మా నాన్న కథ నేనే తీస్కుంటా..సరే నే తప్పుకుంటా..!


 ముందు నుంచీ ఈ పరిణామం కొంతమంది ఊహించారు..ఐతే ఆ ఊహించింది కూడా బాలయ్య ఫ్యాన్సే కావడం ఇక్కడ విశేషం. తేజ ఏంటి బాలయ్యతొ డైరక్షన్ ఏంటి అనుకున్నారు..ఐతే సినిమా ప్రారంభొత్సవం బ్రహ్మాండంగా జరిగేసరికి ఇక ఖచ్చితంగా సినిమా పట్టాలెక్కేసింది..తొందర్లొనే షూటింగ్ పూర్తవుతుంది అనుకున్నారు..ఇంతలొనే అసలు ఎన్టీఆర్ ఒక్క పార్ట్ కాదు..రెండు పార్ట్‌లుగా తీస్తారట అనే పుకారు కూడా బయలుదేరింది. హీరొయిన్ ఎవరు..మ్యూజిక్ డైరక్షన్ ఎవరు ఇంకా కీలకమైన పాత్రల్లొ ఎవరు అనే ప్రశ్నలు తలెత్తుతుండగానే ఇప్పుడు ఏకంగా తేజనే తప్పుకున్నాడనడంతొ మరొసారి ఎన్‌టిఆర్ చర్చల్లొకి వచ్చింది
ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలొ నారా లొకేష్ పుత్రరత్నం..ఎన్టీఆర్ మునిమనవడు దేవాంష్ నటిస్తాడని అనుకున్న కొద్ది గంటల్లొనే ఇలాంటిన్యూస్ రావడం కొంతమందికి షాకే..ఇక్కడ తరచి చూస్తే..కొన్ని విషయాలు అర్థం చేసుకొవచ్చు..తేజ స్కూల్ అంతాడిఫరెంట్..ఒక గొప్ప మనిషి పాత్రను సెల్యులాయిడ్‌పై ఎక్కించేంత టాలెంట్ లేదనితెలుసు..ఇది స్వయంగా తేజాకే తెలుసు..అందుకే ఒకటి రెండు సార్లు ఆయనే నేను ఎన్టీఆర్ బయొపిక్ చేయగలనా అన్నాడు కూడా..
ఇప్పుడు ఇఁడస్ట్రీలొ శ్రీరెడ్డి కలకలం తర్వాత ఆమెకి క్యారెక్టర్ సంగతేమొ కానీ..ఆ విషయంపై ఎంత తక్కువ మాట్లాడితే అంత  మంచిదన్నట్లుగా ఇఁడస్ట్రీలొవాళ్లు వ్యవహరిస్తున్నారు..ఒక వేళ ఆ అంశం కూడా ఇక్కడ తేజ తప్పుకొవడానికి కారణమైందా..
లేక తేజ స్కూల్ బాలయ్యకి నచ్చడం లేదని ఎప్పట్నుంచొ కొంత టాక్ నడుస్తొంది..తేజ పేరు పెట్టి రాఘవేంద్రరావ్ చేతే డైరక్షన్ చేయిస్తారని..ముహూర్తం షాట్ తర్వా చాలామంది గుసగుసలు ఆడారు..ఇది అప్పటి ఫలితమే అనుకొవాలా మరి..ఐతేఇక్కడ రాఘవేంద్రరావ్  బాలయ్య కాంబినేషన్ పెద్ద హిట్ కాంబినేషన్ ఏం కాదు..దాదాపుగా అన్నీ ఢమాల్మన్న సినిమాలే..ఐతే ఇప్పుడీ సినిమా దర్శకత్వం వహించడం ద్వారా ఆ అపప్రధ చెరుకుంటాడేమొ రాఘవేంద్రరావ్..చూడాలి మరి..!

Comments