అప్పట్లో ప్రోతిమా బేడీ..ఇప్పుడు శ్రీలేఖారెడ్డి అలియాస్ శ్రీరెడ్డి ఉరఫ్ విమల


కారణాలు అనవసరం..ఇప్పుడో లేడీ ముందుగా బెదిరించిన( చెప్పిన) పని చేసేసింది. స్ట్రీకింగ్ చేస్తూ తన ఆవేదన(?) వ్యక్తం చేసింది..తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ ఇవ్వడం లేదనేది ఆమె ఆరోపణ. పైగా శారీరకంగా కోర్కెలు తీర్చుకునేందుకు వాడుకుంటున్నారని  అందుకు వేషాలను ఎరగా వేస్తున్నారని మరో ఆరోపణ. రెండోది ఎటూ అందరూ అంగీకరించేేదే..మొదటి ఆరోపణకి నిర్మాతల ఇష్టం..అయిష్టం మేరకే ఛాన్సులు ఇస్తారు. ఈ ఆరోపణ వ్యక్తిగతమైతే..శ్రీరెడ్డికి రెండో మూడో సినిమాలు వచ్చాయి ..ఐనా అవి విడుదలైనవీ..కానివీ కూడా తెలీదు. అలాంటి సందర్భాల్లో ఆమెకి అవకాశాలిస్తారనుకోవడం భ్రమ. మరి మిగిలినవారికి అంటారా..ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఎవరికి తగ్గ ఛాన్సులు వారికి వస్తున్నాయి. ఈమె దృష్టిలో మహేష్ బాబు, పవన్ కల్యాణ్, ప్రబాస్ పక్కన ఛాన్సులు ఇస్తేనే అవకాశాలిచ్చినట్లు అనుకోవడం తప్పు. డబ్బుతో కూడుకున్న వ్యవహారం కావడంతో నిర్మాతలను తప్పు బట్టలేం..ఇక ఛాన్సులిస్తామని వాడుకోవడం మాత్రం నేరమే..దానికి కేసులు పెట్టుకోవచ్చు కానీ ఇలా బూతులు మాట్లాడుకుంటూ ఏం న్యాయం కావాలో ఆమెకే తెలియని ఉన్మాద స్థితిలో బట్టలు విప్పుకుని దానిపై  ఇతరులను స్పందించమనడం అవివేకం. ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేసుకుంటూ పోతూ..దానికి స్పందిస్తే..తిరిగి బూతులు మాట్లాడటం ఆమె ఉన్మాద స్థితికి నిదర్శనం.

.ఇక గతంలో ఇలానే ఓ సెలబ్రెటీ నగ్నంగా ప్రదర్శన చేసింది. ఆమె ప్రోతిమాబేడీ..ఐతే ప్రోతిమాబేడీ విషయానికి వస్తే సినీ బ్లిట్జ్ మేగజైన్‌కోసమని బాంబే జుహు బీచ్‌లో స్ట్రీక్ చేసింది. ఒడిస్సీ నృత్యంలో ప్రసిధ్ద కళాకారిణి అయిన ప్రోతిమాబేడీ తర్వాతి రోజుల్లో నృత్యాగ్రమ్ అనే నృత్యకళాశాలను స్థాపించింది. ఇది ఉచితంగా డ్యాన్స్ నేర్పే ఓ గురుకులంలాగా ఏర్పాటు చేశారు. కుటుంబ విషయానికి వస్తే..ప్రసిధ్ద నటుడు కబీర్ బేడీని పెళ్లాడిందీమె..ప్రోతిమాబేడీ కబీర్ బేడీ కూతురే హాట్ బాంబ్ పూజాబేడీ..కండోమ్స్ యాడ్స్‌లో సంచలనం కలిగించిన పూజాబేడీ కూడా తన షూట్‌లతో చాలామంది విమర్శలు ఎదుర్కొన్నారు. 


ఇది గతమైతే..ఛానళ్లు చుట్టూ తిరుగుతూ..బట్టలిప్పేస్తానంటూ బెదిరించి అన్నంత పనీ చేసిన ఈ స్త్రీరెడ్డి తీరు మాత్రం అందరినీ జుగుప్సకే గురి చేసిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే, ఇలా చేసినంత మాత్రాన సినిమా ఛాన్సులు రావు..పైగా ఉన్న ఛాన్సులు కూడా పోవచ్చు. ఇంకా మాట్లాడాలంటే, చీప్ గా బిహేవ్ చేసినందుకు పబ్లిక్‌లో న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు శిక్షలు పడొచ్చు కూడా..ఐతే టివి ఛానళ్లు కూడా ఇలాంటి విపరీత ధోరణని ప్రోత్సహించకుండా..ఎప్పుడో అడ్డుకట్ట వేయాల్సింది కానీ..రేటింగ్స్ పెంచుకునేందుకు ప్రతి కదలికను హైలైట్ చేయడమే అసలు విషాదం..ఒక వైపు ఆమె తన బట్టలు విప్పేసి మాట్లాడుతుంటే లైవ్‌లొ క్యాచ్ చేసినందుకు సంబరపడుతూ ఒక ఛానల్ చీప్ గా బిహేవ్ చేస్తే...వెనుక నుంచి పొటొలు తీసుకుని ఆనందించేవాళ్లు ఇంకొందరు..ఆ దృశ్యం చూసినప్పుడు శ్రీరెడ్డిపై జాలి తప్ప మరొ భావం కలగదు..ఏ కారణంతొనైనా సరే అసలు ఒక ఆడది అంతమంది ముందు నగ్నంగా నిలబడటానికి సిధ్దమైందంటే పరిస్థితి తీవ్రత ఆమెకే తెలియాలి..కానీ తన నిరసనొ..ఆవేదనొ...లేక ద్వేషాన్నొ తెలియజేయడానికి ఎంచుకున్న తీరు మాత్రం విమర్శల పాలవుతుంది..



Comments