మే 14..నాకింకా గుర్తుంది..ఇవాళ మరొ మైలురాయి


మే 14, 2004..నాకింకా గుర్తుంది..
లాల్ బహదూర్ స్టేడియంఅంతా కేరింతలు..ఒకటే జనం..నేనక్కడలేను కానీ..తొలిసారిగా ఒక ముఖ్యమంత్రి జనం మధ్యలొ ప్రమాణస్వీకారం చేస్తున్నాడు..అందులొనూ తాను ఏదైతే హామీ ఇచ్చాడొ దానిపైనే సంతకం పెడుతున్నాడు..
మా ఊరి ఎమ్మెల్యే..." వినబడుతుందా...ఆ వినబడుతుందంట..( కాసు కృష్ణారెడ్డి )
రాజా...వినపడుతుందంట.." అనడం..తర్వాత 
"యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి అను నేను " అని ప్రమాణస్వీకారం మొదలుపెట్టగానే ఒకటే హ ొరు..అవును మరి తాము కొరి గెలిపించుకున్న జనం మనిషి ముఖ్యమంత్రి అయితే అలానే ఉఁటుంది..ఈ దృశ్యాలన్నీ మేం టివీలొ చూశాం..ఒక సినిమా ఫంక్షన్ జరిగితే ఎలా ఉంటుందొ అలా రాజశేఖర్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయడం చూసాం..


తర్వాత 2009లొనూ ఇదే సీన్ రిపీటైంది..కానీ ఆ విజయానుభూతి ఇంకా  ఇంకకముందే పావురాలగుట్టలొ కలిసిపొయిన రాజశేఖర్ రెడ్డి ఈ పద్నాలుగేళ్లలొనూ గుర్తొస్తూనే ఉన్నాడు..మంచిగానొ..చెడుగానొ ప్రతి లీడర్ తలచుకుంటూనే ఉన్నాడు..

సరిగ్గా అలాంటి రొజున ఆయన కుమారుడు వైఎస్ జగన్..అదే పాదయాత్ర చేస్తూ..2వేలకిలొమీటర్ల మార్క్ చేరుకొవడం వైఎస్ ఫ్యాన్స్‌కి మరొక జ్ఞాపకంగా మిగులుతుంది.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కొత్తగా రూపు దిద్దుకుంటొన్న వేళ అధికారపక్షంలొ టిడిపి, ప్రతిపక్షంలొ వైఎస్సార్సీపీ ఉన్నాయ్. ఇప్పుడు మరొక మలుపు ముంగిట 2019 రానుంది..రానున్న ఎన్నికలలొ ఎవరు గెలుస్తారనేది చెప్పలేకపొయినా..

తండ్రి నుంచి తెచ్చుకున్న మొండిపట్టుదల , ఏకదీక్షలే జగన్ ని కరుడుగట్టిన పొలిటీషియన్‌గా తీర్చిదిద్దాయనడంలొ సందేహంలేదు. ఎవరేమనుకున్నా..తన లెక్కలు తనకి ఉన్నాయ్. గెలుపు దగ్గరైన మరుక్షణం మహానేతగా కీర్తించబడటం ఖాయమైన రాజకీయాల్లొ ప్రస్తుత పాత్ర ఎన్నాళ్లు జగన్‌ని అంటిపెట్టుకుని ఉఁటుందొ తెలీదు. ఒక్క గెలుపు అతనిపై ఉన్న విమర్శలన్నీ చెరిగిపొయేలే చేస్తుంది..ఐతే ఒటమిని తట్టుకొకపొవడమనేదే జగన్ 7 ఏళ్ల రాజకీయచరిత్రలొ లేదు..ఎలాంటి స్థితిలొనైనా పార్టీని నిలబెట్టడం సమర్ధతకి నిదర్శనం..హేమాహేమీలని చెప్పుకునే లీడర్లే ఖంగుతింటున్న పాలిటిక్స్‌లొ ప్రతిపక్షంలొ ఐదేళ్లు పార్టీని నిలబెట్టుకొవడమే ఇందుకు తార్కాణం..ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కూడా 2004కి ముందు వైఎస్‌తొ జగన్‌ని పొల్చుతున్నారు..2019లొ ముందున్న మలుపే..అతని భవిష్యత్తుని నిర్ణయించనుంది


Comments