నిపా వైరస్ నో ఫియర్.. ఫుల్ డీటైల్స్..తెలుగు జనానికి నో ప్రాబ్లెమ్


కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోన్న నిఫా వైరస్ అంటే మిగిలిన చోట్ల కూడా కంగారు మొదలైంది. ఎందుకంటే కారణం  వీటి లక్షణాలే..మనకి ఎలాంటి జ్వరమైనా ఇప్పుడు తలనొప్పి వళ్లు నొప్పులు సాధారణమైపోయాయ్. అందుకే ఈ లక్షణాలు కన్పిస్తే చాలు..వామ్మో ఇదేం జ్వరమో..నిపా వైరస్సో కాదో ఎలా తెలుసుకోవాలి అని జనం అల్లాడిపోతున్నారు ఐతే ఈ జ్వరం వచ్చేది జూనాటిక్ వైరస్ తో ..జూనాటిక్ అంటే జంతువుల ద్వారా వ్యాపించే జబ్బులను జూనాటిక్ డిసీజెస్ అంటారు. మరి ఈ నిపా వైరస్ ఎలా వస్తుందంటే మొదట అవి గబ్బిలాల నుంచి గాల్లో వ్గాపిస్తుందని చెప్తున్నారు. అంటే గబ్బిలాలు తిన్న పళ్లు, కూరగాయలు తింటే..దాంట్లో ఆ జబ్బు క్రిములు ఉంటే అలా మనుషులకు కూడా వ్యాపిస్తుంది. అంటే ఇక్కడే శుభ్రత అనే కాన్సెప్ట్ మనకి రక్షణ కవచంగా పని చేస్తుందన్నమాట.

ఇక రెండో మార్గం గబ్బిలాలు తిన్న ఆహారాన్ని పందులు కూడా తింటే..ఆ పందుల నుంచి కూడా వైరస్ వస్తుంది. ఇక్కడా మనకి రక్షగా మన పరిశుభ్రతే కీలకం..పంది మాంసం తినేవారికి ఈ ప్రమాదం ఎక్కువ. ఇంకోటి పందులు తిరిగే ఏరియాల్లో తిరగకపోవడం. ఏతావాతా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాల్లో ఆహారం తినకపోవడం మంచిది. బాగా వేడిగా ఉన్నప్పుడే ఆహారం తీసుకోవాలి. వాంతులు, విరేచనాలు, జ్వరం వళ్లు నొప్పులు ఇన్ని లక్ష
ణాలు కలిసి ఉన్నప్పుడు మాత్రమే నిపా వైరస్ గా అనుమానించాలి..ఇక్కడ కూడా పూర్తిగా నిపా వైరస్ వచ్చిందని నిర్ధారణ కాదు కేవలం అనుమానమే..వైద్యులు తక్షణం చికిత్స మొదలుపెట్టినప్పుడు జబ్బుని ఎదుర్కోవచ్చు. ముందుగా భౌతికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు పందులు, గబ్బిలాలు లేకుండా చూసుకోవడం. తర్వాత తీసుకునే ఆహారం పరిశుభ్రంగా ఉంచుకోవడం. ఇంకా ముఖ్యంగా ఇలా గబ్బిలాలు తినే ఆహారం ఏమిటో తెలుసుకోవాలి..గబ్బిలాలు జనసమ్మర్దం ఉన్న ఏరియాల్లో ఉండవు..

కానీ తాటి చెట్లు ఉండే ప్రాంతాల్లో ఉంటాయ్ ఇవి తిన్న తాటి కాయలు కానీ..తాటి ముంజలు కానీ తింటే వైరస్ రావచ్చు..కాబట్టి కొన్ని రోజులు రోడ్డు మీద ఎలా పడితే అలా ఉన్న తాటి ముంజల జోలికి వెళ్లవద్దు. ఓ వేళ తెచ్చుకుంటే వాటిని తొక్క తీయకుండానే ఉప్పునీళ్లలో బాగా నానబెట్టి తినాలి. ఆ..సమ్మర్ లో వీటి టేస్ట్ పోతుంది కదా అనుకుంటే, ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదు కదా..
ఇలా కేరళలో రోగులకు చికిత్స చేస్తూ ప్రాణాలు వదిలిన లినీ గురించి తెలుసు కదా..ఆమె చివరి లేఖ చూసిన ప్రతి ఒక్కళ్లూ మనిషి జీవితం ఎంత చిన్నదో గుర్తు చేసుకుంటూ తల్లడిల్లిపోతున్నారు.
ఆ కుటుంబానికి తీవ్ర సంతాపం తెలియజేశారు. ఆమె భర్త తన జీవితం ఇక ఆమెకోసమే అంకితం అంటూ స్పందించిన తీరు చాలామందికి కంటతడి తెప్పిస్తోంది కేరళ ప్రభుత్వం తమ టూరిజం ప్రదేశాలకు కొన్ని రోజులు ఎవరూ రావద్దంటూ ప్రకటించిందంటే అక్కడి పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు

Comments