బిజెపిలో లతా మాధవీయం..జనసేనలో దేవ్ ఆగమనం

మళ్లీ పవన్ కల్యాణ్ బిజెపి పంచన చేరుతున్నాడా..ఈ చిన్న అనుమానం ఇప్పుడు ఎక్కువ అవుతోంది..ఈ విషయాన్ని ఎక్కువ టిడిపినేతలే ప్రచారం చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే చిన్నా చితకా ఆధారాలు చూపెడుతున్నారు..ఎవరో దేవ్ నారాయణో..సచ్‌దేవో ఒకాయన భీభత్సమైన  వ్యూహాలు తయారు చేస్తాడంటూ...ప్రెస్‌మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ పరిచయం చేయడం ఒకానొక హాస్యకదంబమైతే..ఇప్పుడు దానికి కొనసాగింపుగానా అన్నట్లు..ఓ మహిళా నాయకి..బిజెపిలో జాయిన్ అవడం విచిత్రం అన్పిస్తుంది

ఎక్కడా చెల్లనోళ్లు సినిమాల్లో..రాజకీయాల్లో..జర్నలిజంలోకి తోయబడతారనే ఒక ప్రథ ఉంది..అలానే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా టర్న్ అయింది..అయినా లాభం లేకపోయింది. ఇక సినిమాలు లేక సినిమాల్లో వేషాల్లేకపోవడానికి , ఇతర చిల్లరవేషాలు వేయకపోవడమే అంటూ రకరకాల గొట్టాల ముుందు వాపోయిన ఈ లలనామణి ఇప్పుడు కమలంగుర్తు పార్టీలో చేరిపోేయి తన జీవితానికి పరమార్ధం చేకూర్చే పనిలో పడిపోయింది.
పవన్ కల్యాణ్ ని పెళ్లి చేసుకుంటా..ఎవడేంతమందిని చేసుకుంటే ఏంటి..సిినిమాల్లో పడుకోకుండా వేషాలు రావు..అంటూ ధర్నాలు కూడా చేసిన మాధవీలత జనసేనలో జాయినైపోయి తన బాసుకి దగ్గరవుతుందన్న సంకేతాలు పంపింది..కానీ ఇప్పుడు నితిన్ గడ్కరీ సమక్షంలొో కాషాయం అందుకుంది..ఆల్రెడీ అక్కడ జీవిత ఉంది..అయినా అదే పార్టీలొ జాయిన్ అయిందంటే..ఇది ఖచ్చితంగా తమ స్నేహపూర్వక పార్టీల్లోకి అటూ ఇటూ చేరికలకు ఉదాహరణగానే అని జనం గుసగుసలు ఆడుతున్నారు. 

Comments

Post a Comment