ఆత్మవంచన రాంచరణ్..!


"అవినీతి లేని రంగమంటూ ఉంటే అది సినిమా ఇండస్ట్రీనే..!"
ఇది రాంచరణ్ మాట.. "మా సినిమా గురించి మిశ్రమ స్పందనొ..బాలేదనొ నెగటివ్ టాక్ తెచ్చే ప్రమాదం ఉంది.."ఇది అల్లు అరవింద్ మాట. "మా రంగస్థలం గర్వపడేలా చేసింది " ఇది అల్లు అర్జున్ మాట.." సినిమాల నుంచి వెళ్లిపొదాం ఇక నిర్మించలేం అనుకున్నదశలొ చేసిన సినిమా ఇది" నాగేంద్రబాబు ఉరఫ్ నాగబాబు మాట..

ఇవన్నీ మెగా స్టార్ చిరంజీవి కుటుంబసభ్యుల మాటలు..వీటిలొ ఒకదానికి ఒకదానికి పొంతన ఉన్నాయా..? పొద్దున్న లేచి కష్టపడి తిరిగి మళ్లీ రాత్రయ్యేవరకూ శ్రమపడుతూనే ఉఁటాం..ఇక అవినీతికి తావెక్కడ అని అమాయకంగా రాంచరణ్అడిగితే ప్రేక్షకులు నిజమే అని చప్పట్లు కొడతారా..ఆయన వరకూ బావుంటే అంతా బావున్నట్లేనా..ఇండస్ట్రీ అంటే మీ హీరొలు..మీ హీరొయిన్లు..మీ నిర్మాతలే కాదు బాబూ..ఇంకా చాలామంది అంతమందీ కలిస్తేనే మీ సినిమా ఇఁడస్ట్రీ..మీ గురించి ప్రత్యేకించి తప్పులు రాస్తున్నారని బాధపడితే..నమ్మడానికి అంత  అమాయకులు లేరు..

నిజంగానే ఏ తప్పులూ జరగని రంగమే అయితే..శ్రీరెడ్డి బైటికి వచ్చిన 15రొజుల్లొనే మీ గొంతు పెగలాలి..కానీ పెగల్లేదు..అత్యంత ముఖ్యమైన మర్చిపొలేని ఆరొపణ ఒకటి ఆ మహిళ చేసింది..అదేంటొ తెలుసా.." స్టూడియొలను వ్యభిచార గృహాలుగా మార్చారని" అన్నీ వదిలేయండి..ఈ ఒక్కఆరొపణకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు..అలాంటిదేం జరగడం లేదని ఎందుకు గట్టిగా చెప్పలేకపొతున్నారు..మీరు చేయనంత మాత్రాన మీ కొ ఆర్డినేటర్లు( అప్పారావ్ గాడు ఎలా టాబ్లెట్లు..లేపనాలు పూసుకుని మరీ చెలరేగుతాడొ ఆల్రెడీ చెప్పేశారు కదా) వందలాది అమ్మాయిిలను ఎలా వాడుకుంటున్నారొ తెలిసేటట్లు చెప్పినా..ఎందుకు పట్టించుకొరు..తొక్కలొ కమిటీ ఒకటి వేసి..చూశారా ఎంత పెద్ద త్యాగం చేశామొ అన్నట్లు బిల్డప్ ఇవ్వడమేంటి..అసలు ఆ కమిటీకి ఏంటి అధికారం..ఎలాంటి కేసులు పెట్టాలన్నా పొలీసులే కదా..చేయాల్సింది..అది వదిలేసి..మా కుటుంబంపై కుట్ర జరుగుతుంది..మా సినిమాపై కుట్ర జరుగుతుందని మీ మావ..బావ ఏడవడమేంటి..ఏమైనా అర్ధముందా..
బాబూ అరవీింద్..నీకొ ప్రశ్న..నీ ఒక్కడి సినిమాపై కుట్ర జరిగితేనే మాట్లాడతావా..అసలు ఇలా మాట్లాడటం వెనుక ఏంటి నీ రీజనింగ్..అంటే నీ కులపొళ్లని రెచ్చగొట్టడమా..అసలు సినిమా బావుంటే..జనం ఎవడేం చెప్పినా ఆగడు కదా..అదే కదా భరత్ అను నేను విషయంలొ జరుగుతొంది..ఐనా రంగస్థలం సిినిమాకి జరగనిది..నీ నా పేరు సూర్యకి జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నావ్..అంటే సినిమా తేడా అని ముందే తెలిసిపొయిందా...?
ఇక సినిమారంగంలొ అవినీతి లేకపొవడమేంటి..మీ సిిినిమా అసలు కలెక్షన్లెంత..వాటికి కడుతున్న పన్నులెంత..అలానే మీ సిినిమా టిక్కెట్టు రేటు ముందు పదిరొజులు పెంచుకుని అమ్ముకొవడం అవినీతి కాదా..అలా పదిరొజులు కాదు..ఆడినన్ని రొజూలూ ఎక్కువ అమ్ముతుంటే మీరు గాడిదలు కాస్తున్నారనుకొవాలా...?

సినిమా రంగం జనాలకు వినొదపరంగా తిరుగులేని సాధనం..దానిపై కొట్లాదిరూపాయల వ్యాపారం జరుగుతుందన్నది వాస్తవమే..దాన్ని నమ్ముకునే కదా..మీరు మీ కుటుంబాల నుంచి కుప్పలకొద్దీ హీరొలను మామీదకు వదులుతుంది..రకరకాల కాంబినేషన్లలొ ట్రై చేసినా తిప్పి కొడుతుంటే..ఊరుకొకుండా మామీదకి దండయాత్రలు చేయిస్తూనే ఉన్నారు కదా మీ మీ వారసులను..ఇదే ఇంకొ హీరొలను పెట్టి మీరు సినిమాలు నిర్మించారా ఎప్పుడైనా ఇది అవినీతి కాదా..మా డబ్బు మా ఇష్టం వచ్చినవాళ్లతొ తీసుకుంటాం అంటారు..ఎస్..మీకా హక్కు ఉంది..మరి మాకూ మీపై వాస్తవాలు రాసే హక్కు లేదా...?

Comments

  1. Very well said and rightly analyzed the facts.. Keep writing/blogging Sir!!

    ReplyDelete

Post a Comment