22...23వది తెలంగాణ రాష్ట్రమట



"కాంగ్రెస్ ముక్త భారత్.."
ఈ నినాదం ఇప్పుడు భారత్‌లో మరోసారి మారుమోగుతోంది. కర్నాటకలో స్పష్టమైన మెజార్టీ దక్కుతుందనగానే ఇక తర్వాత ఏంటనే ప్రశ్న బయలుదేరింది..అది తెలంగాణనే అంటూ బండారు దత్తాత్రేయ ప్రకటించారు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ స్కీములనే రాష్ట్రం అమలు చేసుకుంటూ, తమపై అబద్దపు ప్రచారం చేస్తుందని విమర్శించారు. నిజానికి ఇదే వాదన అన్ని రాష్ట్రాలపై బిజెపి చేస్తూ వస్తోంది. కానీ ఇక్కడ వాస్తవంలో ప్రతి చోటా బిజెపి గెలవవచ్చు కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పరిస్థితి వేరని చెప్తున్నారు(కానీ ఇప్పుడు కర్నాటకలో సీన్ మారిపోయింది బిజెపి ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైనంత సీట్లు తెచ్చుకోలేకపోయింది)

కేసీఆర్, చంద్రబాబు రూపంలో జాతీయ స్థాయి నేతలున్నారని ఆయా పార్టీల లీడర్లు చెప్తుంటారు..కానీ ఇప్పుడా పరిస్థితి మారిందని..గుజరాత్, కర్నాటక, ఉత్తరఖండ్, గోవా తదితర ఎన్నికల ఫలితాలు నిరూపిస్తున్నాయని బిజెపి సోదాహరణంగా చెప్తుంది. నిజానికి ఇదే ఫలితంలో వాస్తవరూపం దాల్చడానికి బిజెపినేతలే అడ్డంకిగా మారుతున్నారంటారు.

ఎందుకంటే, బిజెపినేత బండారు దత్తాత్రేయ సహా చాలామంది నేతలు కేసీఆర్‌తో సన్నిహితంగా మెలుగుతుంటారు. అలాంటప్పుడు ఆయనపై..ఆయనపార్టీపై చేసే విమర్శలను జనం ఎలా నమ్ముతారని ప్రశ్నిస్తారు. మరోవైపు టిడిపి , కాంగ్రెస్‌లు కూడా టిఆర్ఎస్‌కి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నప్పుడు ప్రత్యర్ధులు ఎక్కువైనప్పుడు టిఆర్ఎస్‌ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అంతిమంగా టిఆర్‌ఎస్ విజేతగా అవతరిస్తుందని అంటారు. ఇదే గత ఎన్నికలలో నిజమైంది కూడా..!
బిజెపి వరకూ చూస్తే..కాస్తో కూస్తో పేరున్న నేతలు కూడా బిజెపినుంచి బైటికి పోతున్నప్పుడు ఆ పార్టీకి అభ్యర్ధులే కరువు అవుతారనే వాదన చేస్తుంటారు టిఆర్ఎస్ లీడర్లు. మరోవైపు కాంగ్రెస్ చూస్తే..లీడర్లు ఎక్కువై..పని చేసేవాళ్లు తక్కువ..ఇక టిడిపిలో లీడర్లు వలసబాట పట్టడమో..అజ్ఞాతంలోకి వెళ్లడమో, చేస్తున్నారు..ఇలాంటి స్థితిలో టిఆర్ఎస్‌ని ఓడించడం ఏ ఒక్క పార్టీవల్లనో కాదు..అయితే గియితే, ఆంధ్రప్రదేశ్ బిజెపి ఖాతాలో పడుతుందా అంటే ఇంకా ఏడాది సమయం ఉంది. ఇక్కడ వైఎస్సార్సీపీ రూపంలో బలమైన ప్రతిపక్షం ఉంది. ఐతే అటు జనసేన..ఇటు జగన్ పార్టీ రెండూ బిజెపితో టచ్‌లో ఉన్నాయని టిడిపి ప్రచారం చేస్తోంది. ఈ దశలో ఓట్ల చీలిక లేకపోతే ప్రతిపక్షాల విజయం సులభమనే అంచనా ఉంది..కానీ..నిజంగా అది జరుగుతుందా..?
అందుకే బిజెపి తన ఖాతాలో 23వ రాష్ట్రంగా ఏది వేసుకుంటుందో చెప్పడం ఈజీ కాదు.

Comments