ఇదేం బుద్దా వెంకన్నా..జగన్ ప్లాన్‌కి టిడిపి గింగిరాలు


జగన్ కొట్టిన దెబ్బకి కృష్ణాజిల్లాలో టిడిపి నేతలు కిందా మీదా పడుతున్నారన్నది నిజం. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెడతామంటూ జగన్ ప్రకటించిన మరుక్షణంలోనే తెలుగుదేశంపార్టీలో పై నుంచి కిందిదాకా అందరూ జగన్‌పై మాటలదాడి చేసేందుకు సిధ్దమైపోయారు. కానీ కృష్ణాజిల్లాలో పాదయాత్రకి భారీగా స్పందన రావడంతో పాటు..కొత్తగా ఈ హామీ ఇవ్వడంతో నిమ్మకూరు జనానికి కూడా వైెఎస్సార్సీపీ అధినేత బాగా దగ్గరైపోయాడట.

స్వయంగా ఎన్టీఆర్ బంధువులే స్థానిక చెరువను ఎంపి కొనకళ్ల ఎలా దగ్గరుండి 50 అడుగుల లోతుకి తవ్విస్తుందీ చూపించడంతో దానిపై స్పందించకతప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాటే జిల్లాకి ఎన్టీఆర్ పేరు ప్రతిపాదనపై టిడిపి అధ్యక్షుడు కళావెంకట్రావ్ పిల్లచేష్ట అంటూ కామెంట్ చేశారు. కేశినేని నానిలాంటి వారు పేరు పెడితే గౌరవం ఇచ్చినట్లా అంటూ వితండవాదానికి దిగాడు. ఏతావాతా తేలిందేంటంటే..ఎన్టీఆర్ పేరు పెడతా అనే ప్రకటన టిడిపి వర్గాల్లో ప్రకంపన సృష్టించింది ఎందుకంటే..అసలు ఈ విషయంపై ఆలోచనే చేయలేని టిడిపి..ఉన్నట్లుండి జగన్ వేసిన బాణానికి విలవిలలాడింది. దానికి తార్కాణం ఇవాళ బుద్దూ వెంకన్న చేసిన కామెంటే..అసలు టిడిపి లీడర్లు ఎప్పుడో ఎన్టీఆర్ పేరు పెట్టడానికి డిసైడయ్యారట. జిల్లాలు కొత్తగా ఏర్పాటు అయిన తర్వాత నిమ్మకూరు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లాకి అన్న పేరు పెడతామని ఎప్పడో నిర్ణయించుకున్నామంటూ తీరిగ్గా ఇవాళ చెప్తున్నాడంటే దాని అర్ధం జగన్ ప్రకటనకి జనంలో స్పందన బాగా రాబట్టే..అలా వచ్చిన  క్రెడిట్‌ని తమకి దక్కించుకునేందుకే ఇలాంటి ప్రకటన బుద్దా వెంకన్న చేశాడని వైఎస్సార్సీపీ ఆక్షేపిస్తే అందులో తప్పులేదు. ఎందుకంటే జగన్ ఏ క్షణం ఆ ప్రకటన చేశాడో వెంటనే " హే బాబూ అది మా నిర్ణయం..నువ్ హైజాక్ చేశావ్" అని ఈపాటికి నానా రభసా చేసేవాళ్లు..
ప్రతి విషయంలోనూ జగన్ ఏది చేస్తే..దాన్ని తర్వాత ఫాలో అవుతున్న టిడిపి చివరికి తమ పార్టీ అధ్యక్షుడి పేరు విషయంలోనూ జగన్ వెనుక నడుస్తున్నట్లు ఉండటం హాస్యాస్పదమే.

సరే మరి ఎన్టీఆర్ కి భారతరత్న విషయంలో ఎందుకు టిడిపి వెనకాడుతుందో కూడా చెప్పాలి కదా ఎందుకంటే..అలాంటి ప్రతిపాదనతో తమ దగ్గరకు ఇంతవరకూ ఏ ప్రతిపాదనా రాలేదని ప్రతి ఎన్టీఆర్ బర్త్ డే రోజున హడావుడిగా ప్రచారం కోసం ప్రకటనలైతే చేస్తారు కానీ..అదంతా వట్టిదేనని పార్లమెంటరీ కార్యదర్శులు, కేంద్రప్రభుత్వ కార్యాలయాలు ఇప్పటికే చాలాసార్లు తేల్చేసింది..మరి వెంకూ నిజంగా నీ మదిలో అంత చిత్తశుధ్ది ఉంటే..భారతరత్న విషయంలోనూ మీ పార్టీ వైఖరి ఏదో చెప్పేయ్. లేదంటే రేపు జగన్ ఆ ప్రకటన చేసిన తర్వాత..హలోవ్..అది మేం ఎప్పుడో అడిగాం తెలుసా అని దేబిరించడం కాదు

Comments