బయట గాలికి లోపల సీలింగ్ జంప్..ఇదీ అమరావతిలో సెక్రటరియేట్ సీన్



ఏపీ అసెంబ్లీ కానీ..సెక్రటరియేట్‌కానీ, కట్టినప్పట్నుంచి అటు విపక్షం..ఇటు అధికారపక్షం ఒకరిపై ఒకరు
దుమ్మెత్తి పోసుకుంటూనే ఉన్నారు. వారికి తోడుగా వరుణదేవుడు తోడైనప్పుడు ఇక ఆ హంగామా అంతా ఇంతా కాదు జగన్ ఛాంబర్లోకి నీళ్లు రావడంతో ఇదేం కట్టడం అని వైఎస్సార్సీపీ..దీని వెనుక కుట్ర ఉందని అధికారపక్షం గత ఏడాది విమర్శలు గుప్పించుకున్నాయ్. ఇప్పుడు తాజాగా అదే సీన్ కన్పిస్తోంది.

నడి ఎండలు మంటలు పుట్టిస్తున్న సమయంలో ఇలా వర్షాలు పడటం ఏపీవాసులకు హాయి గొలుపుతుంటే, అధికారపక్షానికి మాత్రం దడ పుట్టిస్తోంది.ఎందుకంటే..మళ్లీ జగన్ చాంభర్లోకి నీళ్లు రావడంతో ప్రభుత్వం పరువు పోయినట్లైంది


ఎందుకంటే, చిన్నపాటి వర్షానికే ఛాంబర్లు తడిచిపోవడం ప్రకృతి బీభత్సం కింద నెట్టేయవచ్చు కానీ..ప్రతిసారీ ఇలా ఛాంబర్లలోకి రావడం అనేది కట్టడాల్లోని నిర్మాణలోపాలకు నిదర్శనాలే..ఐతే ఈసారి మరీ విచిత్రంగా మంత్రి నారాయణ ఛాంబర్లోకి నీళ్లు రావడంతో దీన్ని ఎలా తిప్పి కొట్టాలో తెలీక టిడిపినేతలు జుట్టు పీక్కుంటున్నారు.పైగా జగన్ ఛాంబర్ దగ్గర పోలీసుల పహరా కాయడమే అసలు ఎపిసోడ్‌లో హైలైట్.

Comments