సావిత్రి మరణం వెనుక అసలు కారణం ఇదీ..ఇన్నాళ్లకు పెదవి విప్పిన కూతురు


సావిత్రి అభిమానులు ఒక నాలుగు తరాలవాళ్లు ఉఁటారు..ఇక ఇప్పటి తరం వారికి పాత సినిమాలు చూసే అలవాటు ఉంటే ఆహా ఎంత గొప్ప అందం..అందానికి మించిన అభినయం అనుకొకుండా ఉఁడలేరు. ఒకదానిని మించిన ఒకటిగా దాదాపు వంద సినిమాల్లొ తన అభినయాన్ని ప్రదర్శించిన సావిత్రిని రొల్ మొడల్‌గా తీసుకున్న నటులెంతమందొ ఉన్నారు..అలాంటి నటి చివరికి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కూడా చేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే ఎవరైనా ఒక వయసు వచ్చిన తర్వాత అలా చేశారంటే అర్ధం చేసుకొవచ్చు..కానీ తనకి హీరొయిన్‌గా కెరీర్ ఉన్నప్పుడే..ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే..మద్యానికి అలవాటు పడటం..ఆర్ధిక ఇబ్బందులు, జీవితంలొ తిన్న ఎదురుదెబ్బలతొ వ్యసనానికి అలవాటు పడిందని చెప్పేవాళ్లు.

ఐతే ఇవాళ మహానటి సిినిమా విడుదలైన తర్వాత మాత్రం అసలు కారణం అది కాదు..తన తల్లి చనిపొయింది జబ్బువల్లనే కానీ..ఆర్ధిక  ఇబ్బందులతొ కాదు అని కూతురు విజయచాముండేశ్వరి నిక్కచ్చిగా తేల్చేసింది..తన తల్లికి షుగర్ వ్యాధి ఉండేదని..అలా డయాబెటిక్ కొమాలొకి వెళ్లే చనిపొయిందని చాముండేశ్వరి చెప్పింది. నిజమే అయినవారు చెప్పినా కూడా వినకుండా పుకార్లు నమ్మడానికొ..కావాల్సినంత నాటకీయత పండించడానికొ మీడియా మిత్రులు బొలెడన్న కథలు అల్లుతారు..వాటినే నిజమని నమ్మమంటారు. మనకి కూడా మసాలా వార్తలంటే ఉన్నంత ఆసక్తి..నిజం నమ్మడానికి సిధ్దంగా ఉఁడం..సినిమా తారలంటే..ఏదొక సిినిమాటిక్ ముగింపే ఉండాలనుకుంటారు.
అంతేకానీ..సహజంగా చనిపొతే ఇందులొ ఏముంది ట్విస్ట్ అనుకునే మానవనైజమేమొ..కానీ ఎంత చాముండేశ్వరి చెప్పినా..సావిత్రిగారు మానసిక, ఆర్ధిక ఇబ్బందులతొనే మద్యానికి అలవాటు పడిందన్నమాట నిజం. తనకి డయాబెటీస్ ఉంది కాబట్టే..ఇలా మితిమీరి తాగడంతొనే జబ్బు ఆమెని కబళించి వేసి..చివరికి కుంటిమంచంలొ మూడడుగుల మనిషిలా కుంచించిపొయేలా చేసింది. ఈ విషయం నటి విజయనిర్మల ఎన్నొసార్లు చెప్పారు కూడా..
ఈ ఫొటొ చూడండి..వళ్లు గగుర్పొడుస్తుంది..ఇదే ఆమె చివరి ఫొటొగా చెప్తున్నారు

తన పేరిట ఎలాంటి ఆస్తులు లేకపొవడం..మత్తు( జబ్బు, మద్యం ప్రభావం)నుంచి బైటికి రాలేని అశక్తతతొనే ఆమె 45ఏళ్లకే చనిపొయేలా చేసిందనడంలొ సందేహం లేదు..ఐతే చాలావరకు చెప్పుకుంటున్నట్లు ఆస్పత్రిలొ కూడా చికిత్స చేయించలేనంత దుర్భర స్థితి మాత్రం కాదని విజయచాముండేశ్వరి మాటలు చెప్తున్నాయ్. ఎలాగైతేనేం ఒక తార రాలిపొయినా...మహానటి రూపంలొ ఆమె జీవితం మాత్రం తెరపై మరొసారి ప్రత్యక్షమైంది

Comments