ప్రేమను పంచు..స్వీకరించు..ఇది మోడీకి జేసి పిలుపు



రాజకీయాల్లో జేసి దివాకర్ రెడ్డి స్టైల్ వేరు..అసలు ఆయన వైఖరిని స్టైల్ అనవచ్చా అంటే ఆయన ప్రవర్తించే తీరు విభిన్నమైనది కాబట్టి స్టైల్ అనే అనాలి ఎన్నికలకు ముందు పార్టీ మారిన జేసి..ఆ తర్వాత మంత్రి పదవి ఆశించినా దక్కలేదు..ఆ  తర్వాత తన సోదరుడితో కలిసి తన ఇష్టంవచ్చిన కామెంట్లు  చేయడం ద్వారా టిడిపికి అనేక తలనొప్పులు తెచ్చిపెట్టాడని కూడా మనకి తెలుసు..ఏ మూమెంట్ వచ్చినా తనకే సాధ్యమైన కామెంట్లు చేయడం ఆయనకే చెల్లు. ఇప్పుడు తాజా మిరపకాయ బజ్జీల్లాంటి సలహాలు మోడీకి ఇచ్చాడాయన. ఉదయాన్నే ధవళకాంతులీనే వస్త్రాలతో ఢిల్లీలోని రాజ్ ఘాట్ కి వెళ్లిన ఆయన ఇతర టిడిపి ఎంపిలతో కలిసి మోడీ ఇంటి ముందు ధర్నా చేశారు..ఐతే పోలీసులు మాత్రం వీళ్లని అస్సలు కేర్ చేయకుండా లాగిపడేశారనుకోండి

ఐతే ఆ అక్కసుతోనో..లేక తన సహజవైఖరితోనో ప్రధానికి మంచి బుద్ది ఇవ్వాలంటూ ప్రసంగం మొదలుపెట్టిన జేసీ..మోడీ ఓ కఠిన శిల..అతగాడికి ప్రేమ అంటే తెలీదు..కనీసం అనాధాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లల్ని తెచ్చుకో...అమ్మని ఓ చోట మూలన పడేశావ్.. ఇంకొక ఆమెను ఇంకో చోట పారేశావు.. టింగ్ రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు.. ప్రేమను స్వీకరించు!' అంటూ  బోలెడంత కామెడీ పంచాడు..ఇంకా మధ్యలో నీ... మ్మ అంటూ కూడా నోరు జారాడు..ఇవి చూస్తే..పాపం ఢిల్లీలో మనోడిని లాగిపడేసేసరికి ఎండాకాలం ఇతగాడికి ఎక్కడ మండాలో అక్కడ మండినట్లుంది అన్పించకమానదు

Comments