పాపం జేసీ..ఇదే చివరి అవకాశం


జేసీ దివాకర్ రెడ్డి టర్మ్ ఇక 2019తో ఎంపిగా పూర్తవుతుంది. ఎన్నికలకు ఏడాది కూడా గడువులేదు. ఈ లోపు మోడీకి వళ్లుమండి లోక్ సభ ఎన్నికల వరకైనా ముందే పెట్టాడంటే అదీ ఉండదు..అందుకే ఇప్పుడు భారీ స్థాయిలో బాబు భజన చేస్తున్నట్లు క్లియర్ గా అర్ధం అవుతోంది. మహానాడులో అంతా పసుపుమయంగా కన్పిస్తున్నా..ఈ విలక్షణ నేత మాత్రం తెల్లచొక్కాతో కన్పిస్తాడు..ఎక్కడా కనీసం పచ్చ ఐడీ కార్డు కూడా వేసుకోడు..పైగా పెద్ద మేధావిలాగా చంద్రబాబుకే సలహాలు ఇస్తాడు..పైకి నవ్వుతున్నా చంద్రబాబునాయుడు మనసులో పళ్లు నూరుకుని ఉంటాడు. ఇలాంటివాడిని తప్పక పార్టీలోకి తీసుకున్నా కానీ..ఇక ఇతగాడికి టిక్కెట్ ఇచ్చే పరిస్థితే లేదని చాలాసార్లు అన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏం చేసినా నాకు చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వడు అని స్వయంగా జేసీనే చాలాసార్లు చెప్పుకొచ్చాడు.

ఇది ఎన్నికలకు ముందు మహానాడు...ఇలా బాబు భజన చేస్తే ప్రయోజనం లేదని..ఏకంగా చినబాబు భజన మొదలుపెట్టాడు..లోకేశ్ ముఖ్యమంత్రి అయితే తప్పేంటంటూ అసందర్భంగా ప్రేలాపించడంతోనే జేసీ ఎందుకిలా మాట్లాడుతున్నాడనే విషయం అందరికీ అర్ధమైపోయింది..మామూలుగా అయితే ఈ పాత్ర పత్తిపాటి పుల్లారావ్, దేవినేని ఉమా పోషించేవాళ్లు..ఐతే ఈసారి మాత్రం ఆ టర్న్ నాకు కావాలని అడిగి మరీ తీసుకున్నట్లున్నాడు జేసీ అందుకు తగ్గట్లుగానే మైక్ లాక్కున్నా పట్టించుకోకుండా..మాట్లాడుతూనే పోయాడు..కింద యూట్యుబ్ లింక్ ఉంది చూడండి..ఆ మాటలకి చంద్రబాబు నవ్వుకున్నాడే తప్ప..ఇంకేం అనలేకపోయాడు
https://www.youtube.com/watch?v=FslpNCqHkcw

ఆయనకి విజయసాయిరెడ్డి ఆహ్వానం పలికినట్లు..అక్కడికి తనేదో ఎవడికీ సలాం చెప్పనోడిలా కాస్త సొంతడబ్బా ఆ తర్వాత బాబు డబ్బా కొట్టాడు. అంతవరకూ ఓకే కానీ మధ్యలోనే యానాది నాయాళ్లు..డ్యాష్ డ్యాష్ అంటూ నోరు పారేసుకున్న తీరు మాత్రం ఇతగాడు అసలు ఓ ఎంపి ఎలా అయ్యాడంటూ సభ్యత సంస్కారం లేదా అంటూ చీదరించుకునేలా చేసింది. వీళ్లు ఏపార్టీలో ఉన్నా వాళ్లకి తలనొప్పే అని గతంలో కూడా చాలాసార్లు చాలాసార్లు చెప్పుకున్నారు..ఇదే నిజమని అతగాడి ధోరణే రుజువు చేసింది
https://www.youtube.com/watch?v=FslpNCqHkcw

Comments