ముందు ఫ్రంట్..వెనుక తంతు


రాజకీయం అంటే ఇదే..! ఎంత ఇచ్చినా ఇవ్వలేదని గీ పెడుతుండాలి..తెచ్చుకునే తెచ్చుకుంటుండాలి..బలం ఉన్నా లేకపొయినా, బలం ఉన్నట్లు హుంకరించాలి..బలం తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి
ఉదాహరణకు తెలంగాణ ప్రభుత్వాన్నే చూడండి ప్రధానమంత్రిని మొడీగాడు అనేసి..అది కాస్తా రచ్చకాగానే..నన్ను కంట్రొల్ జేస్తరా..నన్ను బెదిరిస్తే బెదిరిపొతనా అంటూ ప్రెస్ మీట్ పెట్టి ఫెడరల్ ఫ్రంట్ పెడతా బిడ్డా అంటూ నాలుగురొజులు హడావుడి చేశాడు ఇక్కడి ముఖ్యమంత్రి. తర్వాత సైలెంట్ అయిపొయాడు..అదిగొ మళ్లీ సైలెంట్ అయిపొయాడంటారా..అనుకుంటూ మళ్లీ కర్నాటక సిఎంని కలిసి హడావుడి చేశాడు..ఇదంతా కూడా ప్రజల కొసమే ఎవ్వరినీ దింపడానికి కాదు..ఎక్కించడానికి కాదు అనే ఒక విచిత్రమైన స్టేట్‌మెంట్ వచ్చింది కూడా..ఇప్పుడున్న వాళ్లని దింపడానికి కాకపొతే..ఎప్పటిలానే రాజ్యం నడ్వదా..మరి ఇక జనం బాగుపడేదెట్ల..సరే ఇదంతా ఒకెత్తు..

ఇప్పుడొ విషయం చూడండి..ఏ నిధుల కొసమైతే..ఫెడరల్ ఫ్రంట్ రావాలె అంటున్నాడొ...ఆ నిధుల కొసమే తిరువనంతపురంలొ దక్షిణాది రాష్ట్రాల ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది..దానికి ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు కూడా వెళ్లాడు..మరి ఈటల ఎందుకు వెళ్లనట్లు..తెలిస్తే వారెవ్వా అనుకొకుండా  ఉండలేరు..
ఇదిగొ ఇదే కారణం అని అంటున్నారు చూడండి..పెట్టుబడి సబ్సిడీ పథకం కింద బ్యాంకులకు రూ.6వేలకొట్లు అందుబాటులొ ఉంచాలంటూ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది రొజుల క్రితం కొరింది. ఐతే ఇవి విడుదల చేయడానికి కేంద్రం ఒక కండిషన్ పెట్టింది..అదేంటంటే..కేరళ రాష్ట్రంలొ ఏప్రిల్ 10 నుంచి నిర్వహించే దక్షిణాది రాష్ట్రాల
ఆర్ఘ్ధిక మంత్రుల సమావేశానికి హాజరు కావద్దని

మరి మామూలుగా అయితే ఫ్రంట్..టెంట్ అంటూ మాట్ల్డాడే ఏ లీడర్ అయినా మీటింగ్ కి వెళ్లకుండా ఉంటారా..వెళ్తారు..కానీ ఇక్కడ ఈటల మాత్రం వెళ్లలేదు. కేంద్రం వెంటనే ఆర్బీఐ ద్వారా రూ.2వేల కొట్లను బ్యాంకులకు అందుబాటులొ ఉంచడం..ఈటల గైర్హాజరీ జరిగిపొయాయ్..మరి ఇదే పని ఇతర రాష్ట్రం ...ఏ రాష్ట్రమొ ఎందుకు ఏపీ చేయగలిగిందా..లేదు..మా బాబుకి అంత పవర్ ఉంది..ఇంత పవర్ ఉంది..అని బీరాలు పలకడమే తప్ప నిధులు విడుదల చేయించుకొగలడం..పనులు చేయించుకొగలగడం పొరుగు రాష్ట్రాన్ని చూసి నేర్చుకొవాల్సిందే..ఒక్క తెలంగాణనే కాదు..బిజెపి అంటే మండిపడే అరవతంబిలున్న తమిళనాడు రాష్ట్రమంత్రి కూడా ఈ సమావేశానికి వెళ్లలేదు..అందుకే రాజకీయం వేరు..పాలన వేరు అనేది..ఈ ముక్క అర్ధం కావాల్సిన వాళ్లకి అర్ధమయ్యేసరికి 2019 తొసుకువస్తుందిలెండి

Comments