ఎన్టీఆర్ తండ్రిగారిని హత్య చేశారా..ఇది నిజమేనా..నమ్మేలానే ఉందా


కాలగమనంలో కొన్ని విషయాలు మరుగున పడుతుంటాయ్. కొన్ని విషయాలు బైటికి వస్తుంటాయ్.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం కూడా అలాంటిదే. నందమూరి తారకరామారావుకి సంబంధించిన ఏ టాపిక్ అయినా తెలుగువారికి ఆసక్తి కలిగిస్తుంది. అలాంటిది ఆయన తండ్రికి సంబంధించిన విషయమైతే తెలుసుకోవాలనే ఉత్సుకత సహజం. నందమూరి లక్ష్మయ్య, వెంకట్రామమ్మ దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించిన ఎన్టీఆర్ తెలుగువారికి ఆరాధ్య దైవంగా మారారు. నందమూరి త్రివిక్రమరావు ఆయన సోదరుడు నందమూరి త్రివిక్రమరావు సంతానం కూడా సినిమాల్లో కొన్నాళ్లు కాలక్షేపం చేసిన సంగతి తెలిసిందే.. ఐతే ఒక్క నందమూరి తారకరామారావు సంతానం తప్పితే మిగిలిన కుటుంబసభ్యుల వివరాలు కానీ..ఫొటొలు కానీ మనకి అంత తొందరగా లభించవు..ఇక ఎన్టీఆర్ తండ్రిగారి ఛాయాచిత్రాలు మరీ అరుదు..అలాంటి లక్ష్మయ్య చౌదరి గురించి నడింపల్లి సీతారామరాజు అనే వ్యక్తి చెప్తోన్న విషయాలు ఇప్పుడు సంచలనమే కలిగిస్తున్నాయ్.

ఈయన పాతతరం జర్నలిస్టుగా చెప్తున్నారు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్రావ్, దాసరి నారాయణరావ్, దగ్గుబాటి, చంద్రబాబు, రామానాయుడు వంటి అనేకమంది ప్రముఖులతో వారి జీవనాన్ని పరిశీలించిన గతం ఉందని ఆయనే చెప్తున్నారు. వాటిలో భాగంగానే ఎన్టీఆర్ గురించి చెప్తూ..ఉదయాన్నే నిమ్మకూరులో లేచి పాలబిందెలు సైకిల్ కి కట్టుకుని రైల్వే ట్రాక్ పై గుడివాడ వెళ్లి అక్కడ పాలు పోసి వచ్చేవారని చెప్తున్నారు అది కూడా జెట్ స్పీడ్తో వెళ్లి హోటళ్లకి పాలు పోసి తిరిగి నిమ్మకూరు వచ్చి కుటుంబానికి ఎన్టీఆర్ పోషణలో సాయపడేవారని సీతారామరాజు చెప్పారు. తన తండ్రి లక్ష్మయ్య చౌదరి నుంచి వచ్చిన లక్షణాలతోనే ఎన్టీఆర్ మేరునగధీరుడిగా పౌరుషవంతుడిగా మెలిగారన్న సీతారామరాజు ఈ సందర్భంగానే ఓ షాకింగ్ న్యూస్ బైటపెట్టారు. నందమూరి లక్ష్మయ్య చౌదరిని
పక్క పొలం రైతు హత్య చేశారని..అది కూడా స్థలం వివాదంలోనే అని చెప్పాడాయన. ఇది విన్నవారికి అస్సలు నమ్మబుద్ది కాదు. ఇది జరిగింది కూడా హైదరాబాద్ లోనేనట.


అప్పటికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూడా కాలేదట. ఈ విషయాలు విన్నప్పుడు దాదాపు ఈ ఘటన 1980లలోనో.1975లలోనో జరిగి ఉండాలి. కానీ అప్పటికి ఎన్టీఆర్ పూర్తిగా తన మకాం హైదరాబాద్ కి మార్చలేదు. అంటే ఆయన మద్రాసులో ఉన్నప్పుడే ఈ ఘటన జరిగిందనుకోవాలి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తన ఆస్తులు ప్రకటించారు. అది 1983 తర్వాత జరిగింది. అప్పట్లో ఆయనకి హైదరాబాద్ శివార్లలో 2.62 ఎకరాల స్థలం ఉండేది. అదే గండిపేట కుటీరంగా కూడా పిలుచుకునేవారు. అది కాకుండా హుమాయున్ నగర్ ప్రాంతంలో నాలుగిళ్లు ఉండేవి..నడింపల్లి సీతారామరాజు చెప్తున్నట్లు లక్ష్మయ్య హత్య ఈ స్థలాల వద్ద జరిగి ఉందనుకోవాలి. లేదంటే నిమ్మకూరులోనే జరిగి ఉండాలి. కానీ అలా ఓ పెద్ద సూపర్ స్టార్ తండ్రిని హత్య చేస్తే దానిని అంత తేలికగా మర్చిపోరు జనం. ఇతర హీరోల అభిమానులు ఏదైనా మాట్లాడితేనే సహించని వీరాభిమానులు..తమ అభిమాన
కథానాయకుని తండ్రికి హాని కలిగిస్తే ఊరుకుంటారా..పైగా అది దాస్తే దాగదు కూడా..అందుకే నడింపల్లి సీతారామరాజు చెప్తోన్న విషయాలు నమ్మశక్యంగాఅన్పించవ్..అటు ఎన్టీఆర్ కూడా ఈ విషయం ఎక్కడా చెప్పలేదు అనడం కూడా గమనించాలి. అంటే ఇక ఈ సత్యం తెలిసినవాళ్లు ఎన్టీఆర్ వారసులే..వాళ్లే పెదవి విప్పితే కానీ ఈయన
చెప్పిన విషయం వాస్తవమా కాదా అనేది తేలుతుంది.


Comments

  1. నిమ్మకూరు - గుడివాడ మధ్య రెయిల్వే లైన్ లేదండి.

    ReplyDelete

Post a Comment