ఆడపిల్లకి రక్షణగా ఉందాం..ప్రగల్భాలు పలకకండి సర్

వారం రొజులు కూడా కాలేదు..ఘనత వహించిన ముఖ్యమంత్రి గారు సుబ్బయ్య ఉరి వెనుక మా ప్రభుత్వ సమర్ధతపై అతనికి ఉన్న నమ్మకమే ఉరేసుకునేలా చేసింది అని కామెంట్ చేసి..ఇదిగొ పైన కన్పిస్తున్న మహబూబ్ వలీ అనే ఘనుడు బహశా తన కూతురంత వయసు ఉంటుందేమొ ..ఒ పిల్లకి కడుపు చేశాడు. ఇతగాడి నైచ్యాన్ని తట్టుకొలేక నిన్న స్పృహ తప్పి  పడిపొయిందంట..దీంతొ అప్పుుడు గానీ కళ్లు తెరవని(నిజానికి ఇలాంటి సంఘటనలు ఎవరికైనా ఎలా తెలుస్తాయి లెండి) సమాజం ఒక్కసారిగా మేల్కొంది

ఇదిగొ ఇలా పట్టుకొచ్చి పొలీసులు ప్రభుత్వాసుపత్రిలొ పరీక్షలు చేశారు..అంటే ఇతగాడు మగాడా కాదా అనేమొ..ఇప్పుడా పిల్లకి ఏమని టెస్టులు చేస్తారు. మూడు నెలలనుంచి అఘాయిత్యం చేస్తుంటే(ఇక్కడ వేరే పదాలు వాడాలి కానీ..వాడటానికి కూడా అసహ్యం వేస్తుంది) నువ్వెందుకు కంప్లైంట్ చేయలేదు..అంటే నీకు ఇష్టమయ్యే ఎంజాయ్ చేసావన్నమాట అని వేధిస్తారేమొ..ఎటూ కేసు మహిళా కమిషన్‌కి చేరింది కాబట్టి..వలీ గాడు తప్పించుకొలేడు..

కానీ మరి చంద్రబాబుగారిచ్చిన మాటేంటి..ఆడపిల్లకి రక్షణ కల్పిద్దాం అనే ర్యాలీకి పరమార్ధం ఏటి.. ప్రతిధ్దానికీ చంద్రబాబుని ఎందుకు లాగుతారు? ఆయనకి వేరే పని లేదా..అంటారా..అవును ప్రతి విషయం ముఖ్యమంత్రే పట్టించుకొవాలంటే కుదరదు..కరెక్టే..మరి ఎందుకు ఉత్తరకుమార ప్రగల్భాలు..పలకాలి..ఏంటీ...మా ప్రభుత్వం ఉరి తీస్తుందని తెలిసే, సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడా...మరి వలీ  ఏం చేయాలి..MPTC కదా వదిలేస్తారా..పొనీ ప్రతిపక్ష లీడరే వలి అని ముద్ర వేసి మైలేజీ తెచ్చుకొండి..
సరే సదరు మగాడు వైఎస్సార్సీపీ ఎంపిటిసీనే అనుకొండి..ఎందుకు బురద జల్లడం..మీరెటూ ఒక ర్యాలీ చేశారుగా..దాని ప్రకారమే ఇతగాడినీ శిక్షించండి మరి చూద్దాం..కుదురుతుందా..? లేదా...?

Comments