రఘరామకృష్ణరాజు..2014 ఎన్నికలకి ముందు ఏం చేసాడోే తెలిస్తే నవ్వాపుకోలేరు


పైన టైటిల్ యూట్యూబ్ స్టొరీలకు భలే క్యాచీగా ఉంటుంది కదా..ఇప్పుడెంత కామెడీ పండిస్తున్నాడొ గురుడు అంతకు ముందు కూడా అంతే కామెడీ పండించాడు..కోళ్లజాతి సంరక్షించబడాలంటే..కోేడిపందేలు ఆడించాలని జాతికి గొప్ప సందేశం ఇచ్చిన ఈ మహానేత ..కేవీపీ రామచంద్రరావ్‌కి వియ్యంకుడు..విగ్గు పెట్టుకుని తిరగడం అలవాటైపొయిన ఇతగాడు జగన్ పార్టీలొ కొన్నాళ్లు పని చేశాడు..టిక్కెట్ ఇవ్వం పోే అని చెప్పిన తర్వాత..బైటపడ్డాడు..నానా యాగీ చేశాడు..విమర్శలూ గుప్పించాడు..సరే ఏం చేసినా పాపం టిక్కెట్ ఇవ్వలేదనే దుగ్ధతొ అలా చేశాడ్లే అనుకుని సరిపెట్టుకున్నారు..కానీ 2014 ఎన్నికలకు ముందు నామినేషన్ల పర్వం ఊపందుకుని చివరి అంకంలొకి ప్రవేశించింది

నామినేషన్ల ఘట్టం పూర్తవడానికి ఒక రోజు ముందొ..మరి అదే రొజొ కానీ..మనొడు మందీ మార్బలాన్ని వెంటేసుకుని నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపిగా పోటీ చేసేందుకు నామినేషన్ వేశాడు..అదీ టిడిపి తరపున..అంతటితో ఊరుకున్నాడా.. బిజెపి తరపున కూడా వేశాడు..ఇంతకీ తమరు ఏ పార్టీ తరపున వేశారండీ అని అడిగితే.."నీకు తెలీదా..నేనే పార్టీనొ అంటాడు..ఏ పార్టీ బి ఫామ్ ఇస్తే ఆదే నా పార్టీ " అంటాడు..వీడియొ చూడండి

పైగా ఇప్పుడు టిడిపిలొ జాయినయ్యాడట..అల్లూరి లక్షణాలు బాబులొ కన్పిస్తున్నాయట..దీంతొ చిర్రెత్తుకొచ్చిన కంకి కొడవలి పార్టీలైన సిపిఎం, సిపిఐ నేతల జాయింట్ స్టేట్‌మెంట్ ఒకటిచ్చారు. ."రఘరామకృష్ణరాజూ..నాలిక అదుపులొ పెట్టుకొ అవాకులూ చవాకులూ పేలి స్వాతంత్ర్యసమరయొధులని కించపరిస్తే సహించం "  అని
మరి అందుకే రఘరామకృష్ణరాజు అప్పట్లొ ఏం చేశాడొ తెలిసినవాళ్లకి నవ్వు రాక ఏం వస్తుంది.

Comments