దమ్ము..మూర్తికి ఉఁదా లేదా..ఇప్పుడు తేలిపోద్ది

వైఎస్సార్సీపీ లీడర్లలొ ముందు వరసలొ విన్పించే పేరు రోోజా..అటు సినిమా స్టార్..మరోవైపు పొలిటికల్ స్టార్..అందుకే ఆమెపై ఎవరైనా ఏదైనా విమర్శ చేస్తే వెంటనే ఫోకస్ అవుతారు. టిడిపిలో  ఈ సంగతి తెలిసినవాళ్లంతా రోజాపై కామెంట్లు చేయడంలో హద్దులు మీరుతుంటారు. ఒకరు..ఆంటీ అంటారు..మరొక మంత్రే స్వయంగా ఆమె చరిత్ర ఏంటో నాకు తెలుసు..రికార్డింగ్ డ్యాన్సర్లు నయం అని అంటారు.. ఇంకొక సీనియర్ లీడర్ అని చెప్పుకునే 70 ఏళ్ల ముసలాయన కూడా నోరు పారేసుకుంటారు..ఇన్ని చేసినా రోజాకి సరైన రిటార్టు ఇవ్వడం మాత్రం సాధ్యపడదు

ఇవాళ పెందుర్తిలొ స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తిపై రోజా ఆరోపణలు చేసింది. మహిళలను వేధిస్తున్నారని విమర్శించింది. టిడిపి ప్రభుత్వంలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులే ఇలా చేస్తే ఎలాగనే స్వరంతో ఆమె మూర్తికి చీవాట్లు పెట్టింది. దానిపై స్పందించిన మూర్తి..రోజా నాలుక చీరేస్తా..గుండు గీయిస్తా అంటూ రెచ్చిపోయాడు..అసలే కోతి దానికి తోడు కల్లు తాగింది..ఆపై నిప్పు తొక్కిందన్న రీతిలో మూర్తి మాట్లాడటంతో రోజా వెంటనే రంగంలోకి దిగిపోయింది..ఎక్కడొ కాదు నీ నియొజకవర్గంలోనే ఉన్నా..దమ్ముంటే గుండు గీయించు అని
సవాల్ విసిరింది. 
దీంతొ పాపం సత్యనారాయణమూర్తి నవరంధ్రాలూ మూసుకుపోయాయ్..ఇతగాడు పేరుకే ఎమ్మెల్యే కానీ..నోరు తెరిస్తే బూతులే మాట్లాడతాడు..జగన్‌పై కూడా ఇలానే నోరు పారేసుకుని విమర్శలపాలయ్యాడు..పైగా ఏదో నాలుక చీల్చడానికి ఇతనికే పేటెంట్ రైట్లు ఉన్నట్లు ప్రతిసారీ అదో ఊతపదంలా వాడేస్తుంటాడు..ఇప్పుడు రోజా జోలికి పోవడంతోే సముచితరీతిలో సత్కారం అందుకున్నాడు..

Comments

Post a Comment