తుంది కూడా !  కానీ నాని మాత్రం ఇలాంటి ఘటన చోటు చేసుకున్నప్పుడు అలా ప్రవర్తించినవారిని వారించాడని చెప్పింది..ఏతావాతా ఈ రెండు సంఘటనలను బట్టి తెలుగు ఇండస్ట్రీలో చిన్న నటులపై దర్శకులు, నిర్మాతలు జులుం ప్రదర్శించడంతో పాటు..బూతులు లంకించుకుంటారనేది అర్ధం అవుతోంది..ఐతే ఇలా అక్కడున్న వారు కూడా స్పందించలేదు అని అనడం మాత్రం కొంతమంది ఆక్షేపిస్తున్నారు. ప్రతీ ఒక్కళ్లూ ప్రతి ఇష్యూపై అవతలి వారు కోరుకున్నట్లుగా స్పందించాలని కోరుకోవడం కూడా ఓ రకంగా తప్పేనంటారు..

కింద అతిధిలో అమృతారావ్ పక్కన మాధవీలత ఉన్న ఫోటోలు ఉన్నాయ్ చూడండి గుర్తు పట్టండి











Comments


  1. // “ప్రతీ ఒక్కళ్లూ ప్రతి ఇష్యూపై అవతలి వారు కోరుకున్నట్లుగా స్పందించాలని కోరుకోవడం కూడా ఓ రకంగా తప్పేనంటారు..” // అని కొందరు చేసారన్న “ఆక్షేపణ” కూడా ఆక్షేపణీయమే .. నా దృష్టిలో.

    మాధవీలత చెప్పిన సందర్భం వేరు. ఎక్కడైనా, ప్రక్కనున్న వారి స్పందన అవతలి వారు కోరుకున్నట్లు ఉండడం కాదు ... సభ్యత కోరుకున్నట్లుండాలి. అక్కడ అమ్మాయి(లు) లేకపోయినా కూడా నలుగురి మధ్యలో మాట్లాడే పద్ధతి సభ్యతకు లోబడుండాలి. అది తప్పినప్పుడు అక్కడున్న తక్కిన వారు, ముఖ్యంగా వారిలో ఉన్న ప్రముఖులు - నాకెందుకని నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా - మందలించాలి / ఖండించాలి ... అదీ సంస్కారం. బూతులు మాట్లాడుకోదలుచుకుంటే వాళ్ళ గదుల్లో ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి ... పదిమంది మధ్యలో ఉన్నప్పుడు కాదు.

    తెర మీద అర్థం లేని హీరోయిక్స్ / ఫైట్స్ చెయ్యడం, ప్రేమించమని అమ్మాయి వెంటబడి వేధించడం, పెళ్ళిపీటల మీద నుండి పెళ్ళికూతుర్ని లేపుకుపోవడం, తల్లిదండ్రులతో సహా ఎదుటి వారిని మర్యాద లేని డైలాగులతో మాట్లాడడం, కూల్ డ్రింక్ కోసం భవనాల పైనుంచి / కొండల మీద నుంచి దూకినట్లు చూపించే బాధ్యతారాహిత్య వ్యాపార ప్రకటనల్లో మోడల్ గా నటించడం ..... వగైరాలు ..... ఈరోజుల్లో ఇవే హీరోయిజంగా చలామణీ అవుతున్నప్పటికీ అదంతా సినిమా కథల వరకే పరిమితం ... సినిమా బయట వ్యక్తిత్వం సభ్యతాయుతంగా ఉండాలి.

    ReplyDelete
  2. ప్రక్కనున్న వారి స్పందన అవతలి వారు కోరుకున్నట్లు ఉండడం కాదు ... సభ్యత కోరుకున్నట్లుండాలి. అక్కడ అమ్మాయి(లు) లేకపోయినా కూడా నలుగురి మధ్యలో మాట్లాడే పద్ధతి సభ్యతకు లోబడుండాలి. అది తప్పినప్పుడు అక్కడున్న తక్కిన వారు, ముఖ్యంగా వారిలో ఉన్న ప్రముఖులు - నాకెందుకని నిర్లక్ష్యంగా నిమ్మకు నీరెత్తినట్లు ఉండకుండా - మందలించాలి / ఖండించాలి ... అదీ సంస్కారం. బూతులు మాట్లాడుకోదలుచుకుంటే వాళ్ళ గదుల్లో ప్రైవేట్ గా మాట్లాడుకోవాలి ... పదిమంది మధ్యలో ఉన్నప్పుడు కాదు.

    ReplyDelete

Post a Comment