కాగల కార్యం లొకేష్ తీర్చుతాడా


లొకేష్ తీరు చూస్తుంటే కొంప ముంచేలా ఉందని టిడిపి లీడర్లు బాహాటంగానే మాట్లాడుకుంటున్నారు. మహానాడులొ లీడర్లందరినీ కాదని ఆయనకి మైక్ ఇస్తే ప్రతిసారీ ఏదొక తడబాటు మాటలతొ అపహాస్యం పాలయ్యే ఆయన ఈసారి పెద్ద చిక్కేతెచ్చిపెట్టాడంటున్నారు. ఎందుకంటే లొకేష్‌పై పవన్ కల్యాణ్ అలిగేషన్స్ చేసి చాలా రొజులు అయింది. దాని ఊసే ఇప్పుడు ఎవరూ ఎత్తడం లేదు. అలానే జగన్ అయితే అసలు లొకేష్ ఉనికినే గుర్తించడంలేదు. నిన్నగాక మొన్న ఉభయగొదావరి జిల్లాలొ పాదయాత్ర, బహిరంగసభల్లొ చంద్రబాబుపై ఉతికి ఆరేశాడే కానీ. ఎక్కడా ఇతగాడి ప్రస్తావనే తీసుకురాలేదు.
కానీ ఇవాళ లొకేష్ స్వయంగా ఇవాళ మాట్లాడిన తీరు చూస్తుంటే బహుశా తనని ఎవరూ పట్టించుకున్నట్లు లేదు అనుకున్నాడొ ఏమొ కానీ..నాపై ఆధారాలతొ ఆరొపణలు చేయండి..నిరూపించండి అంటూ సవాల్ విసిరాడు. గతంలొ ఇలానే అంబటి రాంబాబు సవాళ్లు విసిరీ విసిరీ చివరికి సిబిఐ దర్యాప్తు వరకూ వెళ్లింది జగన్ విషయంలొ..అప్పటి పరిణామాలు తెలిసినవాళ్లకి గుర్తున్నవాళ్లకి ఇది మళ్లీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలానే లొకేష్ కూడా నాపై తప్పుడు ఆరొపణలు చేయొద్దు దమ్ముంటే ఆధారాలు చూపించండంటూ కేకలు వేస్తున్నాడు..అసలు మహానాడు పార్టీ సభ. అందులొ ఇవాళ ఎన్టీఆర్ బర్త్ డే ఏదైనా ఉంటే ఆయనని పొగడటం తమ పార్టీ ఫ్యూచర్‌లొ ఏం చేయబొతుందొ చెప్పుకొవడం చేయాలి కానీ..ఎంతసేపూ..బయ్ పడేద్ లేదు..మన శత్రువు బిజెపి, జగన్ కి అంత సీన్ లేదు అంటూ ప్రేలాపించడం తగదు..నిజంగా ఏపీలొ ప్రతిపక్షనేత జగనా..లేక బిజెపినా అన్నది లొకేష్ కి తెలీదేమొ అన్పించకమానదు. రెండున్నరవేల కిలొమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న లీడర్‌కి సీన్ లేక..నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలిచిన బిజెపికి ఎలా ఉంటుందొ లొకేషే చెప్పాలి. పైగా బిజెపిని ఒడించండి అంటే..దానర్ధం అక్కడికేదొ బిజెపి 175సీట్లలొ పొటీ చేస్తుందా..ఇది తెలిసి చేస్తున్నాడా లేక తానేదొ బీభత్సమైన స్ట్రాటజీతొ వెళ్తున్నాడని అనుకొవాలనా..లొకేష్ తీరు అంతుపట్టక పాపం వంధిమాగధుల ఛానళ్లు కూడా ఏ బ్రేకింగ్ పెట్టి నడపాలొ తెలీక జస్ట్ లైవ్ ఇచ్చి ఊరుకున్నాయ్
ఈ రెండు అంశాలు చూస్తే ఒకటి కేసులు..ఇవి ఎక్కడ పెడతారొ అని చంద్రబాబే జనంలొ గగ్గొలు పెడుతున్న సంగతి తెలిసిందే..నా చుట్టూ మీరుండాలి మీరే నన్ను కాపాడాలి అంటూ ఫీలర్లు ఇస్తున్నాడాయన. కానీ ఇప్పుడు ఆధారాలు కావాలి అఁటూ లొకేష్ ఆహ్వానిస్తుండటాన్ని ఎలా అర్ధం చేసుకుంటాడొ మరి బాబు..అలానే రెండొది రాష్ట్రంలొ ఎవరికి ఒటేయాలొ అప్పుడే లొకేష్ చెప్పడం గందరగొళానికి తెరలేపేదే..!
ఐతే ఇవాళ్టి సభలొ చంద్రబాబు మాత్రం భేషైన మాట ఒకటి అడిగాడు..అమిత్ షాకి అమరావతి నిధుల ఖర్చుతొ ఏం పని అని..నిజమే ఇదే సంగతి మనం చాలాసార్లు ముచ్చటించుకున్నాం..చక్కగా అడిగాడు..కానీ మరి ఇదే మాట..ఎన్డీఏతొ తెంపులు చేసుకునే ముందు మళ్లీ జైట్లీ, షా పిలిచారు అంటే ఎందుకు ఎగేసుకెళ్లారు..అప్పుడెందుకు గుర్తుకురాలేదు. ఇలాంటి రెండు నాలుకల ధొరణులతొనే చంద్రబాబు అభాసు పాలవుతుంది. మనకి ఇష్టమైనన్నాళ్లూ ఎవరు ఎలాగ ఊరేగినా పర్లేదా..మనకి పడనప్పుడు మన చాప కిందకు నీళ్లొస్తున్నప్పుడు మాత్రం తప్పా...ఇదెలా కరెక్ట్ బాబూ..!

Comments