మనవాళ్లు..బ్రీఫ్డ్ మీ...ఇప్పుడేమవుతుంది..టిడిపిలొ టెన్షన్ స్టార్టైంది


" హలోవ్...
హా..బ్రదర్..
సర్ విల్..మాట్లాడతారు..
సర్..
హోో ఆర్ యూ...
ఫైన్ సర్..థ్యాంక్యూ సర్..
అదే..మనవాళ్లు..బ్రీఫ్డ్ మీ...వాట్ ఆల్ ఆర్ దే..సెడ్..వుయ్ డూ..దట్ ఈజ్ అవర్ కమిట్‌మెంట్..యూ కెన్ ఫ్రీలీ యూజ్ యువర్ ఒట్.."
ఈ సంభాషణ తెలుగుదేశం పార్టీ ఉన్నంతకాలం ఎవరికైనా వెంటనే గుర్తుకురాకమానదు..కేసీఆర్ నీ అంతు చూస్తా అని చంద్రబాబు..చట్టం ముందు అందరూ సమానమే..నామీద సవాళ్లు చేస్తావా..పెడబొబ్బలు పెడుతుండు చంద్రబాబు..నీ తరం కాదు..అది అంటూ కేసీఆర్ ఇద్దరూ ఒకళ్లపై ఒకళ్లు గొంతెత్తి అరుచుకున్న సందర్భాలూ ఆ తర్వాతికాలంలొ చూశాం...కట్ చేస్తే...మన భరత్ అను నేను సినిమాలొ లాగా..తిరిగి ఫ్రెండ్షిప్ చేసుకున్నారు..
కానీ కాలం గిర్రున తిరిగింది..ఇప్పుడు అప్పటి ఆడియొ టేపుల్లొ ఏది ఎవరి గొంతొ తెలిపే FORENSIC రిపొర్ట్ వచ్చేసింది..

ఇదే రిపొర్ట్..తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి ిఇచ్చారట..దానిపై తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డితొ కేసీఆర్ భేటీ అవడం కూడా ఆసక్తి కలిగించేదే..ఇది చంద్రబాబు గొంతు కాకపోతే , ఈ సమావేశం జరిగి ఉఁడేది కాదన్న వాదన ఉంది. అంత మాత్రాన చంద్రబాబు గొంతని నిర్ధారించారు కాబట్టే..ఈ ఇద్దరూ కలిసి చర్చించారు అనుకోవడానికీ లేదు..అది అన్యాయంగా చంద్రబాబుని దొషిగా నిర్ధారించినట్లే అవుతుంది..అలాంటి పాపానికి మనం ఒడిగట్టవద్దు..కానీ అప్పటి ఏసిబి డైరక్టర్ జనరల్ ఏకే ఖాన్‌ని కూడా ఈ డిస్కషన్‌కి పిలవడమే ఊహాగానాలు ఎక్కువయ్యేలా చేస్తొంది.  ఈ కేసులొ రేవంత్ రెడ్డి జైలుకెళ్లి ప్రస్తుతం బెయిల్‌పై తిరుగుతున్నాడు..అలానే చంద్రబాబు పాత్రని విచారించేందుకు నొటీసులు జారీ అయ్యాయ్..ఈ దశలొ చంద్రబాబుని విచారించాలంటే ముందుగా గవర్నర్ అనుమతి కావాలి. అదంత ఈజీ కాదు..ఐనా కొర్టులొ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల వేసిన పిటీషన్ కొట్టివేసిన తర్వాత కూడా ఇంకా ఈ కేసులొ చంద్రబాబు బొనెక్కడం అంటూ జరుగుతుందని అనుకొవడం భ్రమ..ఎందుకంటే స్ట్రింగ్ ఆపరేషన్లకి వేల్యూలేదని కొర్టులు చెప్పాయంటారు..ఐతే..ఈ కొర్టులు ఏం చేయలేవ్..కానీ ప్రజలకొర్టు ఒకటి ఉఁది కదా..నాపై ఎన్ని కేసులున్నా ఒక్కటీ విచారణకు కూడా రాలేదనే అతిశయం ఉంది కదా..అది మాత్రం ఇక్కడ పనికి రాకుండా పొతుంది. ఒక్కసారి ఫొరెన్సిక్ రిపొర్ట్ కనుక ఆ వాయిస్ చంద్రబాబుదే అని తేల్చితే..ఇన్నాళ్లూ ఇతరులపై బురదజల్లి తాను నిప్పు అని చెప్పుకుంటున్న అనుభవజ్ఞుడికి కావాల్సినంత పిడకలు అఁటుకుంటాయ్

Comments