పేరుకే విలన్!ఇద్దరు నటులతో డబ్బింగ్,ఇద్దరు హీరోయిన్లతో పెళ్లి,కన్నడ ప్రభాకర్ గురించి తెలియని విషయాలు




ఒక హీరో నలభై ఏళ్లు కెరీర్ సాధించాడంటే గొప్ప విషయమే..కానీ ఒక విలన్‌గా పరిచయమైన వ్యక్తి దాదాపు 35 సంవత్సరాలు అలరించడం చిన్న విషయం కాదు. ఎందుకంటే మనకి అలాంటి ప్రతినాయకపాత్రలు పోషించిన వ్యక్తులు మధ్యలో హీరోలుగా మారారు. తర్వాత ఫేడవుట్ అయ్యారు. ఇదే సన్నివేశం అతని విషయంలోనూ రిపీట్ అయినా..తెలుగువారికి మాత్రం విలన్‌గానే కొనసాగారు. ఆయనే కన్నడ ప్రభాకర్ ఉరఫ్ టైగర్ ప్రభాకర్.




1947లో మార్చి 30న బెంగళూరులో పుట్టిన ప్రభాకర్ దాదాపు 450 సినిమాల్లో నటించాడు. 1967లో కాదిన
రహస్య అనే కన్నడ సినిమా ద్వారా తెరపై మెరిశాడు. 1981లో చట్టానికి కళ్లు లేవు సినిమాతో తెలుగు తెరపై కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతకు ముందే కృష్ణ, రజనీకాంత్‌ల అన్నదమ్ముల సవాల్, ఎన్టీఆర్ యుగంధర్ సినిమాల్లో క్యారెక్టర్లు చేశాడు కూడా..అంటే కన్నడం, తమిళంలో తన సత్తా చాటుతున్నా తెలుగువారికి పరిచయం
అవడానికి మాత్రం 14ఏళ్లు పట్టిందన్నమాట. కన్నడంలో రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, రవిచంద్రన్, తెలుగులో కృష్ణ, ఎన్టీఆర్,చిరంజీవి, బాలకృష్ణ, అర్జున్, భానుచందర్, రజనీకాంత్, ఇలా ఏ టాప్ స్టార్ మూవీ అయినా కూడా విలన్ కానీ..ముఖ్యపాత్ర కానీ ప్రభాకర్ దే.. తెలుగులో 40కి పైగానే సినిమాలు చేసినా...ఎక్కువ విలన్ వే..కన్నడంలో మాత్రం థ్రిల్లర్, సైకోపాత్ , ఫాంటసీ సినిమాలతో పాటు డిటెక్టివ్ సినిమాల్లో హీరోగా కూడా చేశాడు కన్నడ ప్రభాకర్. ఫాంటసీ సినిమాల్లో నాగుపాము ప్రాధాన్యత ఉన్న సినిమాలకి కన్నడ ప్రభాకర్ ఫేమస్..ఇదే ట్రెండ్ ఆ తర్వాతా మనకి చంద్రముఖి వచ్చేవరకూ సాగింది. అసలు చంద్రముఖికి ఒరిజినల్ ఇక్కడ తయారైన ఆప్తమిత్రనే కారణం. ఈయనకే ప్రత్యేకమైన ఓ భాషని కూడా కన్నడ ప్రభాకర్ సృష్టించాడు. అదే కంగ్లీష్..కన్నడాన్ని ఇంగ్లీష్ పదాలతో మిక్స్ చేసి డైలాగులు వేసేవాడు..అదే డైలాగ్స్ ని చాలామంది అక్కడి మిమిక్రీ ఆర్టిస్టులు స్టేజీపై ప్రదర్శించి చప్పట్లు కొట్టించుకునేవారు.






1993లో చివరిసారిగా బాలకృష్ణతో కలిసి చేసిన నిప్పురవ్వ తెలుగు సినిమా..ఆ తర్వాత ముత్తుతో డబ్బింగ్ రూపంలో తెలుగులో కన్పించాడు. కానీ ఈ మధ్యలోమోహన్ బాబు తెలుగులో తీసిన ఖైదీగారు అనే రీమేక్ సినిమాలో ముందు కన్నడ ప్రభాకర్ నే తీసుకున్నారు. కానీ ఆ సినిమా ఓపెనింగ్ రోజున మాట్లాడుతూ కన్నడ
ప్రభాకర్ ఈ సినిమా డైరక్టర్ సాయిప్రకాష్ గారు మంచి క్యారెక్టర్ ఉందంటే చాలారోజుల తర్వాత చేస్తున్నా అని చెప్పారు. ఇది నచ్చని మోహన్ బాబు అలా అయితే నా సినిమాలో మీరు చేయక్కర్లేదు అని మొహంమీదే అందరి ముందూ నోరు పారేసుకున్నారు. దీంతో నొచ్చుకున్న కన్నడ ప్రభాకర్ అలా అనకండి నేను మీకోసం కూడా
చేస్తున్నాను అన్నా కూడా విన్పించుకోలేదు. దీంతో ప్రభాకర్ చాలా అవమానంగా ఫీలయ్యాడు. అలా తెలుగు సినిమాలకు దూరం అయ్యాడు ప్రభాకర్. ఇక  బెల్లియప్ప బంగారప్ప అనే సినిమాలో అయితే ఒకప్పటి కర్నాటక ముఖ్యమంత్రి కుమార బంగారప్ప స్వయంగా నటించడం విశేషం. కన్నడ ప్రభాకర్ స్వయంగా తానే 8 సినిమాలకు
దర్శకత్వం కూడా చేశాడు. ఇది ఏ ప్రతినాయక పాత్రధారికీ దక్కని ఘనత. కన్నడ సినిమాల్లో వసూళ్లు పెంచిన చరిత్ర కూడా ఈయనదే అని అక్కడి పత్రికలు రాస్తాయ్.విలన్‌గా యాక్షన్ ఓరియెంటెడ్ మూవీస్ ఎక్కువ చేసిన ఆయనకి థియేటర్లో అన్ని క్లాసుల జనం అభిమానం దక్కింది. ఎప్పుడైతే ఆయన హీరోగా మారాడో అప్పుడిక బి, సి
క్లాస్ ఏరియాల్లో కూడా జనం ఈయన సినిమాలకు ఇరగబడి వచ్చేవారట. సినిమాల్లో ఎలాంటి ఫైట్లు చేసేవారో..నిజంగా కూడా కనీసం పది సందర్భాల్లో పైట్లు చేశారని చెప్తారు. 90వ దశకంలో కన్నడనాట యాక్షన్ సినిమాలకు ఓ ట్రెండ్ క్రియేట్ చేసిన రికార్డు ఆయనదే. విలన్లను బట్టలు ఉతికినట్లు ఉతికే సీన్లతో  ఆయనకి ఫ్యాన్స్ టైగర్ అనే బిరుదు ఇవ్వగా..తెలుగులో మాత్రం కన్నడ నటుడు కాబట్టి కన్నడ ప్రభాకర్ అనే పిలిచేవాళ్లు..ఏదైనా భారీ బడ్జెట్ సినిమా ఉందీ అంటే అందులో ఖచ్చితంగా కన్నడ ప్రభాకర్ ఉండేవాడు. ఇక ఏ నటుడికీ లేని ఓ అరుదైన ఘనత కన్నడప్రభాకర్ కి మొదట్లో పిజె శర్మ డబ్బింగ్ చెప్పగా..తర్వాతి రోజుల్లో ఆయన కుమారుడు రవిశంకర్ డబ్బింగ్ చెప్పడం. మనకి తెలిసి ఇలా ఒక నటుడుకి ఇలా తండ్రీకొడుకులు డబ్బింగ్ చెప్పింది లేదు.



రాజకీయంగా రామకృష్ణ హెగ్డేని బాగా అభిమానించే కన్నడ ప్రభాకర్ ఆయన బాటలోనే నడిచి డబ్బులేనివాళ్లని ఆదుకునేవాడని చెప్తారు. రాజకీయాల్లోకి వచ్చి కులం ప్రస్తావన లేకుండా చేయాలని బాగా తపన పడేవారని చెప్తారు.


 మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్న కన్నడ ప్రభాకర్‌ కి ముగ్గురు సంతానం. హాట్ లేడీ జయమాలతో సౌందర్య అనే కుమార్తె, మొదటి భార్యతో భారతిగీతా, వినోద్ ప్రభాకర్ ఉన్నారు. వీరిలో వినోద్ ప్రబాకర్ నటుడిగా నిలదొక్కుకునే ప్రయత్నం చేసాడు. ప్రభాకర్ మూడో భార్య కూడా హీరోయినే. ఆమె పేరు అంజు. ఈమెతో కూడా కన్నడ ప్రభాకర్ కి మరో కొడుకు పుట్టాడు అతగాడి పేరు అర్జున్ ప్రభాకర్. కన్నడ ప్రభాకర్ చేసుకున్న రెండు, మూడు పెళ్లిల్లూ విడాకులకు దారి తీయడంతో పాటు ఆస్తులు కూడా పోగొట్టుకోవాల్సి వచ్చింది. 1980లలో జరిగిన ఓ బైక్ యాక్సిడెంట్, వేళకి సరిగా తినకపోవడం ప్రబాకర్ ఆరోగ్యాన్ని ఆ తర్వాతి కాలంలో బాగా దెబ్బతీశాయ్. లివర్ పాడైపోయి కామెర్లు రావడం జరిగింది. ఆ జబ్బు నుంచి కోలుకోలేక పోవడంతో చివరికి అవయవాలు అన్ని పని చేయక..2001లో చనిపోయాడు కన్నడ ప్రభాకర్.





Comments