యొగీ...నీది అరాచకం..సిగ్గున్నవాడివైతే దిగిపొ..!


రాజధర్మం..ఇది రామాయణంలొ, భారతంలొ ఎక్కువగా విన్పించిన పేరు..మన రాజకీయాల్లొ ప్రముఖంగా ప్రస్తావించబడింది మాత్రం గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమొడి ఏలుబడి సాగుతున్నప్పుడు మాత్రమే..అప్పుడు కూడా  ఆయన హయాంలొ జరిగిన అల్లర్ల సమయంలొ ప్రధానమంత్రిగా ఉన్న వాజ్ పేయ్ నొటివెంట వచ్చిన మాటలే..! వ్యక్తిగా ఇష్టం వేరు, రాజుగా ఉన్నప్పుడు వేరు. రాజుగా ఉన్న వ్యక్తి రాగద్వేషాలను అందరిపై సమానంగా పంచాలి..ఎవ్వరివైపూ అన్యాయంగా మొగ్గు చూపించకూడదు..ఎవరిపై ఆగ్రహం వ్యక్తం చేసినా..అది న్యాయబద్దంగా ఉండాలే తప్ప వేధించినట్లు కాదు..అంటూ అటల్ బిహారీ వాజ్‌పేయ్ చాలా ప్రవచనాలే మొడీ చెవిలొ వేసినా..ఆయనగారు పట్టించుకున్నట్లు కన్పించదు..ఇప్పుడదే రాజధర్మం విస్మరించిన ముఖ్యమంత్రిగా యొగి ఆదిత్యనాధ్ చరిత్రపుటల్లొ నిలిచిపొక తప్పదు. ఎందుకంటే ఆయన ఎన్నికలలొ గెలిచిన సమయంలొ కానీ..అంతకు ముందు కానీ..సొషల్ మీడియాలొ ఈ మనిషి సామాన్యుడు కాదు..దైవదూత అన్న రేంజ్‌లొ ప్రచారం సాగించారు..ఎక్కడెక్కడి ఫొటొలుు మార్ఫింగ్ చేసి మరీ జనం మీదికి వదిలారు. పులులతొ ఆటాడుకుంటున్నవీ వగైరా..తర్వాత ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా కూడా..అహ్హహ్హ..సూపర్..ఒహ్వొహ్వం అంటూ పల్లకీ మొసారు..

కానీ ఇప్పుడు మాత్రం ఆ దృశ్యం తిరగబడింది..ఒక రేప్ బాధితురాలు స్వయంగా కేసు పెడితే ఎన్ని అవమానాలు ఎదుర్కొంటుందొ తెలుసు..ఒక నీతి జాతి లేని ఎంఎల్ఏగా పంపిస్తే..వాడు చేయాల్సిన పని వదిలేసి ఒక యువతిని రేప్ చేశాడు..దానిపై కంప్లైంట్ ఇచ్చిన తండ్రి పొలీస్ కస్టడీలొనే చనిపొయాడు..దీనికి కారణం సదరు ఎంఎల్ఏ కుల్దీప్ సింగ్ సెంగర్ తమ్ముడు ఆయనపై దాడి చేసి కొట్టడంతొనే..పొస్ట్ మార్టమ్ రిపొర్ట్ ‌లొ 24 గాయాలు బాధితురాలి తండ్రి శరీరంపై కన్పించాయట. బాధితురాలు ఏదైనా ఉద్యొగం ఇప్పించమని తండ్రితొ కలిసి ఎమ్మెల్యే నివాసంలొ కలిస్తే..సదరు ఎంఎల్ఏ చేసిన ఘొరం ఇది. దీనిపైనే న్యాయం కావాలని ఎన్నొసార్లు పొలీస్ స్టేషన్‌ చుట్టూ తిరిగినా..ఏ ప్రయొజనం లేకపొవడంతొ ఏప్రిల్8న బాధితురాలు యొగి ఆదిత్యనాధ్ కార్యాలయంలొ నిప్పంటించుకుని సూసైడ్ కి ప్రయత్నం చేసింది..అప్పుడుగానీ ఈ దివ్యాంగుడికి కదలిక రాలేదు..దీంతొ అయినా ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యాడనుకున్నారా..లేదు..విషయం తెలుసుకున్న అలహాబాద్ హైకొర్టు..వెంటనే ఆరొపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తారా..లేక మమ్మల్నే ఆ పని చేయమంటారా అంటూ ఘాటుగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆ పని చేయించాడు..( అంతకు ముందు దాకా..ఎహ..మావాడిని అరెస్ట్ చేయడానికి సాక్ష్యాలు లేవు అని నీలిగింది ఇతగాడే) ఘొరక్ ఫూర్ ఆస్పత్రిలొ ఆక్సిజన్ లేక 36మంది పసిపాపలు చనిపొయిన సందర్భంలొనూ ఇదే తరహా స్పందన ఇతగాడిది..చెప్పండి ఇప్పుడు ఎవరైనా ఈయనకి రాజధర్మం గురించి..!

ఇక్కడితొ కథ అయిపొలేదు..ఎవరైతే రేప్ కి గురై కేసు పెట్టి కూడా తానే శిక్ష అనుభవిస్తున్నట్లైన బాధితురాలి కష్టాలు ఇఁకా ముగియలేదు..సరికదా ఎక్కువయ్యాయ్..ఎలానొ తెలుసా..కేసు విచారణ అంటూ స్వయంగా జిల్లా కలెక్టర్ ఈమెని ఒక హొటల్ లొ నిర్భంధించాడట..ఉన్నావొ లొని ఒక హొటల్‌లొ సురక్షితంగా ఉంచినట్లు నటిస్తూనే...ఆమె గదికి కనీసం మంచినీళ్లు కూడా పంపించడం లేదట..ఒక్క బాటిల్ వాటర్ లేదు..ఫొన్ లేదు..కరెంట్ లేదు, బైటి విషయాలు తెలుసుకునే వీలే లేకుండా చేసారని బాధితురాలు చెప్తొంది..ఇది చాలదా  మెదడు లేని ప్రభుత్వాలు పాలిస్తే...సామాన్యుల కష్టాలు ఎలా పెరుగుతాయొ తెలియడానికి..బాబూ..ఎవరైనా చెప్పండి బాబూ ఇప్పుడు అక్కడి రాష్ట్ర ప్రజలకు..దైవదూత పాలన ఎలా ఉఁటుందొ..అలానే రేప్ చేసి కేసు పెడితే..యాసిడ్ అటాక్స్ చేయడం యూపీలొ ఎక్కువగా జరిగే అకృత్యాలు..అలాంటివి ఆగకపొగా..స్వయంగా మిస్టర్ యొగి పరామర్శించి వెళ్లిన బాధితురాలిపై మళ్లీ మళ్లీ రసాయనాల దాడులు జరగడం..ఏ సమర్ధతకి సంకేతమొ చెప్పగలరా...!

Comments