కృష్ణగారు జెంటిల్‌మెన్ చిరంజీవి వేరు,బాలకృష్ణ బంగారం : తమ్మారెడ్డితమ్మారెడ్డి కృష్ణమూర్తి రెండో కుమారుడైన తమ్మారెడ్డి భరద్వాజ మొదట్లో కేవలం సినిమా నిర్మాణానికే పరిమితమయ్యాడు. తండ్రి స్థాపించిన రవీంద్ర ఆర్ట్స్ బ్యానర్‌పై కోతలరాయుడు, మొగుడుకావాలి, మరో కురుక్షేత్రం సినిమాలు నిర్మించిన భరద్వాజ..ఆ తర్వాతికాలంలో సొంతంగా దర్శకత్వం వహించడం ప్రారంభించాడు
చరితచిత్ర కంబైన్స్ పతాకంపై సినిమాలు నిర్మించేవాడీయన.


ఐతే ఈక్రమంలో ఇండస్ట్రీలో దాసరినారాయణరావుతో కూడా గొడవపడ్డానని చెప్తాడు మరో కురుక్షేత్రం సినిమా రేలంగి నరసింహారావ్ డైరక్షన్లో తీయాలని దాసరి చెప్పి..ఆ తర్వాత వేరేవాళ్లతో సినిమా అనౌన్స్ చేయడంతో ఆ గొడవ చోటు చేసుకుందని అందుకని తానే ఆ పేరుతో మరో సినిమా ప్రారంభించాడు భరద్వాజ. ఐతే దాసరిగారితో తనకి ప్యాచప్ అయిపోయిందని చనిపోయేంతవరకూ దాసరికి తమ్ముడిలా చూసుకున్నారని చెప్తాడు.

 అలానే ఇండస్ట్రీలో తనకి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా పచ్చనిసంసారం అని చెప్పుకునే భరద్వాజ తర్వాత కృష్ణగారితో రౌడీ అన్నయ్య షూటింగ్ సందర్భంగా గొడవ పడ్డాడట.

సినిమాలో సిల్క్ స్మిత పాటని బాబూమోహన్‌తోనే తీయాలని తానూ..నేను హీరోని.క్లైమాక్స్‌లో నేను లేకుండా పాట ఉంటే జనం చూడరని కృష్ణ పట్టుబట్టారట. ఐతే ఇద్దరితోనూ పాట తీశామని..ఐతే ఆ విషయం కృష్ణగారికి తెలీదని భరద్వాజ ఇటీవల తెలిపాడు. సినిమా సెన్సార్ సమయంలో ఆ పాట తీసేయాలని చెప్పారట. ఐతే కృష్ణ మాత్రం ఆ పాటలో తానే ఉన్నాననుకుని, అప్పటి సెన్సార్ బోర్డ్ మెంబరైన సుబ్బిరామిరెడ్డితో గొడవ పడ్డారట..ఏంటిది సుబ్బరామిరెడ్డీ..ఏం తప్పు ఉంది ఈ పాటలో అన్నారట..ఆ మాటలతో కోపం తెచ్చుకున్న సుబ్బిరామిరెడ్డి రా..కృష్ణా నీకే సినిమా చూపిస్తా..చూద్దువుకానీ ఏం ఉందొ అని చూపించగానే కృష్ణగారు బైటికి వచ్చి భరద్వాజకి షేక్ హ్యాండ్ ఇచ్చారట.

దాంతో భరద్వాజ ఇదేంటి ఈయన నాపై కేకలు వేస్తారనుకుంటే సినిమా సూపర్ ఉంది అని చెప్తారని అనుకున్నాడట. కానీ కృష్ణ వెంటనే భరద్వాజ ఇవాళ్టితో మన ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పి వెళ్లిపోయారట. అది కృష్ణగారి గొప్పతనం అని భరద్వాజ చెప్తారు. ఆ తర్వాత తానే రౌడీ అన్నయ్య విషయంలో కృష్ణగారి జడ్జిమెంటే కరెక్ట్ అని తెలుసుకున్నానని ఒప్పుకున్నారు. అంత పెద్ద హీరో చీప్ గా డ్యాన్సులు కామెడీ చేయకూడదనేది తన అభిప్రాయం అని అనుకున్నా..అది తప్పని తర్వాత తేలిందని తెలుసుకున్నాడట. ఈ పాట హిందీ ఖల్ నాయక్‌లో ఛోళీకే పీచే క్యాహైకి పూర్ ఇమిటేషన్..ఇంకో విశేషం ఏమిటంటే..మొత్తం ఈపాటని మూడుసార్లు తీస్తే సిల్మ్ స్మిత ఏ అభ్యంతరం పెట్టకుండా నటించిందని..బంగారంలాంటి పిల్లని మెచ్చుకున్నాడాయన.
  అలానే ఇండస్ట్రీలో హీరోలకు బాగా ఇగో ఎక్కువని..చిరంజీవి కెరీర్ మొదట్లో తనని అన్నయ్యా అని పిలిచేవాడని..ఇప్పుడు ఏం భరద్వాజ అంటున్నాడని వాపోయాడు. ఇది తప్పితే చిరంజీవి మంచోడే అంటారు. అలానే తనకి తెలిసిన హీరోల్లో బాలకృష్ణ బంగారం అని..తనకి ఎలాంటి పరిచయం లేకపోయినా, తెలుగు సినిమా వజ్రోత్సవాలలో తనని ఎంతో గౌరవం ఇచ్చాడని చెప్పారు. ఆ స్థాయి ఉన్న హీరో అయినా, ప్రతి రోజూ ఈ రోజు ఏంచేయాలి రేపు ఏంచేయాలి అని అడిగి తెలుసుకునేవాడట బాలయ్య. అలానే వెళ్లేటప్పుడు భరద్వాజ గారూ నేను ఇప్పుడు వెళ్లిపోవచ్చా..రేపు ఎన్ని గంటలకి రావచ్చు అని అడిగేవాడట. అలానే ఆ తర్వాత కూడా ఎక్కడ కన్పించిన గౌరవంగా మాట్లాడతారని చెప్పాడు. ఇక పవన్ కల్యాణ్ ని వజ్రోత్సవాల్లో డ్యాన్స్ వేయించడానికి నానా తిప్పలు పడ్డానని గుర్తు చేసుకున్నాడు.

 ఆలీ యాంకరింగ్ చేసే ఓ కార్యక్రమంలో తన జ్ఞాపకాలు అనుభవాలు ఇలా పంచుకున్నాడు భరద్వాజ. తమ్మారెడ్డి భరద్వాజ విషయానికి వస్తే ఈయనే స్వయంగా 5గురు నటులను సోలో హీరోలుగా పరిచయం చేశాడంటే ఆశ్చర్యపోకతప్పదు.కోతలరాయుడితో చిరంజీవి, ఊర్మిళ, దొంగరాస్కెల్‌తో శ్రీకాంత్‌ని, ఇద్దరు కిలాడీలతో సుమన్, భానుచందర్ మన్మధసామ్రాజ్యంతో రఘుని వన్‌బై టుతో జెడీ చక్రవర్తిని అలా తెరపై కథానాయకులుగా పరిచయం చేశాడు భరద్వాజ. కమ్యూనిస్టు పార్టీలతో అనుబంధం ఉన్న కొంతకాలం పేరు కలిసి రావడం లేదని టి. భరద్వాజ్ అని..తమ్మారెడ్డి భరద్వాజ్ అని టైటిల్స్‌లో వేయించుకోవడం విశేషం. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కొన్నాళ్లు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా కొన్నాళ్లు ఉద్యోగం చేశాడట ఈయన. తీస్తోన్న సినిమాలు ఆడవు అని తెలిసి కూడా కాస్తో కూస్తో సందేశాత్మక సినిమాలు తీసే నిర్మాతలలో తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఒకరు.

Comments