బాబూ గారూ మీ పుత్రరత్నాలేనా యువతరం అంటే..?


మహానాడులొ ఏపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబు ఎప్పటిలాగానే పాత విషయాలను..పాత విమర్శలను పాత మాటలతొనే గంటకిపైగా ఏకధాటి ప్రసంగం చేశారు. వాటిలొ ముఖ్యంగా బిజెపిని టార్గెట్ చేసి వాడిన మాటలకు మంచి స్పందనే వచ్చింది. నిజంగా వచ్చే ఎన్నికలలొ ఇక బిజెపికి ఒటేయకూడదనే చాలామందికి అభిప్రాయం కలుగుతుంది కూడా..ఒక్కొక్క రాష్ట్రంలొ బిజెపి ఎలాంటి దరిద్రపు గొట్టు పాలన చేస్తుందొ( ఈ నాలుగేళ్లలొ గుర్తుకురాలేదు) చంద్రబాబు మరొసారి చెప్పారు. అందులొ భాగంగానే కర్నాటకలొ ఎమ్మెల్యేలను బేరం చేయబొయారని గుర్తు చేశారు. మరి ఈ సమయంలొ ఆయన పక్కనే వేదికపై కూర్చుని ఉన్న బుట్టా రేణుక ఏ పార్టీ..అలానే మంత్రులుగా పదవులు వెలగబెడుతున్నవారు ఏ పార్టీ..వాళ్లని ఏలాంటి బేరం లేకుండానే పార్టీలొకి తీసుకున్నారంటే నమ్మే జనం తక్కువ. అందుకే ఆయన ఆ మాట అంటున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ మారిపొయి గొంతు పీలగా అయిపొయింది
ఇంకొక విషయం తెలుగుదేశానికి యువనాయకత్వం కావాలని..యువత ముందుకు రావాలని పిలుపు ఇచ్చారు. నిజమే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు యువతరమే వచ్చింది. కానీ ఇప్పుడు మీ దృష్టిలొ యువతరం అంటే ఎవరు గురూగారూ..! మీ పుత్రరత్నం..గంటా శ్రీనివాసరావు కొడుకు, జేసీ దివాకర్ రెడ్డి కొడుకు, మురళీమొహన్ కొడలు, అచ్చెనాయుడు కొడుకొ కొడలొ..గాలి ముద్దుకృష్ణమనాయుడు కొడుకు, కరణం బలరాం కొడుకు, పరిటాల సునీత కొడుకు, కొడెల శివప్రసాదరావు కొడుకు, పత్తిపాటి భార్య, దేవినేని ఉమా సంతానం, బొండా ఉమా పుత్రరత్నాలు, ఇలా చెప్పుకుంటూ పొతే మీ నేతల కొడుకులు, కూతుళ్లు కాకుండా...ఒక కొత్త యువకుడికొ యువతికొ పార్టీ తరపున టిక్కెట్టు ఇచ్చి్..గెలిపించే బాధ్యత తీసుకొగలరా...ఇదే ప్రశ్న మీకే కాదు అన్ని పార్టీలకు కూడా..

మీ పుత్రరత్నమే కార్పొరేటర్లు, వార్డు మెంబర్లుగా కూడా గెలవలేని వారిని ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసామని గొప్పలు చెప్పుకుంటారు మీరేమొ యువనాయకత్వం రావాలని కొరుకుంటారు..ఇది ఎలా సాధ్యపడుతుంది మీరే చెప్పాలి. ఎందుకంటే అలాంటి అసమర్ధులను నింపుకుని పార్టీలొ ఏం చేద్దామని..మా నెత్తిన రుద్ది బీభత్సమైన అభివృధ్ది చేద్దామంటే కుదరదు కదా..!

Comments