టీ దుకాణం పెట్టి నెలకి రూ.3లక్షలు సంపాదిస్తున్నారు..ఏ ఐఎస్‌బీ చెప్పని మేనేజ్ మెంట్ పాఠం ఇది


నెలకి జీతం రెండున్నర లక్షల రూపాయలు..హాయిగా జీవితం వెళ్లిపోతుంది..హాయిగా ఏం ఖర్మ..దర్జాగా..రోజూ కాలు తీసి నేల మీద పెట్టకుండా కార్లోనే తిరుగుతూ ఎంజాయ్ చేయవచ్చు కూడా..ఐనా వాళ్లకి మాత్రం అది సరిపోలేదు..కాదు కాదు..నచ్చలేదు. మనసుకు నచ్చని పని అన్పించింది వెంటనే రాజీనామాలు చేశారు
ఓ టీ షాప్ పెట్టుకున్నారు..ఏడాదికి ఎంత సంపాదించేవారో..అది ఆర్నెల్లకే సంపాదించారు..ఇదీ నాగ్‌పూర్‌లోని చాయ్ విల్లా యజమానుల సక్సెస్ స్టోరీ..

చెప్పడానికి పదే పది లైన్లు..కానీ ఈ చాయ్ విల్లా ఓనర్ల కథకి ముందు చెప్పలేనంత కష్టం ఉంది..చెప్పకుండానే చెప్తోన్న గొప్ప ఉత్తేజకరమైన కథనం ఉంది నితిన్ బియానీ..పూజ ఈ ఇద్దరూ నాగ్‌పూర్‌లోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు..ఐటీ ఇఁడస్ట్రీ అంటే ఒత్తిడితో కూడుకున్న జీవితం అని ఇప్పటికే చాలామంది ఐటీ ప్రొఫెషనల్సే చెప్పారు కదా..అలానే వీరిద్దరూ కూడా ప్రెజర్ తట్టుకోలేక ఉద్యోగాలు వదిలేశారనుకుంటే పొరపాటు..తాము ఉద్యోగం చేసే రోజుల్లో దగ్గర్లోని టీ స్టాల్స్‌లో టీ తాగేవారట..కంపు కొట్టే టీ..వాటిలో ఏం కలుపుతారో తెలీదు..కానీ అలాంటి టీ కోసం కూడా జనం బారులు తీరడం గమనించారట.

అదే టైమ్‌లో రోజూ ఒకటే విధంగా చేసే ఉద్యోగాలు కూడా బోర్ కొట్టాయ్ అందుకే ఓ ఫైన్ మాణింగ్ వాటికి రిజైన్ చేశారు..ఐతే వెంటనే చాయ్ విల్లా మాత్రం స్టార్ట్ చేయలేదట..నాలుగు నెలలపాటు ఖాళీగా మార్కెట్ లో లభించే టీ..వాటిని తయారు చేసే విధానం గమనించారట..ఆ తర్వాతే తాము ఏం చేయాలో ఓ క్లారిటీ తెచ్చుకున్నారట. ఆ తర్వాతే 2017 నవంబర్‌లో చాయ్ విల్లా పేరుతో టీ హౌస్ ప్రారంభించారు ఈ ఇద్దరూ..ప్రారంభించిన ఐదు నెలల్లో లక్షా 70వేల కప్పుల చాయ్ అమ్ముడైందట..అలా పదిహేనులక్షల రూపాయలు సంపాదించారు. కప్ టీ కి వాటి రకాలను బట్టి 8 రూపాయలనుంచి 20 రూపాయల వరకూ ఛార్జ్ చేస్తారు చాయ్ విల్లాలో...

ఆన్ లైన్ ఫుడ్ ఆర్డర్లలాగా.. కొన్ని కంపెనీలకు నెలవారీ చందాలు కూడా కట్టించుకుని సప్లై చేస్తున్నారట ఈ చాయ్ విల్లా ఓనర్లు.. ఇంతటితో ఆగకుండా మరో 10 విల్లాలు పెట్టి టీ అమ్ముతామంటున్నారు వీళ్లిద్దరూ..ప్రస్తుతానికి 150మంది చాయ్ విల్లాలో పని చేస్తున్నారు. వీళ్ల టార్గెట్ పూర్తైతే..1500మందికి చాయ్ విల్లాల్లో ఉద్యోగాలు దొరుకుతాయని అంచనా..మనసుకు నచ్చని పని చేసేవాళ్లందరికీ వీళ్లో ఐకాన్స్ ఎందుకంటే..ఏ పని చేయాలన్నా..ఎవరేమంటారో అనో..అసలు సక్సెస్ అవుతామో లేదో అనుకుంటూ ఆగిపోయేవాళ్లకి నెలకి 2లక్షల రూపాయల ఉద్యోగాలు వదిలేయడం ఫూలిష్‌గా అన్పించవచ్చు..కానీ అందులోని మజా వీళ్లో కడక్ ఛాయ్ తాగి మరీ ఎంజాయ్ చేస్తున్నారు





Comments