రంగా తీసిన సినిమా..ఒక్క నెగటివ్‌ లేకుండా తగలబెట్టేశారు



వంగవీటి మోహనరంగా..కాపు నేత..అంతకు మించి తెలుగుదేశం పార్టీని గడగడలాడించిన లీడర్‌గా చెప్తారు. దాని కంటే ముందు
విజయవాడ సిటీలో ఓ వర్గానికి బలమైన నేతగా ప్రాభవం చాటారంటారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఈ చట్రం నుంచి బైటపడి రాష్ట్రస్థాయినేతగా ఓ వర్గానికి ప్రతినిధిగా ఎదిగారు రంగా..1988లో చనిపోయిన తర్వాత కాపు వర్గానికి బలమైన ఐకాన్‌గా మారడంతో పాటుగా ప్రతి ఊరిలో ఈయన విగ్రహాలు పెట్టారంటే అతిశయోక్తి కాదు. అలాంటి రంగా తాను బతికున్న రోజుల్లోనే తమ వంగవీటి సోదరుల జీవితంపై ఓ సినిమా తీశారంటే ఆశ్చర్యమే పాత సినిమాలను మళ్లీ మళ్లీ చూసేందుకుగానూ ఇప్పుడు యుట్యూబ్‌లో వెతకడం సహజం..ఐతే ఈ సినిమా యూట్యూబ్‌లో ఎక్కడా కన్పించదు.

అసలు తిరిగి థియేటర్లలో చూడటానికి కూడా వీలవదు..ఎందుకంటే అప్పట్లోనే ఈ సినిమాని అధికారంలో ఉన్న టిడిపి ప్రభుత్వం నిషేధించింది..ఈ సినిమా పేరు చైతన్యరధం..అచ్చంగా ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వాడిన వాహనం పేరు కూడా ఇదే..ఐతే ఇందులో కథాంశం అంతా వంగవీటి సోదరులు, దేవినేని కుటుంబం, ఇంకా ఇతర వర్గాలతొ గొడవలతో పాటుగా బెజవాడ రాజకీయాలను చూపించారు. వంగవీటి రాధాగా శరత్ బాబు వంగవీటి రంగాగా భానుచందర్ నటించారు. ఈ సినిమాని రాధామిత్రమండలి నిర్మించగా..ఎర్ర సినిమాలకు, అభ్యుదయభావాలతో సినిమాలు తీసే ధవళ సత్యం దర్శకత్వం వహించారు. సినిమా పోస్టర్లలో కూడా వంగవీటి రంగా ఫోటోలు గమనించవచ్చు..ధవళ సత్యాన్ని అసలు రంగాతో సినిమా తీయడం కూడా చాలామంది  అడ్డుకోవాలని చూశారట..కానీ ఎర్రమల్లెలు ఇచ్చిన ఉత్సాహంతో ఎక్కడా తగ్గకుండా ముందుకే వెళ్లి ఈ చైతన్యరధాన్ని పూర్తి చేశారు. చంపేస్తామంటూ ధవళసత్యాన్ని బెదిరించారట కూడా..ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. అందుకే షూటింగ్స్‌కి కూడా తన కుటుంబం మొత్తాన్నీ తీసుకుని వెళ్లేవాడినని ధవళ సత్యం చెప్పారు

అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూడా సినిమా విడుదల చేయొద్దని చెప్పారట. చైతన్యరధం రిలీజైంది..సూపర్ హిట్టైంది. తమిళంలోకీ డబ్ అయింది. అప్పట్లోనే ఆ సినిమాని మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి స్వయంగా రీమేక్ చేద్దామనుకున్నారట. కానీ ఎన్నికలలో బిజీ అవడంతో ఆ పని వీలుకాక డబ్ చేయమని సలహా ఇచ్చారట. .చైతన్యరధం విజయయాత్ర కూడా చేశారు వంగవీటి రంగా..ఇంత విజయం సాధించిన తర్వాత సినిమా మళ్లీ ఎక్కడా కన్పించలేదు

ఐనా ఆ తర్వాత ఎక్కడా ఆ సినిమా కన్పించలేదు..దానికి కారణం ఆ ఫిల్మ్స్ కూడా ఇప్పుడు ఎక్కడా కన్పించవ్. ఐతే ఇదే సినిమాని బేస్ చేసుకుని తర్వాత శివ, గాయం, బెజవాడ లాంటి అనేక సినిమాలు వచ్చాయి. తమిళ సినిమా దళపతి కూడా చైతన్యరధం స్ఫూర్తే నంటారు.వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవగా..మిగిలినవన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయ్

ఇతర విషయాలకు వస్తే దివంగత నటుడు శ్రీహరిని కూడా రంగా హీరోని చేద్దామని అనుకోవడం విశేషం.  రంగా  నిరాహారదీక్ష ముగింపు రోజున ఈ విషయం ఫైనలైజ్ అవ్వాల్సి ఉండగా..హత్యకు గురయ్యారని ధవళ సత్యమే చెప్పడం మరో విశేషం( ఆ తర్వాతి కాలంలొ దాసరి డైరక్షన్లొ వచ్చిన బ్రహ్మనాయుడు అనే సినిమాలొ శ్రీహరికి ఒక పాత్ర ఇవ్వడం జరిగింది..ఇందులొ కృష్ణంరాజు హీరొ)



. చైతన్యరధం అనే సినిమా సృష్టించిన సంచలనం మాత్రం అప్పటి జనాలకు గుర్తుంది కానీ ఇప్పటివారికి కేవలం జ్ఞాపకాలే మిగిలాయ్. ఎందుకంటే చైతన్యరధం సినిమా నెగటివ్స్, డిస్ట్రిబ్యూట్ చేసినవారి దగ్గర నుంచి ఒక అజ్ఞాతవ్యక్తి కొని..వాటిని తగలబెట్టారని తెలిసిందట. ఇది కేవలం వారిపై ఉన్న వ్యతిరేకతను తర్వాతి తరాలకు తెలియజేయకుండా ఉండటానికే ఇలా చేశారని అంటారు..కానీ ఇక్కడ  రంగా ఫ్యాన్స్‌కి..ఆ సినిమా చూడాలని కోరుకునే సినిమా లవర్స్‌కి రిలీఫ్ లాంటి న్యూస్ ఏంటంటే చైతన్యరధానికి సంబంధించిన ఒక్క నెగటివ్ మాత్రం వంగవీటి రత్నకుమారి దగ్గర ఉందని ధవళ సత్యం చెప్పడం..అది ఎప్పటికైనా మళ్లీ రిలీజ్ అయితే ఓసారి చూడాలని చాలామంది  కోరుకుంటున్నారు

Comments