విధిలేక చేసిన తప్పు, హీరొయిన్‌ని కాస్తా 29ఏళ్లకే తల్లి క్యారెక్టర్లకి పరిమితం చేసింది


వయసు చూస్తే ఇంకా 40 ఏళ్లు కూడా రాలేదు..కానీ వేసేవన్నీ బరువైన పాత్రలు..ఆమెకి ఉన్న అందానికి నిజంగా హీరోయిన్ అవ్వాలి..అసలు ఒకప్పుడు హీరోయినే...మన టాప్ హీరోయిన్ అనుష్క కంటే ఉంటే ఐదేళ్లు ఎక్కువ ఉంటుందేమో..కానీ ఆమె వేసిన రాంగ్ స్టెప్‌తో  క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఆమె ఎవరో కాదు పవిత్ర ఉరఫ్ పవిత్రా లోకేష్. పేరునిబట్టే తెలిసిపోతుంది తెలుగావిడ కాదని..పవిత్రలోకేష్‌ది కన్నడబ్రాహ్మణ కుటుంబం..అక్కడి పాతతరం నటుడైన లోకేష్ కూతురే ఈ పవిత్ర. సాఫీగా జీవితం సాగి ఉంటే ఆమెకి ఉన్న తెలివితేటలకు ఏ ఐఎఎస్సో కూడా అయి ఉండేదని ఆమె సన్నిహితులు అంటుంటారు. అలా కాకపోయినా మంచి పొజిషన్లో మాత్రం ఉండి ఉండేది. సివిల్స్ ఎగ్జామ్స్ ఒకసారి రాసింది కూడా ఐతే తండ్రి చనిపోయిన తర్వాత ఉద్యోగాలు సంపాదించడంకంటే సినిమా ఛాన్సులే ఎక్కువ రావడంతో వెండితెరపైనే తన గమ్యం వెతుక్కున్నది ఆమె.నటుడు అంబరీష్ సలహాతో 1994లోనే మిస్టర్ అభిషేక్ అనే సినిమాలో నటించింది. బంగారద కలశ అనే ఇంకో సినిమా కూడా అదే సంవత్సరంలో విడుదల అయింది ఐనా పెద్దగా ఫలితం లేదు.


చేసేదిలేక తిరిగి బెంగళూరులోని ఓ  హెచ్చాఆర్ కంపెనీలో ఉద్యోగం చేయడం మొదలెట్టింది. అలా రెండేళ్లు గడిచాయ్. మళ్లీ టిఎస్ నాగాభరణ అని పాపులర్ కన్నడ డైరక్టర్ ఆమెని జానుమడ జోడి అనే సినిమాలో ఛాన్సిచ్చారు.  మధ్యలో నాయి నేరాలు సినిమాకి కర్నాటక ప్రభుత్వ అవార్డు కూడా గెలుచుకుంది. ఇక అప్పట్నుంచీ తనకి ఏ ఆఫర్ వస్తే ఆ పాత్ర చేయడం ప్రారంభించానని పవిత్ర చెప్తారు. కన్నడంలో హిట్టైన ఉల్టాపల్టా సినిమాలో అయితే ఓ వ్యాంప్ క్యారెక్టర్ కూడా చేసిందామె. ఇదే సినిమా మనకి తెలుగులో కూడా రాజేంద్రప్రసాద్ హీరోగా రీమేక్ చేశారు కూడా..ఐతే ఏ క్యారెక్టర్ పడితే ఆ క్యారెక్టర్‌లో నటించడం మూలానే మంచి హోమ్లీ హీరోయిన్ అవ్వాల్సిన ఆమె..చివరికి తల్లి పాత్రలు చేయాల్సి వచ్చిందని ఆమె కెరీర్‌ని గమనించినవాళ్లు అంటారు.


కన్నడంలో దాదాపు 150 సినిమాలు చేసిన పవిత్రలోకేష్‌కి 39ఏళ్ల వయస్సంటే ఎవరూ నమ్మరు. మన తెలుగులో అయితే మరీ ఘోరంగా తనకంటే పదేళ్లు పెద్దైన హీరోలకి కూడా తల్లిగా నటించడం గమనార్హం..ఐతే ఈ విషయంలో తాను ఇబ్బందులు ఎదుర్కోలేదని చెప్తుంది. ఎందుకంటే తన పాత్ర ఎంతవరకో అంతే కానీ..దాన్ని నిజజీవితంలో పోల్చుకోవాల్సిన అవసరం లేదంటుంది. ఇండస్ట్రీలో తప్పు ఒప్పుల గురించి మాట్లాడేకంటే, ఎవరికివారు నిజాయితీగా ఉండాలని చెప్తుందామె కన్నడనాట సినిమాల్లో నటిస్తూనే పాపులర్ టివి సీరియల్స్‌లో కూడా నటించింది పవిత్ర లోకేష్ వాటిలో కొన్ని తెలుగులోకీ డబ్  అయ్యాయ్.


తెలుగులో రవితేజ నటించిన దొంగోడుతో పరిచయం అయిన పవిత్ర లోకేష్ ప్రస్థానంలో నటనకి ప్రశంసలు తెచ్చుకున్నారు. ఈ సినిమా చేయడానికి నటుడు సాయికుమార్ ప్రోత్సాహం ఎంతో ఉందట. తాను కన్నడంలో హీరోగా చేస్తున్న సమయంలో ఉన్న పరిచయంతో ఈ పాత్రకి ఆమెని రికమండ్ చేసారట. అప్పట్నుంచీ తెలుగు సినిమాల్లో తల్లి క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిందామె. వ్యక్తిగత విషయానికి వస్తే ఈమెకి రెండు పెళ్లిళ్లు అయ్యాయని కొందరు చెప్తారు. హైదరాబాద్‌కి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌తో పెళ్లి కాగా..విబేధాలతో అది రద్దైందట, కన్నడ నటుడైన సుచేంద్రప్రసాద్‌ను 2007లో పెళ్లాడారు. ఈయనకీ ఇది రెండో పెళ్లిట. మల్లికా ప్రసాద్ అనే టివి ఆర్టిస్టుని పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చాడట. కన్నడనాటకరంగంలో ఈయనకి మంచి పేరు ఉంది. కన్నూరు హెగ్గడిది అనే సినిమాలో ఈయన నటనకు జాతీయస్థాయిలో ప్రశంసలు దక్కాయ్. సుచేంద్రప్రసాద్ స్వయంగా లాయర్ కూడా సుచేంద్రప్రసాద్ స్వయంగా గాయకుడు, మ్యూజిక్ డైరక్షన్ కూడా చేస్తాడు. తనకంటే పెద్ద వయస్సున్న హీరోలకు తల్లిగా నటించే పవిత్ర లోకేష్‌కి ఇద్దరు పిల్లలు కాగా ఒక మగపిల్లవాడు..ఇంకో ఆడపిల్లవారి వయస్సు ఒకరికి ఆరేళ్లు..ఇంకొకరికి రెండేళ్లు..పెద్ద తెలుగులో ప్రతి హీరోకి మదర్ క్యారెక్టర్‌గా నటించిన పవిత్రలోకేష్ పర్సనల్ లైఫ్‌లో సినిమా వాళ్ల నీడ పడినా దానిని అధిగమించి ప్రస్తుతం హ్యాపీగా ఉన్నానని చెప్తుంటారు. భర్త సుచేంద్రప్రసాద్ కూడా నటుడే కావడంతో ఇద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా తమ కెరీర్ లాక్కొస్తున్నారట. ఐతే ఇన్ని సినిమాల్లో చేసినా పవిత్ర లోకేష్ ఆస్తులు మాత్రం 20కోట్లు కూడా దాటకపోవడం విశేషం. సినిమాకి 5-10లక్షల లోపే ఈమె రెమ్యునరేషన్ ఉండగా..దాన్ని కూడా కొంతమంది నిర్మాతలు ఎగ్గొట్టారని వాపోతుంటారు. ఐతే భర్త సుచేంద్ర మాత్రం ప్రతి సినిమాకి 68లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటాడట. పాతికలక్షల ఖరీదు చేసే స్కోడా కారు ఉంది. పరిస్థితుల ప్రభావంతో వేసిన తప్పుటడుగు అలా ఓ అందమైన హీరోయిన్‌ని క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మిగిల్చిందని అనుకోవాలి

Comments