టీమిండియా ధోనికే డబ్బులెగ్గొట్టిన కంపెనీ


భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కోర్టుకెక్కాడు. తనని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్న కంపెనీ దానికి ఫీజు చెల్లించకపోవడమే ఇందుకు కారణం ఇలా ఆ కంపెనీ మొత్తం రూ.150కోట్ల వరకూ ధోనికి బాకీ పడిందట. ఆ కంపెనీ పేరు ఆమ్రపాలి గ్రూప్..నోయిడా ఏరియాలో బాగా జనాల్ని ముంచేసిన కంపెనీ ఇది
తన లాఫ్టింగ్ షాట్స్‌తో ప్రత్యర్ధిజట్టు బౌలర్లకు సిక్సర్లు కొట్టే ధోనికి పెద్ద పంచ్ వేసింది ఆమ్రపాలి గ్రూప్.

 దాదాపు ఏడేళ్లుగా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నా, ఒక్క పైసా కూడా రెమ్యునరేషన్ ఇవ్వలేదట. 2016 వరకూ ఈ సంస్థకి మహేంద్రసింగ్ ధోని ప్రచారకర్తగా వ్యవహరించాడు. ఐతే ఆమ్రపాలి రియల్ ఎస్టేట్ సంస్థ తమకి డబ్బు చెల్లించిన వినియోగదారులకు ఇళ్లు హ్యాండోవర్ చేయలేదు.దీంతో పెద్ద రగడే చోటు చేసుకుంది. ఈ సందర్భంలోనే ధోని వ్యవహారశైలిపై విమర్శలు వచ్చాయ్. ఆ సమయంలో ధ్వోనీ ట్విట్టర్ ఖాతాలో ఈ హోమ్ బయ్యర్లు విపరీతంగా కామెంట్లతో విసిగించేవారు.దాంతో సదరు సంస్థ ఒప్పందం నుంచి ధోని తొలగిపోయాడు.
ఐతే ఆ ఏడాదే ఆమ్రపాలి యాజమాన్యం టీమిండియా క్రికెటర్లందరికీ తమ డ్రీమ్ వేలీ ప్రాజెక్టులో ఇండిపెండెంట్ విల్లాలు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది.

ధోనికి కోటి రూపాయల విలువ కలిగిన విల్లా..మిగిలినవారికి 55లక్షలు విలువ చేసే విల్లాలు ఇచ్చినట్లు చెప్పింది. ఇది 2011 వరల్డ్ కప్ గెలిచినందుకు బహుమతిగా కంపెనీ చెప్పింది. ఐతే ఇదంతా కేవలం ప్రకటనలే తప్ప నిజంగా అలాంటిదేం జరగలేదని అంటారు. ఇప్పుడు ఏకంగా ధోని రెమ్యునరేషన్ కూడా ఎగ్గొట్టినట్లు తెలియడంతో ఆమ్రపాలి తెంపరితనం మరోసారి తెలిసింది.ధోని, కేఎల్ రాహుల్ , భువనేశ్వర్ కుమార్ వంటి క్రికెటర్ల అండార్స్ మెంట్లు చూసే రితీ స్పోర్ట్స్ వాళ్ల తరపున ఢిల్లీ కోర్టులో ఈ అంశంపై పిటీషన్ దాఖలు చేసింది

Comments