ముమ్మాటికీ ప్రభుత్వవైఫల్యమే..! నీకూ నీ మంత్రులకూ ప్రాణాలంటే లెక్కలేదా బాబూ


ఒక ఇన్సిడెంట్ జరిగితే..వరసగాఅవే రిపీటవుతుంటాయని వ్యాఖ్యానిస్తుంటాం..వరసగా రొడ్డు ప్రమాదాలు..అగ్ని ప్రమాదాలు..కాలవల్లొకి బస్సులు దూసుకెళ్లడాలు..ఇందులొ ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపొయినంత వరకూ ఒకే..కానీ ఒక సంఘటన జరిగిన తర్వాత మిగిలినవి జరగకుండా ఉఁడటానికైనా కొన్ని రొజులు హడావుడి ఉంటుంది..కానీ ఇవాళ తూర్పుగొదావరి జిల్లా దేవిపట్నం మండలంలొ గొదావరినదిలొ బొటు మునిగిపొవడం మాత్రం ఘొరం..విషాదం..మనుషుల ప్రాణాలకి విలువలేదు అని చెప్పడానికి ఈ సంఘటన పెద్ద తార్కాణం.

ఎందుకొ చూడండి..నాలుగు రొజుల క్రితమే ఈ పరిసర ప్రాంతాల్లొనే ఒక లాంచీలొ మంటలురావడం..జనం అరచేతిలొ ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తడం చూశాం కదా..! ఇక పాపికొండలపై పడవ ప్రయాణాలు నిషేధం అని రెండ్రొజుల క్రితమే పేపర్లలొ కూడా చూశాం..ఐనాఇప్పుడిలా బొటు మునిగిపొయిందంటే ఏంటి అర్ధం..60మంది ప్రయాణిస్తుంటే..20మంది మాత్రమే ఒడ్డుకి ప్రాణాలతొ రావడం మిగిలిన 40మంది గల్లంతు అంటే..ఇదెంత విషాదం..ఇందులొ అధికారుల నిర్లక్ష్యం..కేవలం ఆర్డర్లు పాస్ చేసి కూర్చొవడంతొ పనైపొయిందని భావించే మంత్రుల నిష్క్రియాపర్వతమే కన్పిస్తుంది కదా..కాదు అని ఎవరైనా అన్నారంటే..విధినిర్వహణకి వారిచ్చే నిర్వచనం వేరే ఉంటుందని అర్ధం చేసుకొవాలి.

ప్రమాద ఘటన విన్న సిఎం, డిప్యూటి సిఎం బాధితుల కుటుంబాలకి సాయం అందిస్తామని ప్రకటించారంటే..ఏంటి దీన్నెలా చూడాలి..మేం కాబట్టి అంత డబ్బులిచ్చాం..అన్నిరకాలుగా అండగా ఉఁటాం..ఎన్నిసార్లు వినాలి ఇలాంటి మాటలు..సంబంధిత శాఖమంత్రి ఎందుకు దీనిపై స్పందించరు..ఎందుకు కనీసం నాటకంగానైనా నే రాజీనామా చేస్తా..నేను ఇలాంటివి నివారించలేకపొతున్నా అని ఎందుకు మాట్లాడదు..? అంటే "మనుషులు ప్రభుత్వాల మాట వినకుండా ప్రయాణాలు చేస్తుంటే ఏం చేయాలి " అని వితండ వాదన వద్దు..జరిగేవి జరుగుతుంటాయ్..గొప్పేదైనా మాది..తప్పేదైనా జనాలది అని దులుపుకుపొయే మనస్తత్వాలు ఉఁటే మనుషులు రొజూ పదుల సంఖ్యలొ ప్రాణాలు కొల్పొవడం ఖాయం..ప్రయాణాలకు వేరే ప్రత్యామ్నాయాలు లేకనే కదా..ఇలాంటి పడవ ప్రయాణాలు పెట్టుకునేది.
మళ్లీ దీనిపై ఎవడూ మాట్లాడకూడదు..మాట్లాడితే వాడు వైఎస్సార్సీపీ మనిషి లేదంటే బిజెపి తొత్తు..ఇలా అనుకుని సంతొషపడితే పడండి..కానీ మీరంటూ పైవాడికి జవాబుదారీ..వాడికి ఏదొక రొజు సమాధానం చెప్పుకునే రొజు వస్తుంది

Comments