మిమ్మల్ని నిజమైన మగాళ్లుగా మార్చుతాం ట్రాఫిక్ పోలీసుల సవాల్


ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనోళ్లు పడే వేషాలు అందరికీ వళ్లు మండిస్తాయ్.ప్రతి ఒక్కళ్లూ ఏదోక సందర్భంలో నిబంధనలను పక్కనబెట్టేసే ఉంటాం.కానీ ఎదురుగా వెళ్లి మరీ అదేదో హక్కులాగా లైన్స్ క్రాస్ చేయడమనేది మాత్రం కొంతమందికే చెల్లు.అలాంటి కొంతమంది వలన మిగిలినవారికి ఎంత ఇబ్బందో,వారికి అనుభవవైకవేద్యమయ్యేంత వరకూ తెలీదు. ఏముంది..రోడ్ ఖాళీగా ఉంది..వ్యతిరేక దిశలో దూసుకెళ్దాం..ఏం రోజూ వెళ్లడం లేదా ఏంటి..అనుకుంటూ వెళ్లి..జస్ట్ ఎదురో పెద్ద జేసీబీ వస్తే తప్పించుకోవడం చేతకాక( అంటే సాధ్యపడక)
కాళ్లూ చేతులు విరగ్గొట్టుకున్నవారు ఎంతమంది లేరు.

అందుకే ఇలాంటి సన్నివేశాలు సినిమాల్లో చూసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొన్న జనం బాగా స్పందిస్తారు. చప్పట్లు కొడతారు..తీరా థియేటర్ బైటికి రాగానే అడ్డదిడ్డంగా నడిపించేస్తూ తమ నైజం చాటుకుంటాం..భరత్ అను నేనులోలాగా, అనాగరికంగా బతికేస్తుంటాం. ఎక్కడబడితే అక్కడ నిలబడి, చేతులు తడిపితే వదిలేస్తారనే నిందలు మోస్తోన్న ట్రాఫిక్ పోలీసుల్లో నిజాయితీ పరులు ఉంటారు. సంఘానికి కాస్త మంచి చేద్దామనేవారూ ఉంటారు..అలాంటిదే ఇప్పుడు ట్విట్టర్లో ఓ సంఘటన హడావుడి చేస్తోంది. తనకి ఇష్టమైన స్టిక్కర్లు అతికించేసుకుని
ఎంజాయ్ చేసే వ్యక్తులకు చెంపపెట్టు ఇది..

  NO HELMET..I DIE LIKE REAL MEN అంటూ ఓ ప్రబుధ్దుడు పెద్ద ఘనకార్యం చేసినోడిలా తిరుగుతూ కెమెరాకి చిక్కాడు. ఇతగాడి పేరు కృష్ణారెడ్డి..ఈ చలాన్‌తో సహా ఇతగాడి స్టిక్కర్‌కి కౌంటర్ పోస్ట్ చేశారు..
కృష్ణారెడ్డి గారు మీరు మమ్మల్ని క్షమించాలి..మిమ్మల్ని మేం చనిపోనివ్వం. నిజమైన మగాడిలా బతికేలా చేస్తాం అంటూ భరత్ అను నేను సినిమాలో మహేష్ డైలాగ్‌ని వాడేశారు. ఈ తిరుగులేని కౌంటర్‌కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది

Comments