మహేష్ బాబుకి అమ్మంటే ఎంత ఇష్టమో తెలుసా



మహేష్ బాబుకి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అంటే చాలా ప్రేమ గౌరవం అనే సంగతి ఫ్యాన్స్ కి తెలుసు..ఐతే మహేష్‌కి తల్లి ఇందిర అంటే ప్రాణం అని చాలా తక్కువమందికే తెలుసు.  తాజాగా భరత్ అను నేను సినిమా ఫంక్షన్‌ మహేష్ తన తల్లి ప్రస్తావన తెస్తూ బాగా ఎమోషనల్ అవడం చూశాం.. మా అమ్మ పుట్టిన రోజు ఏప్రిల్ 20..ఆ రోజున నా సినిమా రిలీజ్ కావడం నా అదృష్టం. అమ్మ ఆశీస్సులు..దీవెనల కంటే గొప్పది ఏదీ ఉండదనుకుంటాను అని చెప్పడం గమనించాలి..ఆ ఫంక్షన్‌లో అంతా ఎన్టీఆర్ , ప్రకాశ్ రాజ్, డైరక్టర్ శివ ప్రసంగాలే గమనించారు తప్ప ఈ విషయానికి ఎవరూ ప్రాధాన్యత ఇవ్వలేదు మహేష్ తన తల్లి బర్త్‌డేని అలా ప్రత్యేకంగా ప్రస్తావించడాన్ని బట్టే మహేష్ కి తన తల్లి అంటే ఎంత ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలుస్తుంది. నిజానికి ఇందిర గారిని ఎవరూ ఎక్కువగా చూసి ఉండరు. ఎందుకంటే ఆమె ఏ సినిమా ఫంక్షన్లకూ రారు. దానికి కారణాలున్నాయ్. మొదట్నుంచీ ఆమె ఇంటికే పరిమితం అయ్యారు. దీనికి తోడు కృష్ణ విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత..ఇక ఆమె బైటికి రావాల్సిన అవసరమే లేకుండా వీరిద్దరే బయట ఫంక్షన్లకు హాజరయ్యేవారు.

మిగిలిన సినిమా జనం కూడా మేడమ్ విజయనిర్మల..హీరో కృష్ణ అంటూ జంటగా ఆహ్వానించేవారు తప్ప..భార్య ఇందిరగారిని తీసుకురావాలని కృష్ణని అడిగింది లేదు..ఆయన ఆ దిశగా చొరవ తీసుకున్నదీ లేదు..ఈ విషయంలో అటు కృష్ణకానీ..ఇటు ఇందిరకానీ..తమ మధ్య పొరపొచ్చాలు రాకుండానే గడిపారని అంటారు..అందుకే విజయనిర్మలని పెళ్లాడిన తర్వాతే మహేష్, ప్రియదర్శిని, మంజులకి ఇందిరగారు జన్మనివ్వడం గమనించవచ్చు. బైట ఎంత బిజీగా ఉన్న కృష్ణ తన సంతానంతో సన్నిహితంగా మెలగడంతో వారికి ఆయనపై గౌరవం, ప్రేమ తగ్గలేదనే సంగతి అర్ధం చేసుకోవచ్చు..ఐతే మహేష్ బాబుకి మాత్రం ఆయన అమ్మతో బాగా అటాచ్ మెంట్ ఎక్కువట.

ఆమెతో పాటే తన అమ్మమ్మగారితోనే ఎక్కువ చిన్నతనంతో గడపడంతో..తన తల్లికి సంబంధించిన ఎలాంటి విషయంలో కూడా అస్సలు నిర్లక్ష్యం వహించరు. బంధువుల పెళ్లిళ్లికి హాజరైనప్పుడు ఈ విషయం అందరికీ కన్పిస్తుందట..దగ్గరుండి ఆమెకి కావాల్సిన పనులన్నీ మహేష్ చేస్తాడట. తన కూతురు సితారని చూసినప్పుడల్లా మా అమ్మని చూసినట్లే ఉంటుందని చెప్తుంటాడు కూడా..!








అందుకే ఇప్పుడు తన కెరీర్‌కి కీలకమైన భరత్ అను నేను సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ వెనక్కి తగ్గలేదని అంటారు. ఈ సినిమాకి పోటీగా నా పేరు సూర్య విడుదల అవుతుండగా..డేట్ల విషయంలో క్లాష్ వచ్చినా మహేష్ వెనక్కి తగ్గనిది ఇందుకే అంటారు. తల్లిపై అంత ప్రేమ చూపిస్తాడు కాబట్టే..మహేష్ జయాపజయాలను పట్టించుకోకుండా కుటుంబజీవితానికి ప్రాధాన్యత ఇస్తాడని తెలిసిన వాళ్లు చెప్తుంటారు. అందుకే అంటారు ఢిల్లీకి రాజైనా అమ్మకి కొడుకే అని


Comments