పూరీ ఇది నీకు తగునా


కొంతమంది వ్యక్తులు నిరంతరం స్ఫూర్తినొందుతూ..తమ చుట్టూ ఉన్నవారిలో కూడా అదే రకమైన ఉత్తేజం నింపేలా వ్యవహరిస్తుంటారు. మరి కొంతమంది మాత్రం తమ లక్ష్యం నెరవేరిన తర్వాత డల్ అయిపోతారు. విశ్రాంతి దశకు చేరతారు. సైన్స్‌లో గ్రోత్ కర్వ్ ( వృద్ధిరేఖ) అని ఒక విషయాన్ని చెప్తారు. మొదట్లో ఒక అంశానికి ప్రోత్సాహం ఇస్తూ ఉంటే అది బాగా వృధ్ది చెందుతూ పోతుంది..ఒక దశకి వెళ్లిన తర్వాత అది ఆగిపొతుంది. తర్వాత అక్కడ్నుంచి తిరిగి సరళరేఖా పద్దతిలో సాగిపోతుంటుంది..ఇక్కడ్నుంచి తిరిగి తిరోగమనం పట్టొచ్చు..కానీ మళ్లీ ఓ బూస్టప్ ఇచ్చినప్పుడు అది అక్కడ్నుంచి పైపైకి పోతుంది..అంటే ఏదోక ఎనర్జీ బూస్టర్( ఉత్ప్రేరకం ) ఇస్తేనే కెరీర్ సాఫీగా సాగుతుంటుంది. ఇదే సూత్రం తెలిసికానీ..తెలియకుండా కానీ కొంతమంది అవలంబిస్తుంటారు..సిినిమా హీరోలు..దర్శకులు నటుల విషయంలో ఇది గమనించవచ్చు..ఇదే దశలో ప్రస్తుతం లాగ్ ఫేజ్ అంటే దాదాపు చచ్చుబడ్డ స్టేజ్‌లో ఉన్నాడు పూరీ జగన్నాధ్..

ఈయన సినిమాల్లో ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం ఒక్కటే కాస్త కెరీర్‌పై దృష్టి పెట్టిన క్యారెక్టర్ కన్పిస్తుంది..ఇక ఏ సినిమాలోనూ పైపూతలాగా హీరో క్యారెక్టర్‌కి హీరోయిజం ఆపాదించడమే తప్ప యూత్ చూసి నేర్చుకోవాల్సిందేం కన్పించదు..పైపైచ్చు,..చిత్తకార్తె కుక్కల్లా హీరోయిన్లపైకి ఎగబడి మూతులు నాకడమే కన్పిస్తుంది..అలాంటి ఈయన తన పుత్రుడ్ని తెరపైకి తద్వారా ప్రేక్షకులపైకి వదులుతున్నాడు..ఆయన డబ్బులు ఆయనిష్టం కానీ..సినిమా ప్రమోషన్‌కి లోకల్ ఇష్యూస్‌పై పెద్ద అవగాహన..పట్టింపు ఉన్నవాడిలా మాట్లాడటమే ఖండించాల్సింది..
ఆసిఫా లాంటి పిల్లలపై దారుణాలు జరగడానికి ఇతగాడు ఇతగాడిలాంటి దర్శకులు తీసే సినిమాలే ఆజ్యంపోస్తున్నాయనడంలో సందేహం లేదు. దానికి బాధపడుతున్నట్లుగా ీఈయన ప్రకటించిందేమిటంటే..
దేశంలో ఇలాంటివి చూసినప్పుడు బాధ కలుగుతుందట..ఇలాంటి తరుణంలో జనగణమన వంటి సినిమాలు చాలా ముఖ్యం..అవసరమట..ఎవరో ఒక హీరోతో తీస్తానంటూ చెప్పుకొచ్చాడు..చేయాల్సినంత చెడంతా చేసేసి..ఇప్పుడేదో కొత్త సినిమా తీయడం ద్వారా జనాలకు ఏదో ఒరగబెడతాననడం ఎలా సరి అన్పించుకుంటుంది.పైగా మీ బ్యాచ్ అంతా డ్రగ్స్ బీభత్సంగా సేవిస్తారని టాక్..ఆ కేసులో మీరు అమాయకులైతే ఎందుకు విచారిస్తారు..ఏం ఏ మహేష్ బాబునో ఎందుకు విచారించలేదు..సంఘానికి అసలు చీడపురుగులంటే మీరే..అలాంటిది మీరే ఇప్పుడు నీతులు చెప్పడం తగదు మిస్టర్ పూరీ..పూలు మీ ఆవిడకో...నీ దోస్త్ ఛార్మికో పెట్టుకో..మాకు కాదు

Comments